బోర్డ్ ప్రెసిడెంట్స్ XI
Appearance
ఇండియన్ బోర్డ్ ప్రెసిడెంట్స్ XI [1] [2] భారతదేశానికి చెందిన ఫస్ట్-క్లాస్ క్రికెట్ జట్టు. ఇది అప్పుడప్పుడు భారతదేశంలో దేశీయ స్థాయిలో ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడుతుంది. అంతర్జాతీయ సిరీస్‌ల కోసం భారతదేశంలో పర్యటించే విదేశీ జట్లతో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతుంది.
ఆడిన పోటీలు
[మార్చు]2008లో అక్టోబరు 2-5 మధ్య హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పర్యాటక ఆస్ట్రేలియా జట్టుతో టూర్ మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుకు భారత బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ నాయకత్వం వహించాడు.[3]
2017 లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండు 50 ఓవర్ల మ్యాచ్‌ల్లో ఒకదానిలో విజయం సాధించింది. 2019లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Basil Thampi included in Board President's XI, India A squads". Mathrubhumi. 3 October 2017. Retrieved 27 January 2022.
- ↑ "Sanju Samson hundred leads Board President's XI draw with Sri Lanka". Kerala Cricket Association.
- ↑ "Yuvraj to lead Board President's XI against Australia". The Indian News. Archived from the original on 3 మార్చి 2016. Retrieved 4 August 2016.