Jump to content

బ్రహ్మ ప్రకాష్ (రాజకీయ నాయకుడు)

వికీపీడియా నుండి
బ్రహ్మ ప్రకాష్
వ్యవసాయ మంత్రి
In office
1979 జూలై 30 – 1980 జనవరి 14
ప్రధాన మంత్రిచరణ్ సింగ్
అంతకు ముందు వారుసూర్జిత్ సింగ్ బర్నాలా
తరువాత వారురావు బీరేంద్ర సింగ్
నియోజకవర్గంనాంగ్లోయ్ జాట్
ఔటర్ ఢిల్లీ నుండి లోక్‌సభ
In office
1977–1980
అంతకు ముందు వారుచౌధరి దలీప్ సింగ్
తరువాత వారుసజ్జన్ కుమార్
In office
1967–1971
అంతకు ముందు వారుఖాళీ
తరువాత వారుచౌధరి దలీప్ సింగ్
In office
1962–1967
అంతకు ముందు వారునవల్ ప్రభాకర్
తరువాత వారుఖాళీ
ఢిల్లీ సదర్ నుండి లోక్‌సభ
In office
1957–1962
అంతకు ముందు వారునియోజకవర్గం ఏర్పాటైంది
తరువాత వారుశివ చరణ్ గుప్తా
1st ఢిల్లీ ముఖ్యమంత్రి
In office
1952 మార్చి 17 – 1955 ఫిబ్రవరి 12
ఛీఫ్ కమిషనర్శంకర్ ప్రసాద
ఆనంద్ దత్తహాయ పండిత్
అంతకు ముందు వారుకొత్తగా ఏర్పాటైంది
తరువాత వారుగురుముఖ్ నిహాల్ సింగ్
వ్యక్తిగత వివరాలు
జననం
చౌధరి బ్రహ్మ ప్రకాష్ యాదవ్

(1918-06-16)1918 జూన్ 16
జాఫర్‌పూర్ కలాన్
మరణం1993 ఆగస్టు 11(1993-08-11) (వయసు 75)
ఢిల్లీ
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్,
జనతా పార్టీ
నివాసంఢిల్లీ

చౌధరి బ్రహ్మ ప్రకాష్ యాదవ్ (1918-1993) ఢిల్లీకి చెందిన రాజకీయ నాయకుడు. ఢిల్లీ మొదటి ముఖ్యమంత్రి. అతనికి షేర్-ఎ-ఢిల్లీ అని పేరు.[1] 1940 లోమహాత్మా గాంధీ ప్రారంభించిన వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించిన స్వాతంత్ర్య సమరయోధుడు. అతను నైరుతి ఢిల్లీలోని షకుర్పూర్ అనే గ్రామానికి చెందినవాడు.[2]

కెరీర్

[మార్చు]

భారత స్వాతంత్ర్యోద్యమం

[మార్చు]

క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఢిల్లీలో ప్రచ్ఛన్న కార్యకలాపాల్లో పాల్గొన్న నాయకులలో అతనొకడు. స్వాతంత్ర్య పోరాటంలో అనేక సార్లు జైలు శిక్ష అనుభవించాడు.[3][4]

స్వాతంత్ర్యం తరువాత

[మార్చు]

స్వాతంత్ర్యానంతరం, ప్రకాష్ 34 సంవత్సరాల వయస్సులో ప్రణాళికాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసాడు. ఢిల్లీకి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసాడు. 1952-55లో భారతదేశంలో అత్యంత పిన్న వయస్కులైన ముఖ్యమంత్రుల్లో అతను రెండవవాడు.[5][6] పార్లమెంటులో రెండుసార్లు అతను చేసిన కృషికి గాను, సమర్థుడైన పార్లమెంటేరియన్‌గా ప్రశంసలు లభించాయి. అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, 1957 లో ఢిల్లీ సదర్ నియోజకవర్గం నుండి, 1962, 1967 ల్లో ఔటర్ ఢిల్లీ నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. తర్వాత జనతా పార్టీలో చేరాడు. 1977 లో మళ్ళీ ఔటర్ ఢిల్లీ నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. 1979 లో జనతాపార్టీ చీలిపోయినప్పుడు, అతను చరణ్ సింగ్ వర్గంలో చేరాడు. కొన్ని నెలల పాటు చరణ్ సింగ్ మంత్రివర్గంలో మంత్రి అయ్యాడు. ఆహారం, వ్యవసాయం, నీటిపారుదల, సహకార శాఖలకు క్యాబినెట్ మంత్రిగా పనిచేసాడు.[7]

అతను గ్రామీణుల కష్టాలను తగ్గించడంలో సహకార సంఘాల సామర్థ్యాన్ని త్వరగా గ్రహించాడు. 1945 లోనే అతను గ్రామ, వ్యవసాయ సహకార సంఘాలను నిర్వహించడం ప్రారంభించాడు. అతను పంచాయితీ రాజ్ సంస్థల ప్రతిపాదకుడు కూడా. బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేయడానికి, 1977 లో వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీల జాతీయ సంఘాన్ని ఏర్పాటు చేశాడు.[8]

NDDB కి చెందిన డాక్టర్ కురియన్‌తో కలిసి ప్రకాష్, సహకార సంఘాల రిజిస్ట్రార్ ద్వారా సహకార సంఘాలను విడిపించడంలో ప్రభుత్వ నియంత్రణ సంకెళ్ల నుండి సహాయపడటానికి సహకార కంపెనీల ఆలోచనను ప్రోత్సహించాడు. ఇది ప్రస్తుత ప్రొడ్యూసర్ కంపెనీ మోడల్‌కు పూర్వగామి.[9][10][11]

మూలాలు

[మార్చు]
  1. "कम उम्र में दिल्ली का मुख्यमंत्री बन गया था ये यादव नेता, लोग कहते थे शेर-ए-दिल्ली". hindi.news18.com. Retrieved 11 February 2020.
  2. [1]
  3. New Delhi News : Briefly. The Hindu (17 June 2006). Retrieved on 2018-11-21.
  4. Latest Releases. Pib.nic.in. Retrieved on 21 November 2018.
  5. "History of Delhi Legislative Assembly". Legislative Assembly of Delhi website.
  6. "Brahm Prakash: Delhi's first CM, ace parliamentarian". Hindustan Times. 27 September 2013. Archived from the original on 1 March 2014. Retrieved 22 January 2014.
  7. Kamath, M. V. (1996). Milkman from Anand: the story of Verghese Kurien. Konark Publishers. p. 386. ISBN 9788122004137.
  8. Puri, Rajinder (13 June 2007) Quota Quagmire.boloji.com
  9. Misra, Biswa Swarup (2010). Credit Cooperatives in India: Past, Present and Future. Routledge. p. 2.3. ISBN 9781136994036.
  10. State of the Indian farmer, millennium study. New Delhi: Academic Foundation in association with Dept. of Agriculture and cooperation, Ministry of Agriculture, Govt. of India. 2006. p. 90. ISBN 9788171884940.
  11. Sriram, Samar K. Datta, M.S.; Sriram, M. S. (2012). Towards a perspective on flow of credit to small and marginal farmers in India. New Delhi [etc.]: Allied. p. 48. ISBN 9788184247602.{{cite book}}: CS1 maint: multiple names: authors list (link)