బ్రాహ్మణపురుగు పాము
బ్రాహ్మణపురుగు పాము(Indotyphlopes braminus) (అంగ్లం: Brahmini Worm Snake, Brahmini Blind snake, worm snake))[1] అనేది భారతదేశంలో అన్నిటికన్నా చిన్నపాము. హిందీలో దీన్ని కీట్ సాంప్ అని, మలయాళీ భాషలో కురిడి పాంబు అని, గుజారాతీలో అంధా సాంప్ అని, బెంగాలీలో poiyen అని అంటారు. ఇది మనదేశం అడవులలో, శీలామయంగా ఉన్న ప్రదేశాలలో, మానవ ఆవాసాల పరిసరాలలో నేలలో చిన్న కలుగులు చేసుకొని ఉంటుంది.[2] జోరువానలు పడిన తరువాత సాధారణంగా ఈ పాము నేలమీద ప్రాకుంతూ కనిపిస్తుంది.[3] ఇది విషపు పాముకాదు.
ఈ పాము 5 అంగుళాల పొడవుంటుంది, ఆరు అంగుళాలకు మించి ఉండదు. ఎరుపు, మట్టిరంగులో వీపు భాగం ప్రకాశవంతంగా, పొట్ట భాగం తెల్లగా సన్నని నిగనిగ మెరిసే పొలుసులతో ఉంటుంది. చీమలు, క్రిమికీటకాలు, చెదపురుగులు, పురుగుల గుడ్లు దీని ఆహారం. ఈ జాతి పాముల్లో కేవలం ఆడవే వుంటాయని, అవి బియ్యంగింజలంత ఆరేడు గుడ్లు పెడతాయని, కాదు పిల్లలనే పెడతాయని అంటారు. ఈ పాము పగటివేళ తిరుగుతుందని తెలిసింది. ఈ పాము ఆసియా, ఆఫ్రికాలకు పరిమితమయినదని భావిస్తున్నారు.
మూలాలు
[మార్చు]1.Essay in English wikipeadia "Indophlous brhminus commonly known brahminy blind snake.
- ↑ "Ramphotyphlops braminus". Integrated Taxonomic Information System.
- ↑ Brahminy Blind Snake at the Florida State Museum of Natural History. Accessed 30 August 2007.
- ↑ Whitaker, Romulus (1978). Common Indian Snakes: A Field Guide. Chennai: Macmillan India Limited. p. 3. ISBN 978-0333901984.