Jump to content

బ్రూస్ టేపర్

వికీపీడియా నుండి
(బ్రూస్ టాపర్ నుండి దారిమార్పు చెందింది)
Rivalry and tribute (పరిశోధన గ్రంధం)

బ్రూస్ ఎలియట్ టేపర్, యూనివర్శిటీ ఆఫ్ విస్కాన్సిన్, మాడిసన్ నుండి 1966 లో సామాజిక శాస్త్ర్రం (Anthropology) లో బిఎ., 1968 లో ఇండియన్ స్టడీస్ పై (Indian Studies) లో ఎం.ఎ., పూర్తి చేసాడు. అతను 1976 లో ఓరియంటల్ పాఠశాలల్లో ఆఫ్రికన్ స్టడీస్ (school of Oriental and African Studies) పై లండన్ విశ్వవిద్యాలయం నుండి 1976 లో పి.హెచ్.డి. సామాజిక మానవ శాస్త్రంలో (social anthropology) పూర్తి చేసాడు.అతను 1966 - 67 లో యూనివర్శిటీ ఆఫ్ విస్కాన్సిన్ ద్వారా మొదటి సారి భారతదేశానికి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో కాలేజ్ ఇయర్ ఇన్ ఇండియా ప్రోగ్రాం 1966-67 (College year in India Programme 1966-67) పరిశోధనలు గావించాడు.

ఆ తరువాత అతనికి ఆంధ్రప్రదేశ్‌లో పరిశోధనలు (Doctoral research) గావించడానికి పూర్తి ఉపకారవేతనం (Fulbright-Hays Grant) లభించింది. 1970-72 లో పరిశోధన నిమిత్తం విశాఖపట్నం జిల్లా,సబ్బవరం మండలం, ఆరిపాక గ్రామంలో నివశించాడు.ఆంధ్రా విశ్వవిద్యాలయం, (Rivalry and tribute) విశాఖపట్నం జిల్లాలలోని గ్రామాలలో ఉన్న సామజిక జీవనాన్ని పరిశీలించి, సమాజం, ఆచారాల అధ్వయనం అనే గ్రంధాన్ని రచించాడు.

ఆ తరువాత University of Adelaide, దక్షిణ ఆస్ట్రేలియాలో Social Anthropology ఆచార్యునిగా పనిచేసాడు. అమెరికాకి తిరిగి వచ్చి Southern Asian Institute, Columbia University లో seminar associate గా పనిచేసాడు. ఆ తరువాత స్మిత్‌సోనియన్ ఇన్స్టిట్యూషన్, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్లో సంపాదకుని బాధ్యతలు నిర్వహించాడు.

టేపర్ ఆంధ్రప్రదేశ్ సమాజంలోని అనేక విషయాల గురించి వ్యాసాలను ప్రచురించాడు.తోలు బొమ్మలాట గురించి కూడా పరిశోధనలు చేసి వ్యాసం ప్రచురించాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

వనరులు

[మార్చు]
  • Rivalry and Tribute: Society and Ritual in a Telugu Village in South India లో రచయత పరిచయం

వెలుపలి లంకెలు

[మార్చు]