బ్లూ పారట్‌ఫిష్
Jump to navigation
Jump to search
బ్లూ పారట్‌ఫిష్ Blue parrotfish | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | S. coeruleus
|
Binomial name | |
Scarus coeruleus Edwards, 1771
[2]
|
నీలి చేప లేదా బ్లూ పారట్‌ఫిష్ అనునది అంతరించి పోవుచున్న ఒక అరుదైన చేప జాతి.
విశేషాలు
[మార్చు]- ఈ చేపలు ఎక్కువగా కోరల్ రీఫ్ రాళ్ల దగ్గర ఉంటాయి.
- ఇది సుమారు 29 అంగుళాల వరకు ఎదుగుతుంది.
- నోట్లో దంతాలతో పాటు దీనికి గొంతులోనూ పళ్లుంటాయి. వీటిని పారింగ్జల్ టూత్ అంటారు.
- చిలుక ముక్కులాంటి దీని దవడ, దంతాలతో రాళ్లపై ఉన్న ఆల్గేను తొలుస్తూ కడుపు నింపుకుంటుంది.
- గొంతులోని పళ్లతో ఏకంగా రాళ్లనే ఇసుకలా తొలిచి అందులో నాచును తినేస్తుంది. అలా రోజు మొత్తంలో 80 శాతం సమయం ఇది ఆహార వేటలో గడుపుతుంది.
- చిలుక ముక్కులాంటి దవడ ఉంటుంది కాబట్టి ఈ జాతి చేపల్ని ప్యారట్‌ఫిష్ అంటారు. కానీ దీని రంగుని బట్టి బ్లూ ప్యారట్‌ఫిష్ అని పేరు పెట్టారు.
- ఆహారం కోసం సముద్రంలో పగడపు దీవుల్లోని రాళ్లను పళ్లతో గీరడం వల్ల బోలెడంత ఇసుక తయారవుతుంది. ఇలా ఒకో చేప ఏడాదికి సుమారు 90 కిలోల ఇసుకను తయారుచేస్తుందని అంచనా. కొన్ని బీచ్‌ల్లో తెల్లగా కనిపించే ఇసుక వీటి వల్ల ఏర్పడినదే.
- వీటికి కూడా బ్లూ క్వాబ్స్, బ్లూ ప్యారట్స్, బ్లూమ్యాన్ అంటూ చాలా పేర్లు ఉన్నాయి.
- ఇవి ఎక్కువగా అట్లాంటిక్, కరిబీయన్ సముద్రాల్లో ఉంటాయి.
పరిరక్షణ
[మార్చు]ఈ చేప ఆల్గేను తిని రీఫ్‌లపై దాని వ్యాప్తిని ఆపడం ద్వారా మిగతా చేపలకు కూడా రీఫ్‌లు ఆవాసమవుతున్నాయి. కానీ ఈ నీలి చేప క్రమంగా అంతరించిపోతుండడం వల్ల రీఫ్‌లపై నాచు అధికంగా పేరుకుపోయి బోలెడు చేప జాతులకు నష్టం కలుగుతోంది. ముఖ్యంగా బ్రెజిల్ లోని సముద్రాల్లోని రీఫ్‌లు బాగా దెబ్బతింటున్నాయి. అందుకే శాస్త్రవేత్తలు ఈ చేపను కాపాడే చర్యలు మొదలెట్టారు.
మూలాలు
[మార్చు]- ↑ Rocha, L.A., Choat, J.H., Clements, K.D., Russell, B., Myers, R., Lazuardi, M.E., Muljadi, A., Pardede, S. & Rahardjo, P. 2012. Scarus coeruleus. In: IUCN 2012. IUCN Red List of Threatened Species. Version 2012.2. <www.iucnredlist.org>. Downloaded on 9 January 2013.
- ↑ "Blue parrotfish". FishBase.org. Retrieved 4 February 2012.