Jump to content

భక్త రామదాసు (సినిమా)

వికీపీడియా నుండి
భక్త రామదాసు
(1964 తెలుగు సినిమా)
దర్శకత్వం చిత్తూరు వి.నాగయ్య
నిర్మాణం చిత్తూరు వి.నాగయ్య
తారాగణం వి.నాగయ్య ,
పి.కన్నాంబ,
రామశర్మ,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
లింగమూర్తి
సంగీతం నాగయ్య, అశ్వత్థామ, ఓగిరాల రామచంద్రరావు, పద్మనాభశాస్త్రి
నిర్మాణ సంస్థ వి.యన్.ఫిల్మ్స్
భాష తెలుగు

భక్త రామదాసు 1964 డిసెంబర్ 23 విడుదలైన తెలుగు భక్తిరస చిత్రం. ఈ చిత్రాన్ని వి.ఎన్.ఫిలింస్ పతాకంపై చిత్తూరు వి.నాగయ్య నిర్మించి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేశన్, అంజలీదేవి, రేలంగి అతిథి పాత్రల్లో నటించడం విశేషం.

తారాగణం

[మార్చు]
  • చిత్తూరు వి.నాగయ్య కంచర్ల గోపన్న, రామదాసు
  • పసుపులేటి కన్నాంబ కమలాంబ
  • రామశర్మ యుక్త వయసు లో గోపన్న
  • గుమ్మడి వెంకటేశ్వరరావు - కబీర్ దాస్
  • ముదిగొండ లింగమూర్తి - మాదన్న
  • తిక్కవరపు రమణారెడ్డి - అహ్మక్షా
  • చిలకలపూడి సీతారామాంజనేయులు - ధర్మకర్త ప్రతాపగిరి పంతులు
  • వంగర వెంకటసుబ్బయ్య - పూజారి శీనయ్య
  • అల్లు రామలింగయ్య - ధర్మకర్త
  • ఏ.వి సుబ్బారావు - అక్కన్న
  • పసల సూర్యచంద్రరావు - తానీషా
  • డాక్టర్ శివరామకృష్ణయ్య - దావూద్
  • సరల బ్రాహ్మణ - మౌల్వి
  • రామప్ప పంతులు_సీతారామశాస్త్రి
  • టెన్నిస్ రామారావు - అల్లాఉద్ధిన్
  • లంక సత్యం - అబ్బాస్
  • ఋష్యేంద్రమణి - శ్యామలాంబ
  • టంగుటూరి సూర్యకుమారి - సితార బేగం
  • ప్రభావతి - చాంద్ బీబీ
  • రాజశ్రీ - యుక్తవయసులో కమల
  • రత్నపాప - దిలార
  • లక్ష్మి - సీతాంబ
  • మాస్టర్ నాగరాజు - రఘునాథ.

అతిథి నటులు

[మార్చు]
  • ఎన్.టి.రామారావు - రాముడు
  • అక్కినేని నాగేశ్వరరావు - విష్ణువు
  • శివాజీగణేశన్ - లక్ష్మణుడు
  • అంజలీదేవి - లక్ష్మి
  • రేలంగి - బడిపంతులు

సాంకేతిక వర్గం

[మార్చు]

నిర్మాణ సంస్థ.వి.ఎన్.ఫిల్మ్స్

నిర్మాత,దర్శకుడు. చిత్తూరు వి.నాగయ్య

సంగీతం . వి.నాగయ్య, అశ్వద్ధామ, ఓగిరాల, పద్మనాభ శాస్త్రి.

విడుదల 1964 డిసెంబర్ 23 .

రచన: రామదాసు, కబీర్, సముద్రాల సీనియర్.

నేపధ్యగానం. ఘంటశాల, పి.బి.శ్రీనివాస్ , కోమల,మాధవపెద్ది ,గోవిందరాజన్ , సుందరం, నాగయ్య, టీ.జి.కమలాదేవి, మహ్మద్ రఫీ, పి.సుశీల, శూలమంగళం , మంగళంపల్లి బాలమురళీకృష్ణ, జిక్కి, పిఠాపురం .

మాటలు: యడవల్లి లక్ష్మీనారాయణ, మల్లాది సత్యనారాయణ

చిత్రానువాదం: ఉప్పలదడియం నాగయ్య

ఛాయా గ్రహణం: కె ఎస్.ప్రసాద్ , జాగిర్దార్

ఎడిటింగ్: జి.డి.జోషి, ఏ.ఎస్.తంగవేలు .

పాటలు

[మార్చు]

01. అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి -ఘంటసాల,నాగయ్య,పి.బి.శ్రీనివాస్,కోమల బృందం

02. ఏదేశమునుండు వారు ఎందుండి ఇటు - మాధవపెద్ది,గోవిందరాజన్,సుందరం

03. ఓ సాధులారా ఓ భక్తులారా శ్రీరామ చంద్రుని సేవింప - నాగయ్య, టి.జి. కమలాదేవి బృందం

04. ఓం నమో విఘ్నేశ్వర (శ్లోకం) - ఘంటసాల

05. కాహేకా రోనా ధోనా హై నామ్ రామ్‌క బోల్‌రె బాబా - మహమ్మద్ రఫీ బృందం

06. కోదండరామ కోదండరామ కోదండమాంపాయి - నాగయ్య బృందం

07. దరశన్ దేనా రామా తరస్‌రహే హమ్ - మహమ్మద్ రఫీ బృందం

08. ధన్యుడనైతిని ఓ దేవా తారకమంత్రం కోరిన దొరికెను - నాగయ్య

09. దిల్‌కో హమారే చైన్ నహీ హై దేఖేబినా రామ్ కైసే జాయ్ - మహమ్మద్ రఫీ

10. నరహరిని నమ్మక నరులను నమ్మిన నరజన్మ మీడేరునా - నాగయ్య

11. నామ్ రామ్‌సె జ్యాదా భాయీ నామ్ రామ్‌సె జ్యాదా సాగర్ఊపర్ - మహమ్మద్ రఫీ బృందం

12. పాహిమాం శ్రీరామయంటే పలుకవైతివి - నాగయ్య

13. మా బావ మంచివాడు బలే మంచివాడే బహు కులాసైన వాడు - సుశీల

13. మము బ్రోవమని చెప్పవే ఓ సీతమ్మతల్లి - నాగయ్య

14. మోహనాకారా రామా రామా మోహనవిదారా రామా - శూలమంగళం సోదరీమణులు

15. మొగసి జపయఙ్ఞములు చేయ ముక్తిలేదు (పద్యాలు ) - మంగళంపల్లి

16. మున్నాట రాము నా కన్నతండ్రి ఆ కంజాక్షి జానకి ( పద్యం) - టి.జి. కమల

17. రాముడే సృజియించెను (పద్యం) నాగయ్య

18. రాముడొక్కడే నాకు సతిపన్న భాగ్యంబు జీవనాధారంబు (పద్యాలు) - నాగయ్య

19. రామ పాహిమాం సీతా రామ పాహిమాం సీతా రామ - శూలమంగళం సోదరీమణులు

20. రామ రామ రామా రామా యనరాదా .. ఓ రామ నీనామ ఏమి రుచిరా - నాగయ్య బృందం

21. రామదాసుగారు రామదాసుగారు ఇదిగో రసీదందుకోండి - మాధవపెద్ది,నాగయ్య

22. శ్రీరఘురామ భజనకు .. రామరామ రఘురామపరాత్పర - నాగయ్య బృందం

23. శ్రీరామా శ్రీవాసుదేవా హృషీకేశా వైకుంఠవాసా (దండకం) - నాగయ్య

24.ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలకవా, నాగయ్య , రచన: రామదాసు

25.ఏతీరుగ నను దయచుచేదవో , నాగయ్య, రచన: రామదాసు

26.దశరథ రామా గోవిందా మము దయచూడు , నాగయ్య, రచన: రామదాసు

27.మంగళ మనరే మంగళ మనరే అంగన నెల్లరు గూడి, టి.జి.కమలాదేవి

28.మాయాకా సంసార్ హై సారా మాయాకా సంసార్, మహ్మద్ రఫీ

29.మొహసీ తీర్ధాల మునిగిన ముక్తిలేదు భక్తితో , మంగళంపల్లి బాలమురళీకృష్ణ

30.రాఘవ ధరణి సుతాదవా గురు విభవ రవికుల, నాగయ్య బృందం

31.రామ సూదాంబుది రామా రామా మాపై ఎందు , టి.జి.కమలాదేవి బృందం

32.రామా రామా రఘురామ పరాత్పర రావణ సంహార , నాగయ్య

33.రారండమ్మ రారండమ్మా పిల్లలారా రండి , టి.జి.కమలాదేవి

34.రావే రావే మఘాక రంగు నేస్తాము రావే , పిఠాపురం, జిక్కి, రచన: సముద్రాల సీనియర్

35.సున్ బీలే భక్తొoకి పుకార్ తన్మన్ మే , మహ్మద్ రఫీ, రచన: కబీర్,సంగీతం . అశ్వత్థామ

36.కైసా షీరీన్ వహ్వా షిరిన్ అచ్చా షిరిన్ , జిక్కి బృందం

37.కొలిచిన భత్యము కింద పెట్టరా , నాగయ్య

38.దౌలత్ దునియా తన్ కీ కుషి హై , మహ్మద్ రఫీ, రచన: కబీర్, సంగీతం.అశ్వద్ధామ

39.కరిరాజ వరదనే శరణు వేడిన గాని కరుణ (పద్యం), నాగయ్య , రచన :రామదాసు,

40 . చేతన్ లేదోక గవ్వ నాకు నిధియా,(పద్యం) నాగయ్య

41.చోరులు కోరని నిధియై పేరాశను పెంచు (పద్యం), మంగళంపల్లి బాలమురళీకృష్ణ

42.నిరాదారుడై నిల్చు నిర్భాగ్యుడైనన్ పరాదీనతన్ చెందు(పద్యం), నాగయ్య

43.భద్రాద్రి రఘురామ భజనకు చనుచుండు బంధుమిత్ర , నాగయ్య

44.శ్రీరామ మంత్రంబు చిత్తోపదేశంబు భవబీతి (పద్యం), మంగళంపల్లి బాలమురళీకృష్ణ

45.సీతా దరాజాత శ్రీలక్ష్మి కమలాక్షి కాచవే తల్లి,(పద్యం), నాగయ్య

46.ఏ మహనీయ తేజుడు మునీంద్ర నియోగము సిద్ది(పద్యం), మంగళంపల్లి బాలమురళీకృష్ణ

47.అరెరే కైసా అజబ్ భరోసా అదా కీయా పైసా రాందాస్, పిఠాపురం నాగేశ్వరరావు

48.నమ్మితి నీవే దిక్కని అనాథ శరణ్య వరేన్య కేశవా,(పద్యం), నాగయ్య

49.మిమ్ము నిర్మించిన మేటి దేవుడొకింత యాలయం,(పద్యం), నాగయ్య, టీ.జి.కమలాదేవి

50.మాభూమి వంటి భూమి లేదు మరి భరతభూమి

51. శుద్ధ బ్రహ్మ పరాత్పరరాం కాలాత్మక పరమేశ్వర, నాగయ్య

మూలాలు

[మార్చు]