భగవత్ కరాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భగవత్ కిషన్ రావు కరాద్
భగవత్ కరాద్


కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2021 జూలై 7 (2021-07-07)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు అనురాగ్ సింగ్ ఠాకూర్

రాజ్యసభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
ఏప్రిల్ 2020
నియోజకవర్గం మహారాష్ట్ర

వ్యక్తిగత వివరాలు

జననం (1956-07-16) 1956 జూలై 16 (వయసు 67)
చిఖలీ, లాతూర్ జిల్లా, మహారాష్ట్ర
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి అంజలి
వృత్తి వైద్యుడు, రాజకీయ నాయకుడు

భగవత్ కరాద్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 2021 జూలై 7 నుండి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[1][2]

రాజకీయ జీవితం[మార్చు]

భగవత్ కరాద్ 1996లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలిచి రెండుసార్లు  ఔరంగాబాద్‌ మేయర్‌గా పని చేశాడు. ఆయన తరువాత బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, మరత్వడా స్టాట్యూటరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా పనిచేసి మరత్వడాలో పార్టీ బలోపేతానికి కృషి చేశాడు.

భగవత్ కరాద్ 2020 ఏప్రిల్లో మహారాష్ట్ర నుండి రాజసభ సభ్యుడిగా ఎన్నికై, 2021 జూలై 7న నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా నియమితుడయ్యాడు.[3]

మూలాలు[మార్చు]

  1. BBC News తెలుగు (7 July 2021). "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.
  2. Namasthe Telangana (7 July 2021). "మోదీ మంత్రివర్గంలో కొత్తగా నలుగురు డాక్టర్లు". Archived from the original on 5 April 2022. Retrieved 5 April 2022.
  3. Free Press Journal (7 July 2021). "Who is Dr Bhagwat Kishanrao Karad? All you need to know about Rajya Sabha MP who is now MoS in Ministry of Finance" (in ఇంగ్లీష్). Archived from the original on 6 April 2022. Retrieved 6 April 2022.