భాంగ్రా (నృత్యం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంజాబ్ లోని భాంగ్రా నృత్యం
దుబాయ్ లోని బాంగ్రా నృత్య కళాకారుల బృందం

భాంగ్రా (నృత్యం) పంజాబు జానపద కళా రూపాలలో పేరెన్నిక గన్నదీ, ప్రజల నెక్కువగా ఆకర్షించేది. గోదుమ విత్తనాలను చల్లే సమయంలో ఎంతో ఆనందంగా సామూహికంగా ఈ భాంగ్రా నృత్యాన్ని చేస్తారు. ఈ నృత్యాన్ని భారత దేశంలో అన్ని ప్రాంతాల వారు మెచ్చు కోవటమే కాక విదేశీయుల మన్ననలను కూడ అందుకుంది.[1] ఇది పంజాబు జానపద నృత్యాలలో అత్యంత ప్రజాదరణపొందిన నృత్యం.[2]

భాంగ్రా నృత్య వస్త్రధారణ

[మార్చు]

వాద్య పరికరాలు

[మార్చు]

విశేషాలు

[మార్చు]

స్వయంసిద్ధమైన ఉల్లాస స్వభావం గల ఈ నృత్యం అన్ని పండుగల సందార్భాలలోనూ ప్రీతి ప్రాత్రంగా ఉంటుంది. ఈ నృత్యం సరళమైన సమాజ నృత్యం. ఈనృత్యంలో ఎవరైనా ఏ సమయంలోనైనా పాల్గొన వచ్చును. గోధుమ విత్తనాలు చల్లడంతో భంగ్రానృత్య ఋతువు ఆరంభమవుతుంది. అప్పుడు భాంగ్రా భేరి మ్రోగగానే, పూర్ణ చంద్రుని వెన్నెలలో ఏదో ఒక విశాల మైదానంలో గ్రామంలోని యువకులు చేరుతారు. వర్తకులు వలయాకారంగా నృత్యం చేస్తుంటారు. అయితే నృత్యం జరుగుతున్నపుడు ఎంతమందిబడితే అంతమంది నృత్యానికి అడ్డురాకుండా చేరటానికి వీలుగా ఆ నలౌఅం వలయం ఏర్పడుతుంది. డోలు వాద్యగాడు, డోలు మెడకు తగిలించుకొని అప్పుడప్పుడు గమనవేగాన్ని పెంచవలసింగా నర్తకులకు సంజ్ఞచేస్తూ వలయం మధ్య నిలిచిఉంటాడు. డోలు వాద్యగాని వెనుక ఇద్దరు లేక ముగ్గురు వ్యక్తులు నిలిచి నృత్యాన్ని నడుపుతూ ఉంటారు. వీరు నృత్యం వృత్తిగా గలవారు కారు. సమాజంలోని సామాన్య సభ్యులలోనివారే. అయితే ఇతర సభ్యులకంటే సులభంగా అభినయం చేయగలరు. భాంగ్రాలో శాస్త్ర నిబంధనలేవీ లేవు. నృత్యం మామూలుగా సాగిపోతూ ఉంటుంది. నర్తకులు అడుగులు వేస్తూ చేతులు చరుస్తూ, కర్రలు ఆడిస్తూ, నృత్యంలోని ఆనంద పారవశ్యాన్ని ఉద్వేజితం చేయటానికి 'హొయ్,హొయ్; అప్అప్' అని అరుస్తూ గిర్రున తిరుగుతూ ఉంటారు.

నృత్యం మధ్యమధ్య ఆపి ధోల్లా లేక బోలీ (పంజాబు సంప్రదాయ జానపదగేయం) పాడుతారు. అటు తరువాత మరల నృత్య మారంభిస్తారు. నృత్యం చేయటానికి నర్తకులు సొగసైన దుస్తులు వేసుకొంటారు. నిండురంగుగల పట్టుపట్కా (శిరోవేష్టనము) లచ్‌చా 9అనురూప వర్ణంగల కటివస్త్రం లేక చుట్టుగుడ్డ), పొడవాటి తెల్లని పంజాబీ కుర్తా, తళతళ మెరిసే తెల్లని గుండీలు పొదిగిన నల్లటి చంకకోటు, ఈ వేషాన్ని పరిపూర్తి చేస్తాయి. వీనికితోడు చీలమండలమీద ఘంఘ్రాలు ధరిస్తారు. గోధుమ విత్తటంతో ప్రారంభమయ్యే భాంగ్రా ఋతువులో, ప్రతి పౌర్ణమి రోజున గ్రామంలోని యువకులు ఏదో ఒక ఖాళీ పొలంలో చేరి డోళ్ళు మ్రొగుతుండగా, అలసేవరకూ నృత్యం చేస్తూ పాటలు పాడుతారు. బైశాఖ- కోతపండుగతో భాంగ్రా ఋతువు అంతమవుతుంది; అప్పటికి, పసిడి గోధుమ పైరు కోయటం, గాదులు నిండటం జరుగుతుంది. యధార్ధానికి భాంగ్రాను పంజాబు పురుషులు చేసే జాతీయ సామాజిక నృత్య మని పిలువవచ్చును. పంజాబీ స్త్రీలు చేసే గిద్ధ నృత్యంకూడా ఇటువంటిదే. ఇది పాత కాలపు వలయనృత్యం. దీనిలోని సరళ సుందరగతులు అంత నేత్రపర్వంగా ఉంటాయి. ఒక గీతంలోని ఈ దిగువ చరణాలు స్త్రీల జీవితాలలో దీని ప్రాముఖ్యాన్ని సూచిస్తున్నాయి.[3]


ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

యితర పఠనాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]

The home of Bhangra on the internet http://gabroo.tv