Jump to content

భాగ్యశ్రీ బోర్సే

వికీపీడియా నుండి
భాగ్యశ్రీ బోర్సే
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2023 - ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ ప్రకటన

భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.[1][2] అంతే కాదు, ఈ సినిమాలో తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది.

కెరీర్

[మార్చు]

నైజీరియాలోని లాగోస్ లో భాగ్యశ్రీ బోర్సే చదువుకుంది. భారతదేశం తిరిగి వచ్చి ఆమె బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీలో చేరింది. ఆ సమయంలోనే మోడలింగ్ కెరీర్ గా ఎంచుకుని ఒక ఎజెన్సీతో కలసిపనిచేసింది. పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించింది. క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్ తో ఆమె ప్రసిద్ధిచెందింది. అలా బాలీవుడ్ చిత్రం యారియాన్ 2లో రాజ్యలక్ష్మి పాత్రలో తన నటనతో యువతను ఆకట్టుకుంది. ఆ తరువాత, ఆమె చందు ఛాంపియన్ లోనూ నటించింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ (2024) చిత్రంలో రవితేజ సరసన ఆమె నటించింది.[3]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనిక మూలం
2023 యారియాన్ 2 రాజలక్ష్మి "రాజీ" కరియప్ప హిందీ
2024 చందు ఛాంపియన్ నయనతార [4]
మిస్టర్ బచ్చన్ జిక్కి తెలుగు [5]

మూలాలు

[మార్చు]
  1. "మాస్‌ మహారాజాకి జోడీగా క్లాస్‌ మహారాణి.. ఎవరీ భాగ్యశ్రీ బోర్సే? | Bhagyashri Borse Comes On Board For Ravi Teja, Harish Shankar Latest Film - Sakshi". web.archive.org. 2023-12-18. Archived from the original on 2023-12-18. Retrieved 2023-12-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Bhagyashri Borse: 'మిస్టర్‌ బచ్చన్‌' బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే | interesting facts about Bhagyashri Borse". web.archive.org. 2024-08-15. Archived from the original on 2024-08-15. Retrieved 2024-08-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "క్లాస్‌ మహారాణి.. భాగ్యశ్రీ బోర్సే". web.archive.org. 2023-12-18. Archived from the original on 2023-12-18. Retrieved 2023-12-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "Meet Bhagyashri Borse: The mystery girl from Kartik Aaryan's 'Chandu Champion'". The Times of India. 2024-05-26. ISSN 0971-8257. Retrieved 2024-07-18.
  5. "First Single Sitar From Mass Maharaja Ravi Teja And Bhagyashri Borse's Film Mr Bachchan Is Out Now". Times Now (in ఇంగ్లీష్). 2024-07-10. Retrieved 2024-07-18.