Jump to content

భారతం శ్రీమన్నారాయణ

వికీపీడియా నుండి

భారతం శ్రీమన్నారాయణ ఒక సంస్కృతాంధ్ర పండితుడు, కవి. సంస్కృత అధ్యాపకునిగా, ప్రాచార్యునిగా పనిచేశారు. ఆయన బహుగ్రంథ కర్త.

కుటుంబ విశేషాలు

[మార్చు]

శ్రీ భారతం శ్రీమన్నారాయణ విశ్వనాథ శాస్త్రి, అన్నపూర్ణమ్మ గార్లకు మే 1942లో ప.గో.జిల్లా లోని కానూరు అగ్రహారంలో జన్మించారు. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆయన ఇద్దరు అన్నలు, ఇద్దరు అక్కలు, ముగ్గురు చెల్లెళ్ళ మధ్య ఆచార వ్యవహారాలతో పెరిగారు.

1960లో గురువుగారైన ఆకెళ్ళ అరుణాచల శాస్త్రి గారి అమ్మాయి కమలాంబను వివాహం చేసుకున్నారు. ఈవిడ రిటైర్డ్ తెలుగు పండితురాలు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె, ఒక మనుమడు, ఐదుగురు మనుమరాండ్రు.

చదువుసంధ్యలు

[మార్చు]

నిడదవోలులో ఉన్నత పాఠశాల విద్యనభ్యసించి, రాజమండ్రిలోని శ్రీగౌతమీ విద్యాపీఠంలో భాషా ప్రవీణ, గుంటూరులోని ఎ.యు.పి.జి. సెంటర్ లో యం.ఏ (తెలుగు), ప్రైవేటుగా యం.ఏ (సంస్కృతం - వ్యాకరణం) పూర్తి చేశాడు.

ఉద్యోగం

[మార్చు]
  • 1962 నుండి 1972 వరకు ప.గో.జిల్లా పరిషత్తులో తెలుగు పండిత పదవి.
  • 1972 నుండి 1976 వరకు వరకు భీమవరం-ఓరియంటల్ సంస్కృత కళాశాలలో ఆంధ్రోపన్యాసక పదవి.
  • 1976 నుండి పై కళాశాలలో ప్రిన్సిపాల్ పదవి.
  • 1997 నుండి కృష్ణాజిల్లా చిట్టుగూడూరులోని ఎస్.ఎన్.ఎస్. కళాశాలలో ప్రిన్సిపాల్ పదవి.
  • 1999 ఫిబ్రవరిలో పదవీ విరమణ.

రచనలు

[మార్చు]

పాంచాలి, వివేకభారతము, రమణాయనము, సౌందర్యలహరి