భారతదేశంలో అక్షరాస్యత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
link=%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:India_literacy_rate_map_en.svg

భారతదేశంలో అక్షరాస్యత సామాజిక-ఆర్థిక పురోగతికి కీలకంగా ఉంది, [1] భారత అక్షరాస్యత రేటు 2007లో 68%నికి పెరిగింది, 1947లో బ్రిటీష్ పాలన ముగిసిన సమయంలో దేశ అక్షరాస్యత రేటు 12% మాత్రమే ఉంది.[2][3] నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ (NSSO) జూన్ 2008లో నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం, 7 మరియు అంతకంటే ఎక్కువ వయస్సుగల జనాభాలో అక్షరాస్యత రేటు 72% వద్ద ఉండగా, వయోజనుల్లో (15 మరియు అంతకంటే ఎక్కువ వయస్సుగలవారు) అక్షరాస్యత రేటు 66% వద్ద ఉంది.[4] ఇదిలా ఉంటే, భారత అక్షరాస్యత రేటు, ఐదురెట్ల కంటే ఎక్కువ వృద్ధి సాధించినప్పటికీ, ప్రపంచ అక్షరాస్యత సగటు 84%తో పోలిస్తే ఇప్పటికీ తక్కువగానే ఉంది, [5] ప్రపంచంలో భారతదేశం ప్రస్తుతం అతిపెద్ద నిరక్షరాస్య జనాభా ఉన్న దేశంగా గుర్తించబడుతుంది.[6] అనేక ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ, భారతదేశ అక్షరాస్యత శాతం మందకొడిగానే వృద్ధి చెందింది, [7] 1990నాటి ఒక అధ్యయనం, అప్పటి పురోగతి రేటుతో ప్రపంచవ్యాప్త అక్షరాస్యత స్థాయి సాధించడానికి భారతదేశానికి 2060 వరకు సమయం పడుతుందని సూచించింది.[8] ఇదిలా ఉంటే, 2001 జనాభా లెక్కలు 1991-2001 దశాబ్దంలో 12.63% అక్షరాస్యత వృద్ధి నమోదయినట్లు సూచించింది, ఇది అత్యంత వేగవంతమైన వృద్ధిగా రికార్డు సృష్టించింది.[9]

భారతదేశంలో అక్షరాస్యత రేటులో విస్తృత స్థాయిలో లింగపరమైన అసమానత ఉంది: వయోజనుల (15 కంటే ఎక్కువ వయస్సుగలవారు) అక్షరాస్యత రేటు 2009లో పురుషుల్లో 76.9% వద్ద ఉండగా, మహిళల్లో ఇది 54.5% వద్దే ఉంది.[10] తక్కువ మహిళా అక్షరాస్యత రేటు భారతదేశంలో కుటుంబ నియంత్రణ మరియు జనాభా స్థిరీకరణ చర్యలపై నాటకీయంగా ప్రతికూల ప్రభావం చూపుతుంది. మహిళా అక్షరాస్యత పెళ్లైన భారతీయ జంటల్లో గర్భ నిరోధక చర్యల వినియోగం యొక్క బలమైన సూచీగా ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి, మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం లేనప్పుడు లేదా ఉన్నప్పుడు రెండు సందర్భాల్లో ఇది ప్రభావ కారకంగా ఉంది.[11] 2001 జనాభా లెక్కల్లో మహిళా అక్షరాస్యత రేటు (14.38%) పెరగడంతో ఈ విషయంలో సానుకూల సంకేతం కనిపించింది, అంతేకాకుండా పురుషుల అక్షరాస్యత రేటు (11.13%) కంటే 1991-2001 దశాబ్దకాలంలో మహిళా అక్షరాస్యత రేటులో ఎక్కువ పెరుగుదల నమోదయింది, తద్వారా లింగ అంతరం తగ్గుతున్న సంకేతాలు కనిపించాయి.[9]

విషయ సూచిక

తులనాత్మక అక్షరాస్యత గణాంకాలు[మార్చు]

ప్రపంచంలో 35% నిరక్షరాస్య జనాభా భారతదేశంలోనే ఉంది, ప్రపంచవ్యాప్తంగా అక్షరాస్యత వృద్ధిలో చారిత్రక క్రమాలు ఆధారంగా, 2020నాటికి ప్రపంచంలో అత్యధిక మంది నిరక్షరాస్యులు భారతదేశంలోనే ఉంటారని అంచనా వేశారు.[12][13]

ఈ కింద ఇచ్చిన పట్టిక భారతదేశంలో మరియు కొన్ని పొరుగు దేశాల్లో 2002నాటి వయోజన మరియు యువజన అక్షరాస్యత రేట్లను అందిస్తుంది.[14] వయోజన అక్షరాస్యత 15 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిని సూచిస్తుంది, యువజన అక్షరాస్యత 15–24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారిని సూచిస్తుంది, (అంటే యువజన అక్షరాస్యత వయోజన అక్షరాస్యతలో ఒక ఉపసమితిగా చెప్పవచ్చు).

దేశం వయోజన అక్షరాస్యత రేటు యువజన అక్షరాస్యత రేటు
చైనా 93.3% (2007) [15] 98.9% (2004) [16]
శ్రీలంక 90.8 (2007) 98.0
బర్మా 89.9% (2007) [17] 94.4% (2004) [18]
ఇరాన్ 82.4% (2007) [19] 95% (2002) [20]
ప్రపంచ సగటు 84% (1998) [5] 88% (2001) [21]
భారతదేశం 66.0% (2007) [3] 82% (2001) [3]
నేపాల్ 56.5 (2007) 62.7
పాకిస్తాన్ 54.2 (2007) [22] 53.9
బంగ్లాదేశ్ 53.5 (2007) 49.7

అక్షరాస్యత వృద్ధి[మార్చు]

బ్రిటీష్ కాలం[మార్చు]

link=%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:India_Literacy_Rate_1901-2001.jpg

బ్రిటీష్ పాలనాకాలంలో, విద్యా పురోగతిలో జాప్యం జరిగింది. 1881-82 మరియు 1946-47 మధ్యకాలంలో, ప్రాథమిక పాఠశాలల సంఖ్య 82,916 నుంచి 134,866కు పెరిగింది, విద్యార్థుల సంఖ్య 2,061,541 నుంచి 10,525,943కు పెరిగింది. బ్రిటీష్ ఇండియాలో అక్షరాస్యత రేట్లు 1881లో 3.2 శాతం నుంచి 1931లో 7.2 శాతానికి మరియు 1947లో 12.2 శాతానికి పెరిగాయి.[2] 2000-01లో, దేశంలో 60,840 ప్రీ-ప్రైమరీ మరియు ప్రీ-బేసిక్ పాఠశాలలు మరియు 664,041 ప్రాథమిక మరియు జూనియర్ బేసిక్ పాఠశాలలు ఉన్నాయి.[23] ప్రాథమిక స్థాయిలో చదువుతున్న మొత్తం విద్యార్థుల సంఖ్య 1950-51లో 19,200,000 వద్ద ఉండగా, 2001-02లో 109,800,000 మందికి పెరిగింది.[24] 2000-01లో ఉన్నత పాఠశాలల సంఖ్య స్వాతంత్ర్య సమయంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల సంఖ్య కంటే ఎక్కువగా ఉంది.[2][23]

1944లో, బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం భారతదేశంలో విద్యా రంగ పునర్నిర్మాణానికి ఒక ప్రణాళికను ప్రతిపాదించింది, దానిని సెర్జెంట్ పథకం అని పిలుస్తారు, 40 ఏళ్లలో, అంటే 1984నాటికి 100% అక్షరాస్యత సాధించడం ఈ కార్యక్రమ లక్ష్యంగా ఉంది.[25] భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న నాయకులు సార్వజనిక అక్షరాస్యతను సాధించేందుకు 40 ఏళ్ల కాల వ్యవధి చాలా ఎక్కువని ఈ ప్రణాళికను అపహాస్యం చేశారు, [25] 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అక్షరాస్యత 64% వద్ద మాత్రమే ఉండటం గమనార్హం.

స్వాతంత్ర్యం తరువాత[మార్చు]

6-14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న బాలలందరికీ సార్వజనిక మరియు నిర్బంధ విద్య అందించాలనే చట్టాన్ని ఒక ప్రతిష్ఠాత్మకమైన జాతీయ ఆదర్శంగా స్వీకరించారు, రాజ్యాంగంలోని 45వ అధికరణలో ఒక ఆదేశక విధానంగా చేర్చడం ద్వారా దీనికి అత్యంత ప్రాధాన్యత కల్పించారు, 1949లో రాజ్యాంగాన్ని స్వీకరించిన తరువాత అర శతాబ్దానికిపైగా కాలం గడిచిపోయినప్పటికీ ఆశించిన అక్షరాస్యత రేటు సాధ్యపడలేదు. పార్లమెంట్ 2002లో రాజ్యాంగ 86వ సవరణ చట్టాన్ని ఆమోదించింది, ఈ సవరణ చట్టంతో 6-14 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న బాలలందరికీ ప్రాథమిక విద్యను ఒక ప్రాథమిక హక్కుగా మార్చారు.[26] విద్యకు మరిన్ని నిధులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు, ఆర్థిక (నెం. 2) చట్టం, 2004 ద్వారా అన్ని ప్రత్యక్ష మరియు పరోక్ష కేంద్ర పన్నుల్లో 2 శాతం విద్యా రుసుం (సెస్-పన్నుయేతర రుసుము) విధిస్తున్నారు.[27]

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి, అక్షరాస్యత రేటు 1951లో 18.33 శాతం వద్ద ఉండగా, 1961లో 28.30 శాతం, 1971లో 34.45 శాతం, 1981లో 43.57 శాతం, 1991లో 52.21 శాతం, మరియు 2001లో 64.84 శాతం ఉంది.[28] ఇదే కాలంలో, దేశ జనాభా 361 మిలియన్‌ల నుంచి 1,028 మిలియన్‌లకు పెరిగింది.

రాష్ట్రాల మధ్య అక్షరాస్యత రేటులో వ్యత్యాసాలు[మార్చు]

దస్త్రం:Literacy Bar Chart.jpg
link=%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Literacy_Bar_Chart.jpg

భారతదేశంలో కేరళ అత్యధిక అక్షరాస్యత రేటు సాధించిన రాష్ట్రంగా గుర్తించబడుతుంది, ఈ రాష్ట్ర అక్షరాస్యత రేటు 94.59% వద్ద ఉంది, [29] దీని తరువాతి స్థానంలో 88.80% అక్షరాస్యతతో మిజోరాం ఉంది. భారతదేశంలో బీహార్ 47% అక్షరాస్యతతో, అతితక్కువ అక్షరాస్యత ఉన్న రాష్ట్రంగా గుర్తించబడుతుంది. రెండు రాష్ట్రాల్లో పుట్టినప్పుడు జీవనకాలపు అంచనా (కేరళలో పురుషులకు 71.61 మరియు మహిళలకు 75కాగా, బీహార్‌లో పురుషులకు 65.66 మరియు మహిళలకు 64.79 వద్ద ఉంది), ప్రతి 1000 జననాల్లో శిశు మరణాలు (కేరళలో 10కాగా, బీహార్‌లో 61), ప్రతి 1000 మంది పౌరులకు జననాలు (కేరళలో 16.9 వద్ద ఉండగా, బీహార్‌లో 30.9) మరియు ప్రతి 1000 మంది పౌరులకు మరణాలు (కేరళలో 6.4కాగా, బీహార్‌లో 7.9) వంటి అనేక ఇతర సామాజిక సూచికలు ఈ అక్షరాస్యత రేట్లతో పరస్పర సంబంధం కలిగివున్నాయి.[30] భారతదేశంలో 100% అక్షరాస్యత సాధించిన మొట్టమొదటి జిల్లాగా కేరళలోని ఎర్నాకులం గుర్తింపు పొందింది.

1881 నుంచి ప్రతి జనాభా లెక్కల్లో దేశంలో అక్షరాస్యత పురోగమన బాటలోనే ఉంది, అయితే జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉండటంతో, ప్రతి దశాబ్దంలో నిరక్షరాస్యుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. 1991-2001 దశాబ్దంలో భారతీయ నిరక్షరాస్యుల సంఖ్య మొదటిసారి తిరోగమనం చెందింది (ఈ దశాబ్దకాలంలో నిరక్షరాస్యుల సంఖ్య 32 మిలియన్‌ల మేర తగ్గింది), తద్వారా జనాభా వృద్ధి రేటును అక్షరాస్యత వృద్ధి రేటు అధిగమిస్తున్నట్లు సంకేతాలు కనిపించాయి.[31] బీహార్, నాగాల్యాండ్ మరియు మణిపూర్ రాష్ట్రాల్లో మాత్రమే 1991-2001 దశాబ్దంలో నిరక్షరాస్యుల సంఖ్యలో పెరుగుదల నమోదయింది, అయితే ఈ రాష్ట్రాల్లో నిరక్షరాస్యుల శాతంలో క్షీణత నమోదయింది.[31]

2001 జనాభా లెక్కల ప్రకారం మెజారిటీ జనాభా నిరక్షరాస్యులుగా ఉన్న రాష్ట్రంగా బీహార్ ఉంది, ఆ సమయంలో ఈ రాష్ట్రంలో 53% జనాభా నిరక్షరాస్యులుగా ఉన్నారు. అంతేకాకుండా బీహార్ 60% కంటే తక్కువ పురుష జనాభా అక్షరాస్యులుగా ఉన్న ఏకైక రాష్ట్రంగా కూడా ఉంది.[32] భారతదేశంలో 70% మంది నిరక్షరాస్యులు ఆరు రాష్ట్రాల్లోనే ఉన్నారు: అవి ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్.[32] భారతీయ నిరక్షరాస్యుల్లో దాదాపుగా సగం మంది (48.12%) ఆరు-హిందీ-మాట్లాడే రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ మరియు చత్తీస్‌గఢ్‌లలో ఉన్నారు.[32]

పక్కపక్క రాష్ట్రాల్లో కూడా అక్షరాస్యతలో పెద్ద వ్యత్యాసాలు ఉన్నాయి. అగ్రస్థానంలో మరియు అట్టడుగు స్థానంలో కొద్ది రాష్ట్రాలు మాత్రమే ఉండగా, ఎక్కువ రాష్ట్రాలు జాతీయ సగటుకు అటుఇటుగా ఉన్నాయి.

భారతదేశంలో రాష్ట్రాల అక్షరాస్యత చర్యలపై అవగాహన[మార్చు]

link=%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:School_children_line_Cochin_Kerala_India.jpg

భారతదేశంలోని పలు రాష్ట్రాలు అక్షరాస్యత రేట్లను మెరుగుపరిచేందుకు విజయవంతమైన కార్యక్రమాలను అమలు చేశాయి. కాలక్రమంలో, పలు కారణాలు విజయానికి దోహదపడ్డాయి: అధికారులు విజయం సాధించేందుకు, కార్యక్రమ అమలులో ప్రజలను పాలుపంచుకునేలా చేసేందుకు ఉద్దేశపూర్వక చర్యలు, మౌలిక సదుపాయాలు మరియు ఉపాధ్యాయుల సరిపడా నిధులు సమకూర్చడం, ప్రజలు విలువైనవాటిగా భావించే అదనపు సేవలు (ఉచిత పాఠశాల భోజనాలు వంటివి) అమలు చేయడం జరిగింది.

బీహార్ అక్షరాస్యత సవాళ్లు[మార్చు]

భారతదేశంలో బీహార్ రాష్ట్రం అతితక్కువ అక్షరాస్యత రేటు కలిగివుంది, 2001 జనాభా లెక్కలు ప్రకారం, మెజారిటీ సంఖ్యలో పౌరులు (53% మంది) నిరక్షరాస్యులుగా ఉన్న ఏకైక రాష్ట్రం ఇదే కావడం గమనార్హం. అయితే బీహార్‌లో కూడా అక్షరాస్యత రేటు పెరుగుతుంది: 1991లో రాష్ట్రంలో అక్షరాస్యత రేటు 39% వద్ద ఉండగా, 2001లో 47%నికి పెరిగింది.[33] బీహార్ రాష్ట్ర ప్రభుత్వం అక్షరాస్యత శాతాన్ని మెరుగుపరిచేందుకు అనేక కార్యక్రమాలు ప్రారంభించింది, బీహార్ రాష్ట్ర ప్రభుత్వంలోని వయోజన విద్యా విభాగం 1981లో ఒక UNESCO అవార్డు గెలుచుకుంది.[34]

అధ్యయనాల్లో తరచుగా బీహార్‌లో అక్షరాస్యత కార్యక్రమాలకు విస్తృత దారిద్ర్యం, పాతుకపోయిన తరతమశ్రేణి సామాజిక అంతరాలు మరియు విద్యా ప్రాప్తి మరియు ఉద్యోగ అవకాశాల్లో సహసంబంధం లేకపోవడం తదితరాలు ప్రధాన అవరోధాలుగా సూచించబడుతున్నాయి. నిమ్మ కులాలకు చెందిన పిల్లలు ఎక్కువగా పాఠశాలలకు వెళ్లకపోవడం మరియు వారు వెళ్లినప్పుడు వేధింపులకు గురిచేయడం జరిగింది.[33] నిధుల కొరత మరియు దారిద్ర్య కుటుంబాలు ఉన్న ప్రాంతాల్లో వర్గవివక్ష లేనప్పటికీ బాలలకు పాఠ్యపుస్తకాలు మరియు ఇతర విద్యావసరాలు తీర్చుకునే స్తోమత లేదు.[33] సాధారణంగా ఆర్థిక పురోగతి లేకపోవడం వలన విద్యావంతులైన బాలలకు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ప్రత్యామ్నాయంగా మారాయి, ఇదిలా ఉంటే ఈ ఉద్యోగాలు పొందడం ఎక్కువగా లంచాలపై ఆధారపడివుండేది - దీంతో పేద కుటుంబాలు ప్రభుత్వ ఉద్యోగాలకు దూరమయ్యాయి.[33] దీంతో విద్యావంతులైన యువకులు, చదువుకోనివారు చేసే పొలం పనులు చేయడానికి మొగ్గుచూపారు, దీంతో తల్లిదండ్రులు పిల్లలను చదివించడంపై పెట్టుబడి గురించి ఆలోచిస్తూ, అసలు పిల్లలను పాఠశాలలకే పంపకుండా ఉన్నారు.[33] బీహార్ ప్రభుత్వ పాఠశాలలు విధులకు సరిగా హాజరుకాని ఉపాధ్యాయుల ద్వారా సమస్యలు ఎదుర్కొన్నాయి, దీంతో రాష్ట్ర ప్రభుత్వం రోజూ తరగతులు నిర్వహించని ఉపాధ్యాయుల జీతాలను నిలిపివేస్తామని హెచ్చరించింది.[35] విద్యార్థులు పాఠశాలలకు హాజరవడాన్ని ప్రోత్సహించడానికి, రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు పాఠశాలకు హాజరైనందుకు రోజుకు రూ.1 చొప్పున ఇస్తామని ప్రకటించింది.[35]

కేరళ అక్షరాస్యత విజయాలు[మార్చు]

కేరళలో 1980వ దశకంలో ఎర్నాకులం జిల్లాలో ఒక సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమాన్ని అమలు చేశారు, కలెక్టర్ నేతృత్వంలో జిల్లా పాలనా యంత్రాంగం ఒకవైపు మరియు మరోవైపు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు మరియు ఇతరులు మరోవైపు ఏకతాటిపైకి వచ్చి ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు.[36] 1990 ఫిబ్రవరి 4న, ఎర్నాకులం జిల్లా 100% శాతం అక్షరాస్యత సాధించిన జిల్లాగా గుర్తింపు పొందింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసింది, కేరళ రాష్ట్ర అక్షరాస్యత కార్యక్రమం పేరుతో దీనిని చేపట్టింది.[36] మొదట, ఇంటింటికి వెళ్లి అధ్యయనం నిర్వహించారు, బహుళ దశ అధ్యయనంలో రాష్ట్రంలో అక్షరాస్యత యొక్క వాస్తవ పరిస్థితిని గుర్తించారు, అదేవిధంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన ప్రదేశాలను దీని ద్వారా తెలుసుకున్నారు. తరువాత కళా జథాస్ (సాంస్కృతిక సిబ్బంది) మరియు సాక్షార్తా పాద యాత్రలు (అక్షరాస్యత పాద యాత్రలు) అవగాహన సృష్టించేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాయి, తద్వారా ఈ కార్యక్రమానికి సానుకూల సామాజిక వాతావరణం సృష్టించబడింది.[36] రాష్ట్ర అధికారులు, ప్రముఖ సామాజికవేత్తలు, స్థానిక అధికారులు మరియు అనుభవజ్ఞులైన స్వచ్ఛంద కార్యకర్తలతో సృష్టించబడిన సమగ్ర నిర్వహణ వ్యవస్థ ఈ అక్షరాస్యత కార్యక్రమ అమలును పర్యవేక్షించింది.[36]

హిమాచల్‌ప్రదేశ్ అక్షరాస్యత విజయాలు[మార్చు]

link=%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:View_on_Himalaya_from_Kalpa,_Himachal_Pradesh.jpg

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో 1961-2001 మధ్యకాలంలో ఒక "పాఠశాల విప్లవం" జరిగింది, ఇది కేరళ కంటే ఆకర్షణనీయమైన పథకంగా గుర్తింపు పొందింది.[37] 19వ శతాబ్దం నుంచి దేశ అక్షరాస్యత రేట్లలో కేరళ అగ్రస్థానంలో ఉంది, గత 150 ఏళ్లలో ఇందుకోసం అనేక కార్యక్రమాలు నిర్వహించింది, అయితే హిమాచల్‌ప్రదేశ్‌లో 1961నాటికి అన్ని వయస్సుల వారి అక్షరాస్యత రేట్లు జాతీయ సగటు కంటే దిగువన ఉన్నాయి.[37] 1961-1991 మధ్య మూడు దశాబ్దాల కాలంలో, మహిళా అక్షరాస్యత 15–19 మధ్య వయస్సుగలవారిలో 11% నుంచి 86%నికి పెరిగింది.[37] 6-14 మధ్య వయస్సు ఉన్న బాలురు మరియు బాలికల్లో పాఠశాలకు వెళ్లేవారి సంఖ్య 1998-99 విద్యా సంవత్సరంలో 97%పైగా ఉంది.[37] ఈ పురోగతి సాధించడానికి హిమాచల్ సాంస్కృతిక నేపథ్యం ఒక ప్రధాన కారకంగా ఉంది. హిమాచల్‌ప్రదేశ్ ఒక హిమాలయ పర్వతప్రాంత రాష్ట్రం, అనేక ఇతర రాష్ట్రాలోత పోలిస్తే ఇక్కడ అతితక్కువ సామాజిక అసమానతలు ఉన్నాయి, అందువలన సామాజిక కార్యక్రమాలు సులభంగా అమలు చేయడం సాధ్యపడింది. ప్రతి శిశువును పెంచడంలో పాఠశాల విద్యను అందించడం ఒక అత్యవసరమైన భాగమని, జీవితానికి అక్షరాస్యత ఒక సాధారణ అవసరమని హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక సామాజిక ప్రమాణాన్ని ప్రజలు వేగంగా స్వీకరించారు.[37] పాఠశాలలు విస్తరించేందుకు మరియు ఉపాధ్యాయులను అందించేందుకు ప్రభుత్వం 1960వ దశకం తరువాత చర్యలు ప్రారంభించింది, ప్రజలు తరచుగా ఇటువంటి కార్యక్రమాలకు తమవంతు సాయం అందించారు, పాఠశాల గదుల నిర్మాణం, హిమాలయాల్లో శీతాకాలంలో చలిని తట్టుకునేందుకు అవసరమైన వంటచెరకును అందించడం ద్వారా ప్రజలు ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.[37]

మిజోరాం అక్షరాస్యత విజయాలు[మార్చు]

స్వాతంత్ర్యం తరువాత మిజోరాం అక్షరాస్యత రేటు వేగంగా అభివృద్ధి చెందింది: 1951లో ఈ రాష్ట్ర అక్షరాస్యత రేటు 31.14% వద్ద ఉండగా, 2001లో ఇది 88.80%నికి చేరుకుంది.[38] హిమాచల్‌ప్రదేశ్‌లో మాదిరిగానే, మిజోరాంలో కూడా సామాజిక అసమానతలు బాగా తక్కువగా ఉండే సామాజిక నిర్మాణం ఉంది, అంతేకాకుండా సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనే బలమైన అధికారిక పట్టుదల ఇక్కడ అక్షరాస్యత విజయాలకు కారణమయ్యాయి.[39] ప్రభుత్వం నిరక్షరాస్యులను గుర్తించింది, అధికారులు మరియు సామాజిక నేతలతో కూడిన ఒక పరిపాలనా నిర్మాణాన్ని ఏర్పాటు చేసింది, యానిమేటర్‌లు అని పిలిచే బోధకులను నియమించింది, ప్రతి బోధకుడికి ఐదుగురికి విద్య నేర్పే బాధ్యతలు అప్పగించారు.[40] ప్రాథమిక అక్షరాస్యత బోధన తరువాత పైస్థాయి విద్యను నిర్వహించేందుకు మరియు పాఠశాల మానుకున్న విద్యార్థులకు విద్యా భద్రతను అందించడం కోసం మిజోరాం ప్రభుత్వం 300 నిరంతర విద్యా కేంద్రాలను ఏర్పాటు చేసింది.[40]

తమిళనాడు అక్షరాస్యత విజయాలు[మార్చు]

భారతదేశంలో అత్యధిక మంది అక్షరాస్యులు ఉన్న రాష్ట్రం తమిళనాడు, భారతదేశపు మానవ వనరుల అభివృద్ధి (HRD) మంత్రిత్వ శాఖ 2003నాటి గణాంకాలు ఈ విషాయన్ని తెలియజేస్తున్నాయి.[41] 1982 నుంటి తమిళనాడు రాష్ట్రం అక్షరాస్యత ప్రోత్సాహక చర్యల్లో భాగంగా పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాలు అందించడం మొదలుపెట్టింది, ఇది ఎన్నికల జిమ్మిక్కు అని విమర్శకుల ఆరోపణలను మరియు అతికొద్ది వితసంబంధ దృష్టిని అందిస్తుందని అందిస్తుందని సూచించిన ఆర్థికవేత్తల అభిప్రాయాలను పక్కనబెట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.[42] 19వ శతాబ్దంలో జపాన్ చేపట్టిన పథకాన్ని పోలినటువంటి ఈ పథకాన్ని ఆపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ ప్రారంభించారు, తన కుటుంబానికి ఆహారం కొనేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడం వలన బాల్యంలో ఆకలితో పాఠశాలకు వెళ్లి చదువుకున్న సందర్భాలను అనుభవించిన కారణంగా ఆయన ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశారు .[42] చివరకు, ఈ పథకాన్ని 15 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న బాలలందరికీ మరియు గర్భం ధరించిన మొదటి నాలుగునెలల కాలంలో గర్భిణి మహిళలకు వర్తింపజేశారు. తమిళనాడులో అక్షరాస్యత 1981లో 54.4% వద్ద ఉండగా, 2001లో 73.4%నికి పెరిగింది.[42] 2001లో, భారత సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత మధ్యాహ్న భోజనాల పథకాన్ని అమలు చేయాలని ఆదేశించింది, అయితే అవినీతి మరియు సామాజిక సమస్యల కారణంగా ఈ పథక అమలు సవ్యంగా జరగడంలేదు.[42] ఈ అవరోధాలు ఉన్నప్పటికీ, భారతీయ పాఠశాలల్లో ప్రతిరోజూ 120 మిలియన్ల మంది బాలలకు మధ్యాహ్న భోజనాలు అందుతున్నాయి, ప్రపంచంలో ఇది అతిపెద్ద పాఠశాల భోజన పథకంగా గుర్తింపు పొందింది.[43]

రాజస్థాన్ అక్షరాస్యత విజయాలు[మార్చు]

మిగిలిన భారతీయ రాష్ట్రాలతో పోలిస్తే రాజస్థాన్‌లో అత్యధిక స్థాయిలో దశాబ్ద (1991-2001) అక్షరాస్యతా పురోగతి సాధ్యపడింది, ఈ మధ్యకాలంలో రాష్ట్ర అక్షరాస్యత రేటు 38% నుంచి 61%నికి పెరిగింది, ఈస్థాయి పురోగతి అనేక మంది పరిశీలకులను ఆశ్చర్యపరిచింది.[44] జిల్లా ప్రాథమిక విద్యా పథకం, శిక్షా కార్మి కార్యక్రమం, లోక్ జుంబిష్ కార్యక్రమం వంటి వేగవంతమైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఈ అక్షరాస్యత వృద్ధిరేటు సాయపడ్డాయి.[45] వాస్తవానికి రాజస్థాన్‌లో ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ ప్రాథమిక పాఠశాల ఉంది.[44] రాజస్థాన్‌కు 1956లో రాష్ట్ర హోదా ఇచ్చినప్పుడు, భారతదేశంలో 18%తో అత్యల్ప అక్షరాస్యత ఉన్న రాష్ట్రం ఇదే కావడం గమనార్హం.[45]

సామాజిక వ్యాఖ్యానం[మార్చు]

ఇండియా డెవెలప్‌మెంట్ రిపోర్ట్ 2002 లోని సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే వ్యాసంలో కిరీట్ ఎస్ పారీఖ్, 2001 జనాభా లెక్కలు ప్రకారం 65 శాతం అక్షరాస్యత రేటుతో దేశంలో ఏడేళ్ల కంటే ఎక్కువ వయస్సున్న 296 మిలియన్ల మంది అక్షరాస్యులు ఉన్నారని వెల్లడించారు. దేశంలో ఉన్న ప్రస్తుతం ఉన్న నిరక్ష్యరాస్యుల సంఖ్య స్వాతంత్ర్యం సమయంలో దేశంలో ఏడు మరియు అంతకంటే ఎక్కువ వయస్సున్న జనాభా సంఖ్య 270 మిలియన్‌ల కంటే ఎక్కువ ఉంది.

తనకు నోబెల్ బహుమతి ద్వారా వచ్చిన ఆదాయంతో ఏర్పాటు చేసిన ప్రతీచీ ట్రస్ట్ పశ్చిమ బెంగాల్ మరియు జార్ఖంఢ్ రాష్ట్రాల్లో జరిపిన పరిశోధనలను ప్రాతిపదికగా చేసుకొని ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అనే పుస్తకంలో అమర్త్య సేన్ మెరుగైన జీతాలు పొందుతున్న ఉపాధ్యాయుల గైర్హాజరీ, ముఖ్యంగా వెనుకబడిన కులాలు మరియు తరగతుల విద్యార్థులు ఎక్కువగా చదువుతున్న ప్రదేశాల్లో ఉపాధ్యాయుల గైర్హాజరీ ఒక ప్రధాన సమస్యగా ఉందన్నారు. విద్యార్థులు ఇటువంటి పరిస్థితుల కారణంగా బలవంతంగా ప్రైవేట్ ట్యూషన్‌లకు వెళ్లాల్సి వస్తుంది. కొన్నిసార్లు అసమానతలు మరియు అడ్డంకులను అధిగమించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్థలు అసమానతలను పెంచడంలో ప్రేరేపక ప్రభావాలను సృష్టిస్తున్నాయని ఆయన నిర్ధారించారు - ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడటంలో క్రియాశీల పాత్ర కలిగివున్న ఉపాధ్యాయ సంఘాలు గతంలో తమ పాత్రకు న్యాయం చేసినప్పటికీ, తరచుగా బడుగువర్గ కుటుంబాలకు చెందిన విద్యార్థుల ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తున్నాయని సూచించారు. కొత్తగా ఆర్థిక సమృద్ధి పొందిన ఉపాధ్యాయులను దారిద్ర్యంలోని గ్రామీణ పేదల నుంచి వేరుచేసే తరగతి అడ్డంకులు బలపడుతున్నాయనేందుకు ఆధారాలు ఉన్నాయని చెప్పారు.

అక్షరాస్యత చర్యలు[మార్చు]

విద్యా హక్కు ఒక ప్రాథమిక హక్కుగా ఉంది, [46] UNESCO (యునెస్కో) 2015నాటికి అందరికీ విద్యను లక్ష్యంగా పెట్టుకుంది.[46] అరబ్ దేశాలు మరియు ఉప-సహారా ప్రాంత ఆఫ్రికా దేశాలతో కలిసి భారతదేశం ప్రచార స్థాయి 75% కంటే తక్కువ అక్షరాస్యతను కలిగివున్నాయి, ఈ స్థాయిని సాధించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. కనీసం ప్రచార అక్షరాస్యత స్థాయిని సాధించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం దేశంలో ఎన్నడూ చూడని పౌర మరియు సైనిక సన్నాహాల కంటే భారీస్థాయిలో జరుగుతుంది.[47] అంతర్జాతీయ అక్షరాస్యత దినం ప్రతి ఏటా సెప్టెంబరు 8న జరుపుకుంటున్నారు, వ్యక్తులకు, సమూహాలకు మరియు సంఘాలకు అక్షరాస్యత యొక్క అవసరాన్ని గుర్తిస్తూ దీనిని నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వ పథకాలు[మార్చు]

జాతీయ అక్షరాస్యత కార్యక్రమం[మార్చు]

నేషనల్ లిటరసీ మిషన్ (జాతీయ అక్షరాస్యత కార్యక్రమం) 1988లో ప్రారంభమైంది, 2007నాటికి దేశంలో 75% అక్షరాస్యత రేటును సాధించాలనే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు. ఇది 15 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సున్న నిరక్షరాస్యులకు ప్రయోజనాత్మక అక్షరాస్యతను అందిస్తుంది. సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమం నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు NLM యొక్క ప్రధాన వ్యూహంగా ఉంది. నిరంతర విద్యా పథకం సంపూర్ణ అక్షరాస్యత మరియు అక్షరాస్యతోత్తర కార్యక్రమాల యొక్క చర్యలకు ఒక అభ్యాస అవిభక్తతను అందిస్తుంది.[26]

సర్వ శిక్షా అభియాన్[మార్చు]

సర్వ శిక్షా అభియాన్ (సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమాన్ని హిందీలో ఈ పేరుతో పిలుస్తారు) 2001లో ప్రారంభమైంది, 6-14 సంవత్సరాల మధ్య ఉన్న బాలలందరూ పాఠశాలకు వెళ్లేలా చేసేందుకు మరియు 2010నాటికి ఎనిమిదేళ్ల పాఠశాల విద్యను పూర్తి చేసేలా చర్యలు చేపట్టేందుకు ఇది ఉద్దేశించబడింది. ఈ పథకంలో ముఖ్యమైన భాగం ఏమిటంటే విద్యా హామీ పథకం మరియు ప్రత్యామ్నాయ మరియు వినూత్న విద్య, ఒక కిలోమీటరు వ్యాసార్థంలో పాఠశాల అందుబాటులో లేని బాలలకు ఇది ప్రధానంగా ఉద్దేశించబడింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం 1994లో ప్రారంభమైంది, 2005నాటికి దీని పరిధిలో 160,000 కొత్త పాఠశాలలు ప్రారంభించారు, వీటిలో సుమారు 84,000 ప్రత్యామ్నాయ పాఠశాలలు ఉన్నాయి.[26]

మధ్యాహ్న భోజన పథకం[మార్చు]

2002 మార్చి 1న 6-14 సంవత్సరాల నడుమ ఉన్న సుమారుగా 205 మిలియన్ల మంది బాలల్లో 82.5% మంది పాఠశాలల్లో విద్యార్థులకు నమోదు చేయబడ్డారు. అయితే, 2002-03లో ప్రాథమిక స్థాయిలోనే పాఠశాలకు వెళ్లడం మానుకున్న విద్యార్థుల రేటు 34.9% వద్ద ఉండగా, ఉన్నత ప్రాథమిక స్థాయిలో 52.8% వద్ద ఉంది.[48] ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు చదువు మానుకోవడం ప్రధాన ఆందోళనకర అంశమైంది. పాఠశాలలకు వెళ్లేలా బాలలను ఆకర్షించేలా చేయడానికి చేపట్టిన అత్యంత ప్రసిద్ధ పథకాల్లో ఒకటి మధ్యాహ్న భోజన పథకం, దీనిని 1995లో ప్రారంభించారు. వివిధ విజయ స్థాయిలతో అనేక ఇతర ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఉన్నాయి.[26]

ప్రభుత్వేతర చర్యలు[మార్చు]

భారతీయ నిరక్షరాస్యుల్లో ఎక్కువ మంది దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు, ఈ ప్రాంతాల్లో సామాజిక మరియు ఆర్థిక అడ్డంకులు సామాజిక నిరక్ష్యరాస్యతను అధిగమించకుండా చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. సదుద్దేశాలతో అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలు శతాబ్దాలుగా నిర్మించబడిన ఈ అడ్డంకులను అధిగమించలేకపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులను మార్చేందుకు కొన్నిసార్లు ప్రధాన సామాజిక సంస్కరణ చర్యలు అవసరమవుతాయి.

ఆషా ఫర్ ఎడ్యుకేషన్[మార్చు]

భారతదేశంలో వేరుచేయబడిన పేదల పరిస్థితుల్లో మార్పుకు కృషి చేసినందుకు గుర్తుగా 2002లో సందీప్ పాండే రామన్ మెగసెసే అవార్డు గెలుచుకున్నారు.[49] బెర్క్లేలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో Ph.D. చేస్తున్న సమయంలో ఆయన భారతదేశంలో పేద బాలలకు విద్యను అందించడానికి ఆషా ఫర్ ఎడ్యుకేషన్ సహ-వ్యవస్థాపకుడిగా ఉన్నారు, విదేశాల్లో స్థిరపడిన భారతీయల వద్ద నుంచి దీని కోసం వనరులు పొందడం ద్వారా, మొదటి ఏడాదిలో పది వేల డాలర్ల విరాళాన్ని సేకరించారు. ఈ సంస్థ తరువాత 36 ఉత్తర-అమెరికా శాఖలను ఏర్పాటు చేసింది, భారతదేశంలో విద్యా కార్యక్రమాలకు ఇప్పటి నుంచి పదిలక్షల డాలర్‌ల నిధులును పంపిణీ చేసింది.

పాండే తరువాత భారతదేశానికి తిరిగి వచ్చి, పూర్తి సమయం దేశంలో విద్య ద్వారా సామాజిక-ఆర్థిక మార్పు తీసుకురావాలనే ఆషా లక్ష్యం కోసం పనిచేయడం ప్రారంభించారు. జీతాలు తీసుకొని స్వచ్ఛంద సేవకులు ఆషా ఉపాధ్యాయులుగా ఉన్నారు, కొవ్వొత్తుల తయారీ మరియు చేతితో తయారు చేసిన కాగితంతో గ్రీటింగ్ కార్డులు తయారు చేయడం వంటి సహ-వృత్తులతో వారు మద్దుతు పొందుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో దారిద్ర్యంలో ఉన్న బడుగు కులాల కుటుంబాలు మరియు దళితులతో కలిసి పనిచేస్తున్నప్పుడు, పాండే పాఠశాలలకు వెళ్లిన కొందరు బాలలు ఉపాధి పొందలేకపోవడం గమనించారు. స్థానిక స్వచ్ఛంద కార్యకర్తలతో, పాండే రెయోటీ మరియు భైంసాహా గ్రామాల్లో పాఠశాలలు ఏర్పాటు చేశారు, విద్యార్థులకు సామాజిక న్యాయం విలువను మరియు ఆత్మ-విశ్వాసాన్ని బోధించడం కోసం ఉద్దేశించి వీటిని ప్రారంభించారు. ఆయన లక్నో వెలుపల లాల్‌పూర్ అనే దళితులు ఎక్కువగా ఉన్న గ్రామంలో ఆషా ఆశ్రమం ఏర్పాటు చేశారు, సాంప్రదాయిక నిపుణ కార్మికుల మధ్య విద్యార్థులు చదువుకుంటూ అక్కడే ఉంటారు, తేనటీగల పెంపకం, కూరగాయల పెంపకం మరియు కుటీర పరిశ్రమలు వంటివాటి గురించి నేర్చుకుంటున్నారు.

మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి మరియు తమ పిల్లలందరినీ పాఠశాలకు పంపేందుకు ప్రజలకు మార్గదర్శనం చేయడం ద్వారా చేసిన సేవలకు గుర్తుగా శాంతా సిన్హా 2003లో మెగసెసే అవార్డు గెలుచుకున్నారు. 1987లో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఒక విస్తరణ కార్యక్రమానికి అధిపతిగా ఉన్న ఆమె నిర్భంద కార్మిక వ్యవస్థ నుంచి బాలలను విడిపించి, వారిని పాఠశాలలకు వెళ్లేలా చేసేందుకు మూడు నెలల నిడివిగల ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. తరువాత 1991లో, ఆమె తమ కుటుంబం యొక్క మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో తన ఆలోచనను ముందుకు తీసుకెళ్లారు. ఆమె మొదట ఏర్పాటు చేసిన మార్పు శిబిరాలు పూర్తిస్థాయి నివాస పాఠశాలలుగా మార్చారు. బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు మరియు బాలలకు సాధారణ బాల్యాన్ని దూరం చేసే మిగిలిన పద్ధతులపై సమాజంలో ఒక విరోధ భావాన్ని తీసుకురావాలని ఈ ఫౌండేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం MV ఫౌండేషన్ యొక్క బ్రిడ్జ్ స్కూళ్లు మరియు కార్యక్రమాలు 4300 గ్రామాలకు విస్తరించాయి.[50]

అక్షరాస్యత నిర్వచనం[మార్చు]

ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ (UNESCO-యునెస్కో) అక్షరాస్యతకు ఒక నిర్వచనాన్ని తయారు చేసింది, వివిధ రకాల సందర్భాలకు సంబంధించిన ముద్రించిన మరియు రాసిన సమాచారాన్ని గుర్తించే, అర్థం చేసుకొనే, వివరించే, సృష్టించే, వ్యక్తీకరించే, గణించే మరియు ఉపయోగించే సామర్థ్యాన్ని అక్షరాస్యత నిర్వచనంగా యూనెస్కో సూచించింది. వ్యక్తులు వారి లక్ష్యాలను సాధించేందుకు, వారి పరిజ్ఞానాన్ని మరియు సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకునేందుకు మరియు తమ సమూహంలో మరియు విస్తృత సమాజంలో పూర్తిస్థాయిలో పాల్గొనేందుకు వీలు కల్పించే నిరంతర అభ్యాసం అక్షరాస్యతలో భాగంగా ఉంటుంది.[51]

చదవడానికి, రాయడానికి మరియు లెక్కించడానికి సంబంధించిన నైపుణ్యాలను పొందడం మరియు వాటిని దైనందిన జీవితాల్లో వర్తింపజేయగల సామర్థ్యాన్ని జాతీయ అక్షరాస్యత కార్యక్రమం అక్షరాస్యత నిర్వచనంగా సూచించింది. (i) చదవడం, రాయడం మరియు లెక్కించడం (3R's) లో ఆత్మ-విశ్వాసం, (ii) దారిద్ర్యానికి కారణాలపై మరియు అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములు కావడం ద్వారా తమ పరిస్థితిని సరిదిద్దుకోవడంవైపు ముందుకెళ్లే సామర్థ్యంపై అవగాహన కల్పించడం, (iii) ఆర్థిక స్థితి మరియు సాధారణ సంక్షేమాన్ని మెరుగుపరిచేందుకు నైపుణ్యాలు పొందడం, (iv) జాతీయ సమగ్రత, పర్యావరణ పరిరక్షణ, మహిళల సమానత్వం, వంటి విలువలను పొందడం, చిన్న కుటుంబాల నిబంధనల ఆచరణ, ప్రయోజనాత్మక అక్షరాస్యత సాధనలో భాగంగా ఉన్నాయి.

భారత జనాభా లెక్కల్లో 1991 నుంచి ఆచరణలో ఉన్న అక్షరాస్యత నిర్వచనం ఈ కింది విధంగా ఉంది:[52]

 • అక్షరాస్యత రేటు : ఒక నిర్దిష్ట సమయంలో ఒక ప్రదేశంలో అర్థవంతంగా చదవడం మరియు రాయడం తెలిసిన ఏడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న మొత్తం జనాభా శాతం. ఇక్కడ విభాజకం ఏడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న జనాభా.
 • ముడి అక్షరాస్యత రేటు : ఒక నిర్దిష్ట సమయంలో ఒక ప్రదేశంలో అర్థవంతంగా రాయడం మరియు చదవే సామర్థ్యాలు ఉన్న ఏడు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న మొత్తం జనాభా శాతం, ఈ సందర్భంలో ఆ ప్రదేశంలో మొత్తం జనాభాను (ఏడు కంటే తక్కువ వయస్సున్నవారిని కూడా కలిపి) విభాజకంగా తీసుకుంటారు.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • అక్షరాస్యత
 • భారతదేశంలో విద్య
 • కేరళ నమూనా
 • లండన్‌లో 1870 మే 24న కేశవ్ చంద్ర సేన్ భారతదేశంలో విద్యపై చేసిన ప్రసంగం.
 • ఎకాల్ విద్యాలయ, గ్రామీణ భారతదేశంలో విద్య మరియు గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ
 • ప్రథమ్, అక్షరాస్యత కార్యక్రమాలపై పనిచేస్తున్న ఒక NGOprogrammes

సూచనలు[మార్చు]

 1. UNESCO: Literacy, UNESCO
 2. 2.0 2.1 2.2 Jayant Pandurang Nayaka, Syed Nurullah (1974), A students' history of education in India (1800-1973), Macmillan
 3. 3.0 3.1 3.2 UNICEF. "India Statistics". Retrieved 2009-03-27. Cite web requires |website= (help)
 4. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం (PDF) నుండి 2011-07-24 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-10-15. Cite web requires |website= (help)
 5. 5.0 5.1 Crossette, Barbara (1998-12-09), "Unicef Study Predicts 16% World Illiteracy Rate Will Increase", New York Times, retrieved 2009-11-27
 6. "India has the largest number of illiterates in the world", Rediff, 2007-11-21, retrieved 2009-11-27
 7. "India's literacy rate increase sluggish", Indiainfo.com, 2008-02-01, మూలం నుండి 2009-08-28 న ఆర్కైవు చేసారు, retrieved 2009-09-20, ... Literacy in India is increasing at a sluggish rate of 1.5 percent per year, says a recent report of the National Sample Survey Organisation (NSSO) ... India's average literacy rate is pegged at 65.38 percent ...
 8. How Female Literacy Affects Fertility: The Case of India (PDF), Population Institute, East-West Center, December 1990, retrieved 2009-11-25
 9. 9.0 9.1 Literates and Literacy Rates - 2001 Census (Provisional), National Literacy Mission, మూలం నుండి 2009-06-19 న ఆర్కైవు చేసారు, retrieved 2009-11-27
 10. http://www.unfpa.org/swp/2009/en/pdf/EN_SOWP09_ICPD.pdf
 11. A. Dharmalingam, S. Philip Morgan (1996), "Women's work, autonomy, and birth control: evidence from two south India villages", Population Studies, retrieved 2009-11-25
 12. India Literacy, Roomtoread.org, మూలం నుండి 2009-12-09 న ఆర్కైవు చేసారు, retrieved 2009-11-27, ... Of all the world's illiterate people, 35% live in India ... Although schoolin is free and compulsory from 6-14 years of age, facilities are inadequate and often totally lacking. Approximately 40% of students, mostly girls, drop out by secondary school ... it is estimated that by the year 2020 over 50% of the illiterate population will live in India ...
 13. "India has a third of world's illiterates", Times of India, 2004-11-09, retrieved 2009-09-20, ... With 34% of the illiterate population in the world, India has the largest number of illiterates by far ...
 14. ఎకనామిక్ సర్వే 2004-05 , ఎకనామిక్ డివిజన్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, క్వోటింగ్ UNDP హ్యూమన్ డెవెలప్‌మెంట్ రిపోర్ట్ 2004
 15. UNICEF. "China Statistics". Retrieved 2009-03-27. Cite web requires |website= (help)
 16. UNESCO (2004). "China: Youth literacy rate". Globalis. మూలం నుండి 2008-11-27 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-03-27. Cite web requires |website= (help)
 17. UNICEF. "At a glance: Myanmar". Retrieved 2009-11-27. Cite web requires |website= (help)
 18. UNESCO (2004). "Myanmar: Youth literacy rate". Globalis. మూలం నుండి 2010-07-19 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-11-27. Cite web requires |website= (help)
 19. UNICEF. "Islamic Republic of Iran Statistics". Retrieved 2009-11-27. Cite web requires |website= (help)
 20. World Resources Institute. "Population, Health and Human Well-being: Country Profile of the Islamic Republic of Iran". WRI. మూలం నుండి 2008-11-11 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-11-27. Cite web requires |website= (help)
 21. "Worldmapper: Youth Literacy". Worldmapper. మూలం నుండి 2009-11-11 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-11-27. Cite web requires |website= (help)
 22. http://hdr.undp.org/en/media/HDR_2009_EN_Complete.pdf
 23. 23.0 23.1 స్టాటస్టికల్ పాకెట్ బుక్ ఇండియా 2003
 24. ఇండియా 2005 పబ్లిష్డ్ బై పబ్లికేషన్స్ డివిజన్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.
 25. 25.0 25.1 India Talks - Amartya Sen, MediaWeb India, retrieved 2009-09-20, ... would make India literate in 40 years, and the nationalist leaders rightly laughed it out of court, on the grounds that India did not have the patience to remain for 40 years without Universal Literacy. Now 50 years have gone by, and the country is still half illiterate, two-thirds of the women are illiterate ...
 26. 26.0 26.1 26.2 26.3 ఇండియా 2005
 27. ఎకనామిక్ సర్వే 2004-05 .
 28. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం (PDF) నుండి 2011-04-13 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-10-15. Cite web requires |website= (help)
 29. [1] కేరళ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్
 30. K.R. Nayar, Anant Kumar (July 2005), "Health Analysis - Kerala and Bihar: A Comparison", Yojana, Vol. 49, retrieved 2009-11-27, ... The inter-sectoral action needs to be recognized for achieving any health improvement in Bihar. What is also needed is a 'Bihar discourse' instead of 'Bihar bashing' ...
 31. 31.0 31.1 Mahendra K. Premi, India's Literacy Panorama, Seminar on the Progress of Literacy in India: What the 2001 Census Reveals, Education for All in India, retrieved 2009-11-28, ... the absolute number of illiterates in population aged 7 + has declined for the first time by almost 32 million ... There are, however, states – Bihar, Manipur and Nagaland – and the union territories of Delhi and Chandigarh - where the number of illiterates has increased further during the 1990s ...
 32. 32.0 32.1 32.2 "Literacy Rate on the Rise, 11th Plan Targets 80%", The India Post, 2008-09-04, retrieved 2009-11-28, ... In all the States and Union Territories the male literacy rate except Bihar (59.68%) is now over 60% ...
 33. 33.0 33.1 33.2 33.3 33.4 Manoranjan Mohanty (2004), Class, caste and gender: Volume 5 of Readings in Indian government and politics, SAGE, ISBN 0761996435, ... dalits did not send their children to the regular school because they were humiliated ... Even when there is no overt social discrimination ... cannot afford books and stationery ... cannot afford the bribes, without which it is impossible to be offered a job ...
 34. Tom Sticht (2004-07-07), Paradigms of Learning: The Total Literacy Campaign in India, మూలం నుండి 2005-12-27 న ఆర్కైవు చేసారు, retrieved 2009-11-30, ... I served as a member of UNESCO's International Jury for Literacy Prizes ... in 1981 when the jury awarded a prize to the Department of Adult Education of the state of Bihar for its massive state-wide literacy campaign ...
 35. 35.0 35.1 "Bihar teachers under attendance watch", Bihar Times, 2009-09-10, మూలం నుండి 2010-01-03 న ఆర్కైవు చేసారు, retrieved 2009-11-30, ... government last month warned that salaries of teachers in government schools would not be paid if they failed to ensure at least 75 percent attendance ...
 36. 36.0 36.1 36.2 36.3 Amita Singh (2005), Administrative reforms: towards sustainable practices, SAGE, ISBN 0761933921, ... the social and administrative mechanism that led to the success of the campaign included several measures ...
 37. 37.0 37.1 37.2 37.3 37.4 37.5 Jean Drèze, Amartya Sen (2002), India: development and participation, Oxford University Press, ISBN 0199257493, ... Himachal Pradesh's transition from mass illiteracy to near-universal elementary education has been even more impressive than Kerala's ... taken place over a much shorter period in time in Himachal Pradesh than in Kerala, where sustained educational expansion began in the 19th century ...
 38. Vanlalchhawna (2006), Higher education in North-East India: unit cost analysis, Mittal Publications, ISBN 8183240569, ... from 31.14% in 1951 to 88.8% in 2001, an increase of 57.7%, whereas the all-India literacy rates ...
 39. Lalit Kumar Jha (1997), Natural Resource Management: Mizoram, APH Publishing, ISBN 8170247810, ... Mizoram has certainly distinguished itself amongst the states of India ... a closely knit society ... village councils having a definite bearing on the social and administrative setups, educational facilities ...
 40. 40.0 40.1 "Mizoram imparts a lesson in literacy to the country", Rediff, 1999-11-22, retrieved 2009-12-06, ... The Mizoram government drew up a detailed plan primed towards achieving total literacy. Each animator was given the task of teaching five persons at a time ... the Centre has laid stress on this programme, sanctioning INR 45.67 lakh to establish 360 Continuing Education Centres and 40 more nodal centres spread across the state ...
 41. TNN, May 14, 2003, 07.29pm IST (2003-05-14). "Tamil Nadu India's most literate state: HRD ministry - City - The Times of India". Timesofindia.indiatimes.com. Retrieved 2010-09-01. Cite web requires |website= (help)CS1 maint: multiple names: authors list (link)
 42. 42.0 42.1 42.2 42.3 "India fights illiteracy with lunch", Asia Times, 2008-05-20, retrieved 2009-11-28, ... noon-meal scheme for children was first pioneered in 1982 by iconic movie star and Tamil Nadu chief minister M G Ramachandran (1917-1987), the world's first film hero to head a government. MGR, as he was called, started the free lunch for school children scheme, ignoring cynics who said it was an electoral gimmick and economists who said it made little fiscal sense ...
 43. Geeta Gandhi Kingdon (March 2007), The progress of school education in India (PDF), Global Poverty Research Group, Economic and Social Research Council, retrieved 2009-11-28, ... In late 2001, the Indian Supreme Court directed all states "to implement the Mid-Day Meal Scheme by providing every child in every government and government assisted primary school with a prepared mid-day meal with a minimum content of 300 calories and 8- 12 grams of protein each day of school for a minimum of 200 days." By 2006, the MDM scheme was near universal in all states ... the central government provides grains, funds transportation and also pays food preparation costs, though the state government is responsible for providing the physical infrastructure for cooking the meals ... The scheme provides lunch to about 120 million children every school day and, as such, is the largest school meal scheme in the world ...
 44. 44.0 44.1 "A spectacular march by Rajasthan", Frontline (The Hindu), 2001-12-07, మూలం నుండి 2008-09-17 న ఆర్కైవు చేసారు, retrieved 2009-11-28, ... Rajasthan's improvement ... recorded the highest percentage increase in literacy rate among Indian States ... the percentage point increase in female literacy is the highest in Rajasthan ...
 45. 45.0 45.1 "Rajasthan passes literacy test with flying colours", Times of India, 2008-10-06, retrieved 2009-11-28, ... thanks to some public initiatives taken like the Lok Jumbish and the Shiksha Karmi ...
 46. 46.0 46.1 UNESCO, UNESCO, మూలం నుండి 2009-07-05 న ఆర్కైవు చేసారు ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "unesco2009hdk" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
 47. "National Literacy Mission website". Nlm.nic.in. మూలం నుండి 2010-08-24 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-09-01. Cite web requires |website= (help)
 48. ఎకనామిక్ సర్వే 2004-05
 49. "Sandeep Pandey's Magsaysay Award Citation". Rmaf.org.ph. 2002-08-31. మూలం నుండి 2009-04-13 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-09-01. Cite web requires |website= (help)
 50. "Shantha Sinha's Magsaysay Award Citation". Rmaf.org.ph. 2003-08-31. మూలం నుండి 2012-04-26 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-09-01. Cite web requires |website= (help)
 51. UNESCO ఎడ్యుకేషన్ సెక్టార్, ది ప్లురలిటీ ఆఫ్ లిటరసీ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఆఫ్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్: పొజిషన్ పేపర్. ప్యారిస్: యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, 2004, పేజి. 13, సైటింగ్ ఎ ఇంటర్నేషనల్ ఎక్స్‌పర్ట్ మీటింగ్ ఇన్ జూన్ 2003 ఎట్ UNESCO. http://unesdoc.unesco.org/images/0013/001362/136246e.pdf
 52. ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ బై కె. పార్క్, 19వ ఎడిషన్(2007), M/s బనార్సీదాస్ భానోత్, జబల్‌పూర్, ఇండియా

బాహ్య లింకులు[మార్చు]