భారతదేశంలో మహిళల ఆరోగ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
A community health worker prepares a vaccine.
ఒడిశాలో టీకా వేస్తున్న  సామూహిక ఆరోగ్య కార్యకర్త.

భారతదేశంలో మహిళల ఆరోగ్యాన్ని పరిశీలించడానికి బహుళ సూచికలను దృష్టిలో పెట్టుకోవాలి. భౌగోళిక, సామాజిక, ఆర్థిక, సంప్రదాయాలను బట్టీ మహిళల ఆరోగ్య పరిస్థితులు మారుతుంటాయి.[1] 


భారతదేశంలోని మహిళల ఆరోగ్యాన్ని పలు కోణాల్లో మెరుగుపరచేందుకు, ప్రపంచ ఆరోగ్య ప్రమాణాలూ, భారత్ లోని పురుషుల ఆరోగ్యంతో పోల్చవలసి వస్తుంది. ఆరోగ్యం మనిషి జీవితానికీ, ఆర్థిక వృద్ధికి కూడా చాలా ముఖ్యమైనది.[2]

భారతదేశం లో మహిళల ఆరోగ్యం వారి పరిస్థితులను గమనిస్తూ, రోగ నిర్ధారణ తో చికిత్స చేయడం, వారి శారీరక, మానసిక శ్రేయస్సును ప్రభావితం చేసే వ్యాధులను దృష్టిలో పెట్టుకొని వారికీ సరైన వైద్యను అందించటం ప్రభుత్వాల కర్తవ్యం . భారతదేశంలో మహిళలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంది, ఇది చివరికి మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావితం చేస్తుంది.

చరిత్ర[మార్చు]

భారతదేశంలో మహిళలు పోషకాహార లోపం, తల్లి ఆరోగ్యం లేకపోవడం, ఎయిడ్స్ వంటి వ్యాధులు, రొమ్ము క్యాన్సర్, గృహ హింస,పోషకాహారంలోపం ,అభివృద్ధి చెందుతున్న దేశాలలో పోషకాహార లోపం ఉన్న మహిళల రేటు భారతదేశంలో ఒకటి. పోషకాహార లోపం సమస్యలను పరిష్కరించడం మహిళలకు, వారి సంతానమునకు , పెరుగుదలకు మంచి ఫలితాలను ఇస్తుంది. తల్లి ఆరోగ్యం లేకపోవడం, ప్రభుత్వం వారి జాతీయ ఆరోగ్య కార్యక్రమాలైన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం),కుటుంబ సంక్షేమ కార్యక్రమం భారతదేశం అంతటా మహిళల తల్లి ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడానికి రూపొందించబడ్డాయి. గత రెండు దశాబ్దాలుగా భారతదేశం అనూహ్య వృద్ధిని సాధించినప్పటికీ, అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చితే మాతాశిశు మరణాలు ఇప్పటికీ ఎక్కువగా ఉన్నాయి.1992నుంచి 2006 మధ్య ప్రపంచవ్యాప్తంగా జరిగిన మాతా శిశు మరణాలలో దాదాపు 20 శాతం భారతదేశం లో ఉన్నాయి. వీటికి తోడు గృహహింస , మహిళల ఆత్మహత్యలు , సమాజములో చిన్న చూపు ప్రధానము గా భారతదేశములో మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలు. వీటిని దృష్టిలో లో పెట్టుకొని వారి ఆరోగ్య సంరక్షణ చేయడం అవసరం [3] భారతదేశంలో మహిళల ఆరోగ్యం గురించి కొన్నివాస్తవాలు ఉన్నాయి, ఇవి భారతదేశంలో మహిళలు వారి ప్రాథమిక హక్కులు, అవసరాలు, ఆరోగ్యం ఎలా కోల్పోతారనే దానిపై స్పష్టమైన ఆలోచన దానిలో మహిళలు ప్రసవ సమయములో అత్యధిక మరణాల రేటు లో అగ్రస్థానంలో ఉంది, పాఠశాలకు వెళ్ళని బాలికలు కూడా అత్యధికంగా ఉన్నారు. భారతదేశంలో జన్మించిన మొత్తం బాలికలలో 25% మంది 15 దినములలోనే మరణిస్తున్నారు . 2005 లో భారతదేశంలో 40% హెచ్ఐవి కేసులు మహిళలే [4] [5] [6]ఇవి కూడా చూడండి

భారతదేశంలో మహిళలు

మూలాలు[మార్చు]

  1. Empty citation (help)
  2. Ariana, Proochista and Arif Naveed.
  3. "Women's Health". https://www.nhp.gov.in/healthlyliving. 06-11-2020. Retrieved 06-11-2020. Check date values in: |access-date= and |date= (help); External link in |website= (help)
  4. "India - leading women-related health issues 2019". Statista (in ఇంగ్లీష్). Retrieved 2020-11-06.
  5. "NATIONAL HEALTH PROFILE 2018" (PDF). https://cdn.downtoearth.org.in/. 06-11-2020. Retrieved 06-11-2020. Check date values in: |access-date= and |date= (help); External link in |website= (help)
  6. admin (2018-07-11). "Women Health In India - Current Scenario and Challenges". Vydehi (in ఇంగ్లీష్). Retrieved 2020-11-06.