Jump to content

భారతి పవార్

వికీపీడియా నుండి
భారతి పవర్

కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం శాఖ సహాయ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
7 జులై 2021
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు అశ్విని కుమార్ చౌబే

లోక్‌సభ సభ్యురాలు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
May 2019
ముందు హరీష్ చంద్ర చవాన్
నియోజకవర్గం దిండోరి

వ్యక్తిగత వివరాలు

జననం (1978-09-13) 1978 సెప్టెంబరు 13 (వయసు 46)
నరుల్ -కల్వాన్ , నాసిక్, మహారాష్ట్ర
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి ప్రవీణ్ అర్జున్ పవర్
పూర్వ విద్యార్థి పూణే యూనివర్సిటీ
మూలం [1]

భారతి ప్రవీణ్ పవార్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 2021 నుండి కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుంది.[2] ఆమె మాజీ మహారాష్ట్ర మంత్రి అర్జున్ తులషీరామ్ పవార్ కోడలు. ఆయన 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మహారాష్ట్ర ప్రభుత్వంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశాడు.

భారతి పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2012లో జిల్లా పరిషత్ సభ్యురాలిగా ఎన్నికైంది. ఆమె 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది. భారతి పవార్ 2019లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో ఆమె బీజేపీలో చేరి దిండోరి లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచి 2021 మే 7 నుండి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 2021 నుండి కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుంది.[3]

రాజకీయ జీవితం

[మార్చు]
  • జిల్లా పరిషత్ సభ్యురాలు (2012 - 2019)
  • పార్లమెంటు సభ్యురాలు, 17వ లోక్‌సభ (2019 - ప్రస్తుత)
  • ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై స్టాండింగ్ కమిటీ సభ్యురాలు (2019 - అధికారంలో ఉంది)
  • పిటిషన్లపై కమిటీ సభ్యురాలు (2019 - ప్రస్తుత)
  • కన్సల్టేటివ్ కమిటీ, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సభ్యురాలు (2019 - అధికారంలో ఉంది)
  • కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ( 2021 జూలై 7 - ప్రస్తుతం) [4]

మూలాలు

[మార్చు]
  1. Lok Sabha (2019). "Dr. Bharati Pravin Pawar". Archived from the original on 5 April 2022. Retrieved 5 April 2022.
  2. BBC News తెలుగు (7 July 2021). "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.
  3. TV9 Telugu (7 July 2021). "పూర్తయిన కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో తెలుసుకోండి." Archived from the original on 7 April 2022. Retrieved 7 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Namasthe Telangana (7 July 2021). "మోదీ మంత్రివర్గంలో కొత్తగా నలుగురు డాక్టర్లు". Archived from the original on 5 April 2022. Retrieved 5 April 2022.