Jump to content

భారతీయ గ్రంథాలయ సంఘం

వికీపీడియా నుండి
భారతీయ గ్రంథాలయ సంఘం
AbbreviationILA
ఆవిర్భావం1933
రకంజాతీయ సంఘం
ప్రధానకార్యాలయాలుదిల్లీ
స్థానందిల్లీ
ప్రాంతంభారత దేశము
సభ్యత్వంపోషకులు, గౌరవ సభ్యులు

జీవిత సభ్యులు, సంఘ సభ్యుడు
సంస్ధాగత సభ్యుడు, సాధారణ సభ్యుడు

విదేశీ సభ్యులు, సంస్ధాగత సభ్యులు
జాలగూడుhttps://ilaindia.co.in/

భారతీయ గ్రంథాలయ సంఘం ( Indian Library Association-ILA ) 1933 సెప్టెంబరు 13న ఆవిర్భవించింది. ఇది కలకత్తాలో (ఇప్పుడు కోల్‌కతా ) లో జరిగిన మొదటి అఖిల భారత గ్రంథాలయ సదస్సు (ఆల్ ఇండియా లైబ్రరీ కాన్ఫరెన్స్) సందర్భంగా సంఘాలనమోదు చట్టం (సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్) (21-1860) కింద నమోదు చేయబడింది. ILA 7000 కంటే ఎక్కువ మంది సభ్యత్వంతో భారతదేశంలోని గ్రంథాలయ సమాచార విజ్ఞాన రంగంలో అతిపెద్ద పేరుపొందిన వృత్తిపరమైన సంస్థ.[1]

ఈ సంఘ విధాన విషయాల రూపకల్పన, అమలుకు సంఘ సమితి (కౌన్సిల్), కార్యనిర్వాహకవర్గం (ఎగ్జిక్యూటివ్ కమిటీ), సెక్షనల్ కమిటీలు అనే మూడు ILA భాగాలు బాధ్యత వహిస్తాయి. ఈ సంఘం ప్రధాన కార్యాలయం భారతదేశంలో ఢిల్లీలో ఉంది. 1933 నుండి మొదటి 12 సంవత్సరాలు కలకత్తాలోని ఇంపీరియల్ లైబ్రరీలో ఉంది. ఇది 1946 నుంచి 1953 సెప్టెంబరు వరకు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పనిచేసింది. ఆ తర్వాత కార్యాలయం తిరిగి 1964 ఆగస్టు వరకు కలకత్తాలో ఉండి, ఇంక ఢిల్లీకి శాశ్వత ప్రాతిపదికన మార్చబడింది.[2]

లక్ష్యాలు

[మార్చు]

సంఘం ప్రధాన లక్ష్యాలు:[2]

  • దేశంలో గ్రంథాలయ ఉద్యమాన్ని ప్రోత్సహించడం
  • గ్రంథాలయ సిబ్బందికి శిక్షణ ఇస్తూ వారి స్థాయి మెరుగుపరచడం
  • గ్రంథాలయ సమాచార విజ్ఞాన రంగంలో విద్య, పరిశోధనను అభివృద్ధి చేయడం
  • ఇటువంటి లక్ష్యాలతో ఉన్న ఇతర జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలతో సహకారం కొనసాగించడం
  • పత్రికలు, నివేదికలు, పుస్తకాలు మొదలైన వాటి ప్రచురణ
  • గ్రంథాలయాలు, డాక్యుమెంటేషన్ & సమాచార కేంద్రాల స్థాపనలో సహాయం చేయడం, వాటి పనిని సులభతరం చేయడం
  • భారతదేశంలో తగిన గ్రంథాలయ చట్టాల ప్రకటనను ప్రోత్సహించడము ఇంకా పేర్కొన్న లక్ష్యాలను సాధించడంలో సహాయపడటము.
  • వృత్తిపరమైన, సాంకేతిక, సంస్థాగత సమస్యల చర్చ కోసం సదస్సులు, సమావేశాలను నిర్వహించడం ద్వారా గ్రంథాలయ సమాచార పనిలో నిమగ్నమైన లేదా ఆసక్తి ఉన్న వ్యక్తులందరికీ ఉమ్మడి వేదికను అందించడం
  • గ్రంథాలయ సమాచార విజ్ఞాన విద్య, శిక్షణను అందించే సంస్థలకు అధికారిక గుర్తింపు ఇవ్వడం
  • గ్రంథాలయ సమాచార వ్యవస్థ సేవల నిర్వహణ కోసం ప్రమాణాలు, నిబంధనలు, మార్గదర్శకాలు మొదలైన వాటి రూపకల్పన చేయడం

వ్యవస్థాపక సభ్యులు

[మార్చు]
  • సి. వూల్నర్
  • మహ్మద్ షఫీ
  • అబ్దుల్ మజీద్
  • మహ్మద్ కాసేమ్ అలీ
  • అబ్నాషి రామ్ తల్వార్
  • ఫై.సి. నియోగి
  • ఏ.ఎం.ఆర్. మాంటేగ్
  • ఆర్. గోపాలన్
  • ఎస్. రామసుబ్బియర్
  • రామ్ లభయ
  • త్రివిక్రమ రావు
  • ఎస్. బషీరుద్దీన్
  • డాక్టర్ ఎం.ఒ. థామస్
  • S. మహేంద్ర సింగ్
  • డాక్టర్ వలీ మహమ్మద్
  • ఎస్.ఆర్.రంగనాథన్
  • కె.ఎం. అసదుల్లా
  • సంత్ రామ్ భాటియా
  • కె. సెల్లయ్య
  • శారదా ప్రసాద్ సిన్హా
  • క్షితేంద్ర దేవ్ రాయ్ మహాశయ
  • టి.సి.దత్తా
  • కుమార్ మునీంద్ర దేవ్
  • ఆర్ మహాశయుడు
  • ఉపేంద్ర చంద్ర దాస్
  • లభూ రామ్
  • అయ్యంకి వెంకట రమణయ్య
  • మన్ చంద
  • యూసుఫుద్దీన్ అహ్మద్

కార్యనిర్వాహక వర్గం

[మార్చు]

సంఘం కార్యకలాపాలు నిర్వహించుటకు ప్రతి రెండు సంవత్సరాలకు కార్యనిర్వాహక వర్గాన్ని సభ్యులు ఎన్నుకుంటారు. ఒక అధ్యక్షుడు, ఆరుగురు ఉపాధ్యక్షులు, ఒక ప్రధాన కార్యదర్శి, ఇరవై మంది కౌన్సిల్ సభ్యులను జనరల్ కౌన్సిల్ రెండు సంవత్సరాల పాటు ఎన్నుకుంటుంది. వివిధ రంగాల వ్యాపార కార్యకలాపాలను పర్యవేక్షించడానికి పదకొండు డిపార్ట్ మెంటల్ కమిటీలు ఉన్నాయి.[3] ఆరుగురు ఉపాధ్యక్షులు దక్షిణ, ఉత్తర, తూర్పు, పడమర, కేంద్ర ప్రాంతానికి, ఇంకా కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించుతారు. వీరుకాకుండా ఒక కోశాధికారి, ఇద్దరు కార్యదర్సులు, ఒక గ్రంథాలయాధికారి, ప్రజాసంబంధాల అధికారి (PRO) కూడా ఈ సమితిలో సభ్యులు.[4]

సభ్యత్వం

[మార్చు]
  • పోషకులు, గౌరవ సభ్యులు, జీవిత సభ్యులు
  • గ్రంథాలయ సంఘ సభ్యుడు, సంస్ధాగత సభ్యుడు, సాధారణ సభ్యుడు
  • విదేశీ సభ్యులు, విదేశీ సంస్ధాగత సభ్యులు

సమావేశాలు

[మార్చు]

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఏటా సదస్సులు నిర్వహిస్తారు. దీని 33వ వార్షిక సదస్సు 1988 లో జరిగింది. 53వ వార్షిక సదస్సు 2007లో హైదరాబాద్‌లో జరిగింది. దీని 54వ వార్షిక సమావేశం 2008లో ముంబైలో జరిగింది. దీని 55వ వార్షిక సమావేశం గ్రేటర్ నోయిడాలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీలో 21- 2010 జనవరి 24 వరకు భారతదేశంలో జరిగింది. 63వ వార్షిక సమావేశం లక్నోలోని బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో 23- 2017 నవంబరు 25 వరకు "లైబ్రరీ , ఇన్ఫర్మేషన్ సైన్స్ వృత్తి యొక్క స్థిరమైన అభివృద్ధి" అనే అంశంపై జరిగింది. ఇది LIS విభాగం, బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ లక్నోలోని గౌతమ్ బుద్ధ సెంట్రల్ లైబ్రరీ నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు. 2023 నాటికి 68వ సదస్సు అజ్మీర్ (రాజస్థాన్) లో నిర్వహించారు.

ప్రచురణలు

[మార్చు]
  • ILA వార్తా పత్రిక (ILA News Letter) - ప్రతినెలా గ్రంథాలయ సమాచార విజ్ఞాన శాస్త్ర సమాచారం ప్రచురిస్తారు.
  • ILA జర్నల్ (Journal of Indian Library Association) : జర్నల్ ఆఫ్ ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ అనేది సంఘ అధికారిక విజ్ఞాన పత్రిక. ఈ పత్రిక 1965 నుంచి ప్రచురించబడుతోంది. ఇది గ్రంథాలయ సమాచార విజ్ఞాన శాస్త్రం గురించిన వివిధ అంశాలను ప్రచురిస్తుంది. త్రైమాసిక ప్రచురణగా జారీ చేయబడింది. ప్రచురణకు వచ్చిన వ్యాసాలను గ్రంథాలయ సమాచార విజ్ఞాన శాస్త్ర నిపుణులు సమీక్షిస్తారు.
  • సదస్సులు, కార్యకలాపాల నివేదికలు (Conference proceedings) : జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సదస్సులు నిర్వహించి వాటి ప్రతులను ప్రచురించి భద్రపరుస్తారు.

మూలాలు

[మార్చు]
  1. Ramakrishna Rao, K (April 1961). "Library development in India". The Library Quarterly: Information, Community, Policy. 31 (2): 135–153 – via JSTOR.
  2. 2.0 2.1 "Indian Library Association". Indian Library Association. Retrieved March 15, 2023.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "What is the Indian Library Association (ILA) - Library Science". LIBRARYSCIENCE.IN. Retrieved March 15, 2023.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. ILA CONSTITUTION (PDF). Delhi: INDIAN LIBRARY ASSOCIATION.