భారతీయ పౌరసత్వ చట్టం
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (మే 2017) |
ది ఇండియన్ సిటిజెన్‌షిప్ అండ్ నేషనాలిటీ లా, భారతరాజ్యాంగం దేశంలోని భారతీయులంరికీ ఒకే విధమైన పౌరసత్వం మంజూరు చేస్తుంది. 1955 భారతీయ రాజ్యాంగ పౌరసత్వ చట్టము (సిటిజన్‌షిప్ లా 1955) రెండవ భాగములో 5 నుండి 11 వ అధ్యాయాలలో ఈ చట్ట వివరణ చోటు చేసుకుంది. ఈ చట్టములో 1986 వ సంవత్సరం, 1992 వ సంవత్సరం, 2003వ సంవత్సరం, 2005 వ సంవత్సరం లలో దిద్దుబాట్లు జరిగాయి. 2003 వ సంవత్సరం భారతీయ పౌరసత్వ చట్టములో జరిగిన దిద్దుబాట్లు 2004 జనవరి 7 వ తారీఖున భారత రాష్ట్రపతి ఆమోదము పొంది, 2004 డిసెంబరు 4 నుండి అమలులోకి వచ్చాయి. 2005 వ సంవత్సరంలో భారతీయ పౌరసత్వ చట్టములో జరిగిన దిద్దుబాట్లు భారత రాష్ట్రపతి ద్వారా ప్రతిపాదించబడి 2005 జూన్ 28 నుండి అమలులోకి వచ్చాయి. ఈ దిద్దుబాట్లు జరిగిన తరువాత భారతీయ పౌరసత్వ చట్టము జస్ సాన్‌గ్యుఇనిస్ (వారసత్వముగా పౌరసత్వ హక్కును కలిగి ఉండుట) ను అనుసరిస్తుంది. అలాగే ఇది జస్ సోలి (భారతదేశములో పుట్టిన కారణముగా పౌరసత్వ హక్కు లభించుట) ని వ్యతిరేకిస్తుంది.
చట్టము
[మార్చు]పుట్టుకతో పౌరసత్వం
[మార్చు]1950 జనవరి 26 నుండి 1986 లో జరిగిన పౌరసత్వ చట్టము అమలైన 1987 జూలై 1 మధ్య కాలములో పుట్టిన వారికి పుట్టుకతో పౌరసత్వపు హక్కు లభిస్తుంది. 1987 జూలై 1 నుండి, తల్లి తండ్రులలో ఒక్కరు భారతీయులై భారతదేశములో పుట్టినట్లైతే వారికిపౌరసత్వం లభిస్తుంది. 2004 డిసెంబరు 3 నుండి అమలులోకి వచ్చిన భారతీయ పౌరసత్వ చట్టానుసారం భారతీయ దంపతులకు పుట్టిన వారు లేక తల్లి తండ్రులలో ఒకరు భారతీయులై రెండవ వారు చట్ట విరుద్ధమైన వలస ప్రజ కాని వారైతే, వారికి పుట్టిన శిశువుకు, భారతదేశములో జన్మించినట్లైతే, భారతీయ పౌరసత్వం లభిస్తుంది.
వారసత్వముగా పౌరసత్వం
[మార్చు]- 1950 జనవరి నుండి 1992 డిసెంబరు 10 మధ్య కాలములో భారతీయ పౌరుడికి అంటే పుట్టిన శిశువుకు తండ్రి భారతీయుడైతే అతడు విదేశాలలో నివసిస్తున్న సమయములో పుట్టిన వారికి వారసత్వముగా భారతీయ పౌరసత్వము లభిస్తుంది.
- 1992 డిసెంబరు 10 నుండి పౌరసత్వ చట్టములో దిద్దుబాటు అమలులోకి వచ్చిన తరువాత స్త్రీ పురుషులలో ఒక్కరు భారతీయ పౌరసత్వం ఉన్న వారైతే వారికి విదేశంలో జన్మించిన శిశువుకు భారతీయ పౌరసత్వం వారసత్వముగా లభిస్తుంది.
- 2004 డిసెంబరు 4 నుండి విదేశాలలో భారతీయ పౌరులకు పుట్టిన శిశువుకు వారు భారతీయ రాజ్యాంగంలో నమోదు చేసుకోనట్లైతే పౌరసత్వం లభించదు. శిశువు పుట్టిన తరువాత 1 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ అనుమతితో నమోదు చేసుకున్న వారికి మాత్రమే పౌరసత్వం లభిస్తుంది. శిశువు కొరకు ఈ దరఖాస్తు (అభ్యర్థన పత్రం) తప్పక భారత రాజ్యంగంలో మాత్రమే నమోదు చేయాలి. ఆ శిశువు నమోదు చేసుకునే సయములో తల్లి తండ్రులు పక్కన ఉండి, దరఖాస్తును శిశువు తరఫున నమోదు చేయాలి. దరఖాస్తును నమోదు చేసే సమయములో శిశువు ఏ దేశానికి చెందిన పాస్ పోర్ట్‌ను కలిగి ఉండ కూడదు.
పౌరసత్వము నమోదు చేయుట
[మార్చు]1955 భారతీయ పౌరసత్వ చట్టం 5 వ విభాగమును అనుసరించి, భారతీయ పౌరసత్వం పొందాలంటే, భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేయాలి. ఈ దరఖాస్తు పెట్టుకున్న వారు చట్టవిరుద్ధంగా భారతదేశములో నివసిస్తూ ఉండకూడదు. అతడు ఈ క్రింది కేటగిరీలలో ఏదైనా ఒకదానికి చెందిన వాడై ఉండాలి.
- అభ్యర్థన దారుడు భారతీయ స్థానికుడై ఉండి 5వ విభాగము రూపు దిద్దుకున్న సమయానికి ఏడు సంవత్సరాల ముందు కాలము నుండి భారతదేశములో నివసించిన వాడై ఉండాలి. అభ్యర్ధన చేసే సమయానికి ముందు 12 నెలల కాలము నిరంతరముగా భారతదేశములో నివసించి ఉండాలి.
- అభ్యర్థనదారుడు భారతీయ స్థానికుడై ఉండి, విడదీయని భారతదేశములో ఏ దేశములో కాని ఏ ప్రదేశములో కాని నివసించి ఉండాలి.
- భారతీయపౌరులను వివాహము చేసుకుని అభ్యర్థించే సమయానికి ఏడు సంవత్సరాలకు ముందు నుండి భారతదేశములో నివసిస్తున్న వారు భారతీయ పౌరసత్వానికి ఆభ్యర్ధన చేయవచ్చు.
- భారతదేశ పౌరుల మైనారిటీ తీరని సంతానము పౌరసత్వానికి అభ్యర్థన చేయవచ్చు.