భారత కేంద్ర బడ్జెట్ 2021 - 22
స్వరూపం
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
భారత కేంద్ర బడ్జెట్ 2021 - 22 (ఆంగ్లం: Union Budget 2021-22) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021 ఫిబ్రవరి 1న పార్లమెంటులో 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ పద్దును వందేళ్లకు ఓసారి వచ్చే బడ్జెట్‌గా ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అభివర్ణించారు. భారీగా ఇన్‌ఫ్రా, హెల్త్‌కేర్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టి భారత ఆర్థిక వ్యవస్థను పట్టాలపైకి ఎక్కించే ప్రయత్నం చేసింది.[1]
ఇందులోని ముఖ్యాంశాలు ఇవీ..
- పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు, ఉచిత వంట గ్యాస్, పింఛను తదితర అవసరాలకు పీఎం గరీబ్ కల్యాణ్ యోజన కింద రూ.2.76 లక్షల కోట్లు కేటాయించారు.
- 6 సంవత్సరాలకు గాను రూ. 64,180 కోట్ల రూపాయలతో ఆత్మనిర్భర్ యోజన పేరుతో కొత్త పథకం.
- కోవిడ్19 టీకాలకు రూ. 35,400 కోట్లు.
- జల జీవన్ మిషన్‌కు రూ. 2,87,000 కోట్.లు
- రైల్వేలకు 1.10 లక్షల కోట్లు, ప్రజా రవాణాకు రూ. 18.000 కోట్లు.
- 75 సంవత్సరాల వయోవృద్ధులు కేవలం పించన్, వడ్డీల పైన ఆధారపడినట్లయితే వారు వార్షిక ఆదాయపుపన్ను పత్రం (ITR) సమర్పించనవసరంలేదు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Union Budget 2022: ఈ బడ్జెట్ల రూటే సపరేటు." EENADU. Retrieved 2022-02-01.
- ↑ 2021 Union budget of India. వికీసోర్స్.