భారత జాతీయ గ్రంథాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేషనల్ లైబ్రరీ

నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా లేక భారత జాతీయ గ్రంథాలయం (Bengali: ভারতের জাতীয় গ্রন্থাগার) అనేది అలీపూర్, కోలకతా లోని బెల్వెడెరే ఎస్టేట్ లో కలదు,[1] ఇది వాల్యూమ్‌ పరంగా, భారతదేశం యొక్క ప్రజా రికార్డు గ్రంథాలయంగా భారతదేశంలో అతిపెద్ద గ్రంథాలయం.[2][3][4] ఇది భారత ప్రభుత్వం యొక్క సంస్కృతి శాఖ, పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో ఉంది. ఈ గ్రంథాలయం ప్రముఖ గ్రంథాల సేకరణకు, పుస్తక పంపిణీకి, భారతదేశంలో ముద్రించబడిన అమూల్య గ్రంథాల సంరక్షణకు ఉద్దేశించబడింది. ఈ గ్రంథాలయం సుందరమైన 30 ఎకరాల (120,000 m²) బెల్వెడెరే ఎస్టేట్ లో కలదు. ఇది 2.2 మిలియన్ల పుస్తకాల కంటే ఎక్కువ సేకరణతో భారతదేశంలో అతి పెద్దదిగా ఉంది.[5] స్వాతంత్ర్యం రావడానికి ముందు ఇది బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ అధికార నివాసంగా ఉండేది.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Useful Information". National Library.
  2. http://www.thecolorsofindia.com/interesting-facts/miscellaneous/largest-library-in-india.html
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-12-26. Retrieved 2015-01-03.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-04-07. Retrieved 2015-01-03.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-04-07. Retrieved 2015-01-03.

బయటి లింకులు[మార్చు]