భారత జాతీయ ప్రతిజ్ఞ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతదేశం పటం

భారత జాతీయ ప్రతిజ్ఞను పైడిమర్రి వెంకటసుబ్బారావు రచించాడు. ఆయన 1962లో ఈ ప్రతిజ్ఞ తయారు చేశాడు. భారత్-చైనా యుద్ధం తరువాత విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడం కోసం ప్రతిజ్ఞకు పదాలు కూర్చాడు. కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న పీవీజీ రాజుకు దాన్ని అందజేశాడు. 1964లో బెంగుళూరులో ప్రముఖ న్యాయ నిపుణుడు మహ్మద్ కరీం చాగ్లా అధ్యక్షతన కేంద్రీయ విద్యా సలహామండలి సమావేశం జరిపినప్పుడు జాతీయ ప్రతిజ్ఞగా స్వీకరించారు. తరువాత దీన్ని అన్ని భాషల్లోకి అనువాదం చేయించి 1965 జనవరి 26 నుంచి దేశమంతటా చదువుతున్నారు.[1]

పైడిమర్రి రాసిన ప్రతిజ్ఞలో కాలానుగుణంగా కొన్ని స్వల్ప మార్పులు మాత్రం జరిగాయి. గ్రాంథికంలో కొన్ని పదాల స్థానంలో వాడుక భాష వాడారు.

తెలుగు[మార్చు]

భారత జాతీయ ప్రతిజ్ఞ[మార్చు]

భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వార సత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్నీ గౌరవిస్తాను. ప్రతివారితోను మర్యాదగా నడచుకొంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం.

పాత రూపం[మార్చు]

భారతదేశము నా మాతృభూమి.

భారతీయులందరు నా సహోదరులు, సోదరీమణులు
నేను నా దేశమును ప్రేమించుచున్నాను.
సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణము.
దీనికి అర్హుడనగుటకై సర్వదా నేను కృషి చేయుదును.
నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరిని గౌరవింతును.
ప్రతివారితోను మర్యాదగా నడచుకొందును.
నా దేశముపట్లను, నా ప్రజలపట్లను సేవానిరతి కలిగియుందునని ప్రతిజ్ఞ చేయుచున్నాను.

వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందమునకు మూలము.

ప్రస్తుతరూపంలో చేసిన ప్రధానమైన మార్పు "అర్హుడనగుటకై" స్థానంలో లింగతటస్థతను సూచించే "అర్హత పొందడానికి" అనే పదాలను చేర్చడం. దానితోబాటుగా భాషను వాడుకభాషకు దగ్గరగా ఉండేటట్లు సరళీకరించినట్లు కూడా గమనించవచ్చు.

भारत हमारा देश है ।

हमें अपना देश प्राणों से प्यारा है ।
इसकी समृद्ध और विविध संस्कृति पर हमें गर्व है ।
हम इसके सुयोग्य अधिकारी बनने का सदा प्रयत्न करेंगे ।
हम अपने माता पिता शिक्षक और गुरु जनों का आदर करेंगे ।
और सबके साथ शिष्टता का व्यवहार करेंगे ।
अपने देश और देशवासियों के प्रति हम अपनी निष्ठा की प्रतिज्ञा करते हैं ।

उनके कल्याण और सुखसमृद्धि में ही हमारा सुख निहित है

మరాఠీ[మార్చు]

भारत माझा देश आहे।

सारे भारतीय माझे बांधव आहेत।
माझ्या देशावर माझे प्रेम आहे।
माझ्या देशातल्या समृद्ध आणि
विविधतेने नटलेल्या परंपरांचा मला अभिमान आहे।
त्या परंपरांचा पाईक होण्याची पात्रता
माझ्या अंगी यावी म्हणून मी सदैव प्रयत्न करीन।
मी माझ्या पालकांचा, गुरुजनांचा
आणि वडीलधार्‍या माणसांचा मान ठेवीन
आणि प्रत्येकाशी सौजन्याने वागेन।
माझा देश आणि माझे देशबांधव
यांच्याशी निष्ठा राखण्याची
मी प्रतिज्ञा करीत आहे।
त्यांचे कल्याण आणि
त्यांची समृद्धी ह्यांतच माझे

सौख्य सामावले आहे।

మైథిలీ[మార్చు]

भारत हमर देश थिक।

हम सब भारतवासी भाई बहिन छी।
हमर देश अपन प्राणहुँ स प्रिय अछि।
हम भारतक आ विविध संस्कृति पर गर्व करैत छी।
हम भारतक सुयोग्य अधिकारी हैबाक सदा प्रयत्न करब।
हम अपन माता पिता शिक्षक और गुरु जनक आदर करब आ सबहक संग शिष्टताक व्यवहार करब ।
अपना देश आ देशवासीक प्रति हम अपन निष्ठाक प्रतिज्ञा करैत छी ।

हुनक कल्याण और सुखसमृद्धि टा में हमारा सुख निहित अछि ।

సంస్కృతం[మార్చు]

भारत मम देशोऽयं भारतीयाश्च बान्धवाः ।

परानुरक्तिरस्मिन्‌ मे देशेऽस्ति मम सर्वदा ॥ १॥
समृद्धा विविधाश्चास्य या देशस्य परम्पराः ।
सन्ति ताः प्रति मे नित्यमभिमानोन्नतं शिरः ॥ २॥
प्रयतिष्ये सदा चाहमासादयितुमर्हताम्‌ ।
येन तासां भविष्यामि श्रद्धायुक्तः पदानुगः ॥ ३॥
संमानयेयं पितरौ वयोज्येष्ठान्‌ गुरूंस्तथा ।
सौजन्येनैव वर्तेय तथा सर्वैरहं सदा ॥ ४॥
स्वकीयेन हि देशेन स्वदेशीयैश्च बान्धवैः ॥
एकान्तनिष्ठमाचारं प्रतिजाने हि सर्वथा ॥ ५॥
एतेषामेव कल्याणे समुत्कर्षे तथैव च ।

नूनं विनिहितं सर्वं सौख्यमात्यन्तिकं मम ॥६॥

గుజరాతీ[మార్చు]

भारत मारो देश छे।

बधा भारतीयो मारा भाई बहेनो छे।
हुं मारा देशने चाहुं छुं अने तेना समृद्ध अने
वैविध्यपूर्ण वारसानो मने गर्व छे।
हुं सदाय तेने लायक बनवा प्रयत्न करीश।
हुं मारा मातापिता शिक्षको अने वडीलो प्रत्ये आदर राखीश
अने दरेक जण साथे सभ्यताथी वर्तीश।
हुं मारा देश अने देशबांधवोने मारी निष्ठा अर्पुं छुं।
तेमना कल्याण अने समृद्धिमां ज मारुं सुख रह्युं छे।


ભારત મારો દેશ છે।
બધા ભારતીયો મારા ભાઈ બહેનો છે।
હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને
વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે।
હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ।
હું મારા માતાપિતા શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ
અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ।
હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પું છું।

તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે।

ఆంగ్లము[మార్చు]

India is my country.

All Indians are my brothers and sisters.
I love my country and, I am proud of it's rich and varied heritage.
I shall always strive to be worthy of it.
I shall give my parents, teachers and all elders respect and treat everyone with courtesy.
To my country and my people, I pledge my devotion.

In their wellbeing and prosperity alone, lies my happiness.

మూలాలు[మార్చు]

  1. సాక్షి ఆదివారం సంచిక ఆగస్టు 10, 2014 11వ పేజీ

వెలుపలి లంకెలు[మార్చు]