Jump to content

భారత జాతీయ మానవ హక్కుల కమిషన్

వికీపీడియా నుండి
జాతీయ మానవ హక్కుల కమిషన్
భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ లోగో
నినాదంసర్వే భవంతు సుఖినా
అందరు సంతోషంగా ఉండాలి
Agency overview
Formed12 అక్టోబర్ 1993
Legal personalityGovernmental: Government agency
Jurisdictional structure
Federal agency[[ భారతదేశం]]
General nature
Operational structure
Headquartersసర్దార్ పటేల్ భవన్, న్యూఢిల్లీ, భారతదేశం
Agency executiveవి.రామసుబ్రమణియన్, చైర్‌పర్సన్‌
Website
Official website

భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ 1993లో భారత పార్లమెంటు మానవ హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం 1993 అక్టోబరు 12న ఏర్పడింది. ఈ కమిషన్ రాజ్యాంగ బద్దంగా, చట్టబద్దంగా ప్రజలకు కల్పించిన హక్కుల రక్షణ బాధ్యతలు చేపడుతుంది.[1]

దేశంలోని ఏ వ్యక్తి అయినా స్వేచ్ఛగా బతికే హక్కు ఉందని, అతని హక్కులకు భంగం కలిగించినా, అన్యాయంగా ఎన్ కౌంటర్ ల పేరిట చంపినా ప్రశ్నించేందుకు రాజ్యాంగం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. తప్పు చేసిన ఏ వ్యక్తినైనా చట్టపరంగానే శిక్షించాలి కానీ చట్టాన్ని తీసుకుని ఏ విధమైన చర్యలు పాల్పడరాదు. అలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించి విచారిస్తుంది.

నిర్మాణం

[మార్చు]

జాతీయ మానవ హక్కుల కమిషన్ బహుళ సభ్య సంస్థ. దీనిలో ఒక చైర్మన్ నలుగురు సభ్యులు ఉంటారు. చైర్మన్ గా నియమితులయ్యే వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసినవారై ఉండాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న లేదా పదవీ విరమణ చేసిన వారు ఒక సభ్యుడిగా ఉంటారు. మరో సభ్యుడు ఏదైనా హైకోర్టు నుంచి న్యాయమూర్తిగా పనిచేస్తున్న లేదా పదవీ విరమణ చేసిన వారై ఉండాలి. మిగిలిన ఇద్దరు సభ్యులు మానవ హక్కుల రంగంలో పరిజ్ఞానం ఉన్నవారై ఉండాలి. పై సభ్యులతో పాటు మరో నలుగురు పదవి రీత్యా సభ్యులుగా ఉంటారు.[2]

నియామకం

[మార్చు]

జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు. వీరి నియామకంలో ప్రధాన మంత్రి అధ్యక్షతన ఆరుగురు సభ్యుల కమిటీ సలహా ఇస్తుంది.

  1. భారత ప్రధాన మంత్రి (చైర్మన్)
  2. కేంద్ర హోంశాఖ మంత్రి
  3. లోక్‌సభ స్పీకర్
  4. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
  5. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు
  6. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు

పదవీకాలం, తొలగింపు

[మార్చు]

జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీ కాలం ఐదేళ్లు లేదా 70 ఏళ్ల వయసు వచ్చే వరకు. ఏది ముందైతే అది వర్తిస్తుంది. కమిషన్ చైర్మన్, సభ్యులను తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది.

విధులు

[మార్చు]
  1. మానవ హక్కులను పరిరక్షించడం
  2. జైళ్లలో ఉన్న ఖైదీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని మార్గదర్శకాలు ఇవ్వడం
  3. మానవ హక్కుల రంగంలో పరిశోధన చేపట్టడం
  4. ప్రజలకు మానవ హక్కుల పట్ల అవగాహన కల్పించడం
  5. కమిషన్‌కు సంవత్సరం కంటే ముందు జరిగిన విషయాలన విచారించే అధికారం లేదు

జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్లు

[మార్చు]
నెం.ఫోటోపేరుపదవి కాలం
1.జస్టిస్ రంగనాథ్ మిశ్రా1993 అక్టోబరు 121996 నవంబరు 24
2.జస్టిస్ ఎం.ఎన్. వెంకట చలయ్య1996 నవంబరు 261999 అక్టోబరు 24
3.జస్టిస్ జేఎస్. వర్మ1999 నవంబరు 42003 జనవరి 17
4.జస్టిస్ ఏ.ఎస్. ఆనంద్2003 ఫిబ్రవరి 172006 అక్టోబరు 31
-జస్టిస్ శివరాజ్ పాటిల్
ఆపద్ధర్మ చైర్మన్
2006 నవంబరు 12007 ఏప్రిల్ 1
5.జస్టిస్ రాజేంద్ర బాబు2007 ఏప్రిల్ 22009 మే 31
-జస్టిస్ గోవింద్ మాథుర్
ఆపద్ధర్మ చైర్మన్
2009 జూన్ 12010 జూన్ 6
6.జస్టిస్ కే.జి. బాలకృష్ణన్2010 జూన్ 72015 మే 11
-జస్టిస్ సీరియాక్ జోసెఫ్
ఆపద్ధర్మ చైర్మన్
2015 మే 112016 ఫిబ్రవరి 28
7.జస్టిస్ హెచ్.ఎల్ దత్తు2016 ఫిబ్రవరి 292020 డిసెంబరు 2
–జస్టిస్ ప్రఫుల్ల చంద్ర పంత్
ఆపద్ధర్మ చైర్మన్
2 May 2021[3]1 June 2021
8. జస్టిస్ అరుణ్‌ కుమార్ మిశ్రా [4][5] 2021 జూన్ 2 ప్రస్తుతం

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ↑ V6 Velugu (14 December 2019). "హక్కుల రక్షణకు ఎన్ హెచ్ ఆర్ సీ NHRC for the protection of rights". Archived from the original on 24 ఆగస్టు 2021. Retrieved 24 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. ↑ Nava Telangana (31 January 2020). "జాతీయ మానవహక్కుల కమిషన్ చైర్మన్, సభ్యులను ఎవరు నియమిస్తారు? | దీపిక | www.NavaTelangana.com". Archived from the original on 4 ఫిబ్రవరి 2020. Retrieved 24 August 2021.
  3. ↑ "Justice Pant appointed NHRC acting chairperson". The Hindu. 3 May 2021. Retrieved 4 May 2021.
  4. ↑ Namasthe Telangana (2 June 2021). "ఎన్ హెచ్ ఆర్ సీ చైర్ పర్సన్ గా అరుణ్ మిశ్రా". Namasthe Telangana. Archived from the original on 3 జూన్ 2021. Retrieved 3 June 2021.
  5. ↑ Namasthe Telangana (2 June 2021). "ఎన్ హెచ్ఆర్ సీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన మాజీ జస్టిస్ అరుణ్ మిశ్రా". Namasthe Telangana. Archived from the original on 3 జూన్ 2021. Retrieved 3 June 2021.