Jump to content

భారత సాయుధ దళాల పతాక దినోత్సవం

వికీపీడియా నుండి


సాయుధ దళాల పతాక దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబరు మాసములో ఏడవ తేదిన దేశమంతట చేసుకొనుట ఆనవాయితీ.  సాయుధ దళాలు దేశరక్షణ కొరకు అహర్నిశలు చేయుచున్న కృషి, శత్రువుల బారినుండి దేశాన్ని రక్షిస్తూ వారు చేసిన త్యాగాలు గుర్తు చేసుకుంటూ వారు, వారి కుటుంబాలకు మనము అండగా ఉన్నట్లు తెలియచేయుట ఈనాటి ప్రత్యేకత.

1949 లో రక్షణ మంత్రి కమిటీ పతాకదినోత్సవం ప్రతి ఏటా 7 డిసెంబరు న జరుపుకోవాలని నిర్ణయించారు.

మన భారత సైన్యం, వైమానిక దళం, నావికా దళం దేశసరిహద్దులను కాపాడటమే కాకుండా దేశంలోని అంతర్గతముగా జరిగే అనేక విపత్కర పరిస్థితులను చక్క దిద్దడములో ముఖ్య పాత్ర పోషిస్తూ దేశ ప్రజల ధన, మాన ప్రాణాలను రక్షించడంలో సాయుధ ధళాలు ముందువరసలో ఉంటాయన్న విషయం మనందరికి తెలుసు. విభిన్న రాష్ట్రాలలో వచ్చిన వరదలు, భూకంపాలలో వేలమంది ప్రజలు కొండలు, గుట్టల్లో చిక్కుకున్నపుడు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండ వారిని కాపాడి సురక్షిత స్థలాలకు చేర్చిన సంగతి మనకి విదితమే.  ఇంతే కాకుండా పలుచోట్ల జరిగిన ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టుచూ వేలమంది ప్రజలను రక్షిస్తూ వీరమరణం పొందిన విషయం కూడా మనందరికీ తెలుసు.

⚜• మూడు సర్వీసులు ప్రాతినిధ్యం ఎరుపు, లోతైన నీలం, కాంతి నీలం రంగుల్లో టోకెన్ జెండాలు, కారు జెండాలు విరాళాలు ప్రతిఫలంగా కేంద్రీయ సైనిక్ బోర్డు ద్వారా రాజ్యసభ, జిల్లా సైనిక్ బోర్డ్ ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తారు.

⚜దేశరక్షణకోసము పోరాడే సైనిక సిబ్బంది కుటుంబీకులు, వారిపై ఆధారపడి జీవించేవారి పరిరక్షణ గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత సాధారణ ప్రజలు పాలు పంచుకోవాలనే ఉద్దేశముతో విరాలాలు వసూలు చేసున్న దృస్ట్యా ఫ్లాగ్ డేకు అత్యధిక ప్రాధాన్యత లభించినది

ఫ్లాగ్ డే ప్రధానముగా మూడు ప్రయోజనాల్ని దృస్టిలో ఉంచుకుంటుంది .

🍥1. యుద్ధములో గాయపడినవారికి పునరావాసము కల్పించడం,

🍥2. సర్వీసులో గల సిబ్బంది, వారి కుటుంభీకుల సంక్షేమము,

🍥3. మాజీ సైనికోద్యోగులు, వారి కుటుంబీకుల సంక్షేమము, పునర్నివాసము కల్పించడం,

సైనిక సంక్షేమ శాఖ అమరవీరుల కుటుంబాలు,  మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమము కొరకు ప్రత్యేకముగా స్థాపించబడింది. ఈ శాఖ రాష్ట్రములో హోం శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వము తరుపున అందించే అన్ని రాయితీలను వారికి సక్రమముగా చేర్చుట కొరకు ఈ శాఖ ప్రత్యేకముగా కృషిచేస్తుంది.  

ఇలాంటి వీర సైనికుల సంక్షేమం చూడటం మనవంతు బాధ్యత వారికి, వారి కుటుంబాలకు   సహాయం చేయడం మన ప్రజల కర్తవ్యం.  ఇందుకోసంగాను “సాయుధ ధళాల పతాక దినోత్సవ నిధిని” ప్రభుత్వము ఏర్పాటు చేసారు. ఈ నిధికి గౌరవనీయ గవర్నర్ గారు చైర్మన్ గా,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైస్ చైర్మన్ గా, సంచాలకులు, సైనిక సంక్షేమ శాఖ వారు సెక్రటరీగా ఇంకా అనేకమంది సైనిక అధికార్లు, ప్రభుత్వఅధికార్లు మెంబర్లుగా వ్యవహరిస్తారు.   ఈ నిధి నుండి మాజీ సైనికులకు, వితంతువులకు, వారిపై ఆధారపడిన వారికి ఆర్థిక సహాయం అందిస్తారు.

⚜సంక్షేమ నిధుల్ని 1993 లో రక్షణమంత్రిత్వ శాఖ ' ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఫ్లాగ డే ఫండ్ " గా మార్చింది . ఇతరత్రా నిధులు కూడా దీనిలో కలిసి ఉంటాయి .

ఇందుకోసం సాయుధ దళాల పతాక దినోత్సవం డిసెంబరు మాసంలో జరుపుకొని సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళాలు ప్రజల వద్దనుండి సేకరిస్తారు.  ఇందుకోసంగాను స్టిక్కర్ ఫ్లాగ్, కార్ ఫ్లాగ్ లను ప్రజలకు అందచేసి వారినుండి విరాళాలను సేకరిస్తుంది, కొన్ని హుండీ డబ్బాలను వివిధ విద్యాలయాలకు, కార్యాలయాలకు పంపి వాటి ద్వారా కూడా విరాళాలు స్వీకరిస్తారు