భార్గవి చిర్ములే
స్వరూపం
భార్గవి చిర్ములే | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1994–ప్రస్తుతం |
భార్గవి చిర్ములే మహారాష్ట్రకు చెందిన టివి, సినిమా నటి.[1] అనేక మరాఠీ సినిమాలు, టెలివిజన్ సీరియల్స్‌లో నటించింది. కాస్, వన్ రూమ్ కిచెన్ వంటి సినిమాలు, ఫు బాయి ఫు రియాలిటీ షోతో గుర్తింపు పొందింది.
జననం, విద్య
[మార్చు]భార్గవి మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. తండ్రి శిరీష్, తల్లి సాయి చిర్ములే. ముంబై-గిర్గావ్‌లో పెరిగింది. తర్వాత ఆమె కుటుంబం దాదర్‌కు తరలివెళ్ళిది. రాజా శివాజీ విద్యాలయంలో తన పాఠశాల విద్యను చదివింది. ముంబైలోని రూపారెల్ కాలేజీ నుండి గ్రాడ్యుయేట్ పూర్తిచేసింది. "భరతనాట్యం" కూడా నేర్చుకుంది. యోగా థెరపిస్ట్ కూడా పనిచేస్తోంది.
సినిమాలు
[మార్చు]- గుల్హర్ (2022)
- హిచ్యసతి కే పాన్ (2018) [2]
- ఓలి కి సుకి (2017)
- సండూక్ (2015)
- ఇష్క్ వాలా లవ్ (2014)
- సాసు చ స్వయంవర్ (2013)
- నవరా మజా భావ్రా (2013)
- గోలా బెరిజ్ (2012)
- ఒక రూం కిచన్ (2011)
- ధగేడోర్
- కాస్ (2010)
- ఐడియాచి కల్పన (2010)
- విశ్వవినాయక్ (1994)
- టికె పాటిల్
టీవీ సీరియల్స్
[మార్చు]- ఆనంది గోపాల్ (90లలో డిడి మెట్రోలో ప్రసారం చేయబడింది)
- వాహినీసాహెబ్
- చార్ దివాస్ ససుచే
- అనుబంధ్
- అసంభవ
- పింజారా
- శ్రీమంత్ గంగాధర్ పంత్
- ఫు బాయి ఫు
- ఏకా పేక్ష ఏక్
- అనుపమ
- సువాసిని
- భాగ్యవిధాత
- ప్రపంచం
- స్వరాజ్య జననీ జీజామాతా
- సియా కే రామ్
- రక్త సంబంధ్
- జాగో మోహన్ ప్యారే
- మోల్కరిన్ బాయి - మోతీ తిచి సావలి
- ఆయి - మయేచ కవచ
నాటకరంగం
[మార్చు]- హిమాలయాచి సావలి
- జోపి గేలేలా జగ జాలా
మూలాలు
[మార్చు]- ↑ "Bhargavi Chirmule: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". The Times of India. Retrieved 2022-12-09.
- ↑ "Hichyasathi Kay Pan".