భాషా చారిత్రక వ్యాసములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భాషాచారిత్రక వ్యాసములు
కృతికర్త: కోరాడ రామకృష్ణయ్య
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: వ్యాస సంపుటము
విభాగం (కళా ప్రక్రియ): భాషాశాస్త్రము
ప్రచురణ: కోరాడ పబ్లిషింగ్ హౌస్, మద్రాసు
విడుదల: 1954


ప్రముఖ భాషాశాస్త్రవేత్త కోరాడ రామకృష్ణయ్య వివిధ సందర్భాలలో భారతి మాసపత్రికలో వ్రాసిన వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి[1]. ఈ పుస్తకాన్ని 1954లో ప్రచురించారు.

విషయసూచిక[మార్చు]

  1. భాషాశాస్త్రము - దాని క్రమాభివృద్ధి
  2. ఆంధ్ర భాషాభ్యుదయము
  3. ఆంధ్ర దేశ్యము - అన్య దేశ్యము
  4. ద్రావిడ భాషల పరస్పర సంబంధము
  5. అరవము, తెలుగు - వాని ప్రాచీనత
  6. భాషా కుటుంబములు

పత్రికాభిప్రాయము[మార్చు]

తెలుగుభాష యొక్క పుట్టు పూర్వోత్తరములను చర్చించుటకు శ్రీ కోరాడ రామకృష్ణయ్య రచించి ప్రకటించిన ఈ గ్రంథము అట్టి జిజ్ఞాస కలవారికి, అట్టి పరిశోధన చేసే వారికి కంచుకాగడా వంటిది. శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారు సంస్కృతమువల్ల తెనుగు బహుముఖ వికాసము చెందినదనే విషయమును అంగీకరించెదరు. కాని, తెనుగు అనునది ఒక ప్రత్యేకమైన అనాదిసిద్ధమైన భాష కాదనెడివారి వాదనను అంగీకరించరు. తెనుగు అనునది అనాదిసిద్ధమైన ద్రావిడభాషా కుటుంబమునకు చెందినదని నిరూపించుటకు వీరు చేసిన పరిశోధన రాగద్వేష రహితమైనది. - భారతి మాసపత్రిక అక్టోబరు 1954

మూలాలు[మార్చు]

  1. [1] Archived 2016-03-05 at the Wayback Machine భారతి మాసపత్రిక అక్టోబరు 1954 సంచిక పుటలు 96-97