భీమయ్యక్ జాతర
భీమయ్యక్ జాతర తెలంగాణ రాష్ట్రం కుంరం భీం జిల్లా తిర్యాణి మండలం దంతన్ పల్లి గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో కొలాము గిరిజనులు ఆరాధ్యదైవంగా కొలుచే భీమయ్యక్ దేవుడి వద్ద జరిగే జాతర[1]
చరిత్ర
[మార్చు]కలియుగంలో అడవుల్లో నివసిస్తున్న ఆదివాసులు - అనేక అంతు చిక్కని రోగాల బారిన పడి బాధపడుతుండగా ఆసిఫాబాద్, తిర్యాణి, అడవులల్లో నివసిస్తున్న దైవ చింతన కల్గిన కొలాం పూజారి ఒక్కరికి భీమయ్యక్ కలలోకి వచ్చి ఈ ప్రాంతంలో రోగాల బారిన పడుతున్న వారిని, ఆ రోగాల నుండి కాపాడుటకు నేను దంతన్ పల్లి అడవుల్లో కొలువై ఉన్నాను. రోగులు నా దగ్గరికి వచ్చి పూజలు చేయగా వారి బాధలు తొలగి రోగ విముక్తులు కాగలరని అతనికి కలలో వచ్చి చెప్పడం జరిగింది. నీవు ప్రత్యక్షమైన స్థలాన్ని గుర్తించడం ఎలా సాధ్యమని అడగగా నేను దీక్ష చేసిన స్థలంకు కాపాలాగా ఒక పెద్దపులి ఉంటుందని నీవు వెళ్ళగానే ఆ పెద్దపులి నిన్ను చూసి వెళ్ళిపోతుందని ఆ స్థలంలో నేను కొలువై ఉన్నానని తెలియజేసి అదృశ్యం కావడం జరిగింది. మరుసటి రోజు ఉదయాన్నే కొలాం పూజారి ఈ కల నిజమేనా కాదా! అని భీమయ్యక్ చెప్పిన చోటికి వెళ్ళి చూడగానే నాలుగు దిక్కుల నాలుగు చోట్లలో పులి అడుగు జాడలతో గుడికి పునాది వేసినట్లు చతురస్రాకారంలో పులి అడుగులు ఉన్న స్థలాన్ని చూసి పూజారి ఆశ్చర్య పోయాడు. ఆ విషయాన్ని మిగతా వారికి తెలియజేసి ఇచ్చట దేవుడు కొలువై ఉన్నాడని చెప్పగా మిగతా కోలాం పెద్దలు ఆ స్థలాన్ని పరిశీలించగా దైవ చింతన కల్గిన ఒక పూజారికి పూనకం వచ్చి ఇచ్చట గుడి నిర్మించి భీమయ్యక్ పేరిట, నియమ, నిష్ఠలతో పూజలు నిర్వహిస్తే మీకున్న రోగాలు, బాధలన్నీ తొలగిపోయి సుఖశాంతులు కలుగుతాయని పూనకం వచ్చిన పూజారి తెలియజేయగా పూర్వీకులు అచ్చట సుమారు 16వ శతాబ్దంలో గుడి నిర్మించి పూజలు చేయడం ప్రారంభించినట్లు పెద్దలు చెప్తారు.
మూలాలు
[మార్చు]- ↑ "కొలాం గిరిజనుల ఆరాధ్య దైవం భీమయ్య.. పూజలు నిర్వహించిన గిరిజనులు." News18 తెలుగు. 2024-01-21. Retrieved 2024-12-21.