భీమిలి ఉత్సవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నవంబరు 9,10 తేదీలలో ఈ ఉత్సవాలు జరిగాయి.వివిధ కళా రూపాలు , స్టాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు.ప్రతి సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. శాస్త్రీయ నృత్య ప్రదర్శణ, సంగీత విభావరి,స్థానిక కళాకారుల ప్రదర్శనలు, బాడీ బిల్డింగ్ , బాక్సింగ్ పోటీలు,ఎడ్ల పందాలు ప్రత్యేక ఆకర్షణ గా మారింది. దేవాలయాల నమూణా ప్రదర్శన, తదుపరి బహుమతుల ప్రదానం తో కార్యక్రమాలు ముగింపు కు వస్తుంది. రెండో రోజు మరికొన్ని కార్యక్రమాలు గిరిజన నృత్య ప్రదర్శణ , రంగస్థల నృత్యాలు మొదలైన స్థానిక కళా రూపాలకు ప్రాధాన్యతను ఇవ్వడం కోసమే ఈ ఉత్సవము యొక్క ముఖ్య ఉద్దేశ్యం గా కనబడుతుంది.[1] పడవ పందాలు రెండోరోజు విశేషం గా కనబడ్డాయి. గతం లో 2006 లో ఒకసారి జరిగాయి,గత ఏడాది కూడా రెండ్రోజుల పాటు జరిగాయి.

పోటీలు:[మార్చు]

ఉత్సవాలలో భాగంగా విధ్యార్ధులకు కబడ్డీ, ఖోఖో,వాలీబాల్, త్రోబాల్,వ్యాసరచన పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలు,మ్యూజికల్ చైర్, క్యాండిల్ గేం,ఉంటాయి. ఈ ఉత్సవాలకు రూ యాబై లక్షలు కేటాయించారు.[2] పర్యాటక రంగ ప్రోత్సాహానికే పెద్ద పీట వేయుటకే ఈ ఉత్సవాలు. సాగరతీరాన్న ఉండడం ఒక ప్రత్యేకత.

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

దక్షిణ భారత దేశములో మొదటి మున్సిపాలిటీయైన భీమిలి ,దేశం లో సూరత్ తర్వతి స్థానం. ఇక్కడ సర్వ మతాలకు పురాతన ఆనవాళ్ళు కనబడతాయి .బౌద్ధ అవశేషాలు, కైస్తవ మిషనరీలు, హిందూ దేవాలయాలతో విలసిల్లుతుంది. పోలండ్, ఇంగ్లండ్,నెదర్లాండ్ వారి వ్యాపార కేంద్రంగా మార్చి న వైనం చరిత్ర సాక్షిగా ఉంది. ఎర్రమట్టి దిబ్బలు ప్రత్యేక ఆకర్షణ గా పదకోండు వందల తొంబది ఐదు ఎకరాలలో విస్తరించి పర్యాటకలను ఆకర్షించుటలో ప్రధమ స్థానం లో ఉన్నాయి.[3] మంగమూరిపేట వద్ద సహజ తోరణాలు మరోక ఆకర్శ్ఃఅణ. బౌధ్హ ఆకర్షణలు గా తొట్ల కొండ, భావి కొండ ఇప్పటికే నిలిచే ఉన్నాయి. దక్షిణ భారత దేశములోనె మొదటి జనపనార పరిశ్రమ చిట్టి వలస లో స్థాపించారు. మొదట బెల్లం, నీలిమందు తర్వాత జనపనారకు ప్రసిద్ధి చెందింది. కోబ్బరి ఎగుమతుల కొసం నిర్మించిన సముద్ర ము లొనికి జెట్టీ ఇప్పటీకీ ఉంది. ఇక్కడ పాండవులు అజ్నాత వాసం లో గడిపారని ప్రసిద్ధి ఉంది.లండన్ మిషన్ చర్చ్ నూట యాబై ఏళ్ళ నుండి ఉంది. ఘోస్తనీ త్రివేణీ సమ్గమం గా శివ బౌద్ధ, వైశ్టవ లకు నెలవు గా ఉమ్ది.

చుట్టు ప్రక్కల గ్రామాలా భాగస్వామ్యం తో ఈసారి ఉత్సవం ను నిర్వహించడం. దగ్గర లోని పావురాల కొండ, తొట్ల కొండ,బొజ్జన్న కొండ పర్యాటకులను ఆకర్శ్ఃఇస్తునే ఉన్నాయి. వారీజా ఆశ్రమము: వేదాలకు నిలయమ్ గా ఈ వారీజా ఆశ్రమం నిలుస్తుమ్ది.వేద పాటశాల, నేత్ర శాల కలవు. ఇక్కడ చూడ దగ్గ ప్రదెశాలలో రామాద్రి ఒకటి. ఎర్రమట్టి దిబ్బలను జిలాజికల్ సర్వే వాళ్ళు అరుదైన వారసత్వ సంపదగా గుర్తించింది.ప్రాచీన కట్టడాలు , దచ్ సమాధులు విజ్నానాన్ని ఇస్తే , ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రాచీన దెవాలయాలు,సాగర తీరం సేదతీరేందుకు దోహదపడుతూఉంది. భీమిలి చిన్న పట్టణమైనా ఎంతో ఘన చరిత్ర కలిగినది.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]