భీమ్ సింగ్ (రాజకీయ నాయకుడు)
భీమ్ సింగ్ | |||
జమ్మూ కాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ ఛైర్మన్
| |||
పదవీ కాలం 1982 మార్చి 23 – 2012 అక్టోబర్ 27 | |||
ముందు | కార్యాలయం ఏర్పాటు | ||
---|---|---|---|
తరువాత | హర్ష్ దేవ్ సింగ్ | ||
జమ్మూ కాశ్మీర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు
| |||
పదవీ కాలం 2003–2008 | |||
లోక్ సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 1988 | |||
Constituency | ఉధంపూర్, జమ్మూ కాశ్మీర్ హైకోర్టు. తీర్పు తర్వాత విజేతగా ప్రకటించబడింది. | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | భుగ్టేరియన్, రామ్‌నగర్, ఉధంపూర్, జమ్మూ కాశ్మీర్ (యువరాజ్యం), బ్రిటీష్ రాజ్ | 1941 ఆగస్టు 17||
మరణం | 2022 మే 31 జమ్ము, జమ్మూ కాశ్మీర్, భారతదేశం | (వయసు 80)||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ (1966–1982) జమ్మూ కాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ (1982–2020) | ||
జీవిత భాగస్వామి | జయ మాల | ||
సంతానం | 1 | ||
పూర్వ విద్యార్థి | అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ యూనివర్శిటీ ఆఫ్ లండన్ ఇన్స్ ఆఫ్ కోర్ట్ స్కూల్ ఆఫ్ లా | ||
వెబ్‌సైటు |
భీమ్ సింగ్ (1941 ఆగస్టు 17 - 2022 మే 31) జమ్మూ కాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ (JKNPP) వ్యవస్థాపకుడు. ఆయన మానవ హక్కుల నేత. రచయిత. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సీనియర్ కార్యవర్గ సభ్యుడిగా భీంసింగ్ సుపరిచితుడు.
రాజకీయ జీవితం
[మార్చు]కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లో అడుగుపెట్టిన భీమ్ సింగ్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. 1982లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన జమ్మూ కాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీని స్థాపించారు. 2002లో జమ్మూకశ్మీర్‌కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జె.కె.ఎన్.పి.పి నాలుగు స్థానాలు కైవసం చేసుకుంది. పాలస్తీనా నేత అరాఫత్, క్యూబా విప్లవ నేత ఫెడెల్ కాస్ట్రో, సద్దాం హుస్సేన్, లిబియా నియంత గడాఫీతో భీంసింగ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
గుర్తింపు
[మార్చు]భీమ్ సింగ్ డోగ్రీ ప్రమోషన్ కౌన్సిల్ కన్వీనర్. డోగ్రీ భాష, సంస్కృతి, చరిత్రకు చేసిన కృషికి 2011లో డోగ్రా రతన్ అవార్డు అందుకున్నారు.[1][2]
మరణం
[మార్చు]కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 81 ఏళ్ళ భీమ్ సింగ్ జమ్మూకశ్మీర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2022 మే 31న తుదిశ్వాస విడిచారు.[3] ఆయనకు భార్య జయ మాల, కుమారుడు అంకిత్ లవ్ (గ్రేట్ బ్రిటన్‌లోని వన్ లవ్ పార్టీ నాయకుడు) ఉన్నారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Dogra Rattan Awards presented". Kashmir Times. Kashmir Times. 24 November 2011. Retrieved 17 March 2012.[permanent dead link]
- ↑ "Eight to get Dogra Rattan Award". The Tribune. Tribune Trust. 24 November 2011. Retrieved 17 March 2012.
- ↑ "JKNPP founder Bhim Singh passes away at 81". The Chenab Times. 31 May 2022. Retrieved 31 May 2022.
- ↑ Rashid, Saima. "All of a Sudden, Kashmir Has a King, Living in Exile!". Kashmir Life. Retrieved 20 December 2016.