Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

గ్లోబల్ వార్మింగు కుట్ర సిద్ధాంతం

వికీపీడియా నుండి
(భూతాపం పెరుగుదల కుట్ర సిద్ధాంతం నుండి దారిమార్పు చెందింది)
శాస్త్రీయ సిద్ధాంతాల తిరస్కరణలో 5 లక్షణాలు

గ్లోబల్ వార్మింగుకు సంబంధించిన శాస్త్ర చర్చ అంతా ఒక కుట్ర అని, ఆ పేరిట ప్రజలకు ఇచ్చే డేటా కల్పితమైనదనీ, దాని వ్యతిరేకుల గొంతు నొక్కేందుకు ఉద్దేశించినదనీ భావించే సిద్ధాంతాలను గ్లోబల్ వార్మింగు కుట్ర సిద్ధాంతాలు అంటారు. గ్లోబల్ వార్మింగు పట్ల విస్తృతంగా ఉన్న ఏకాభిప్రాయాన్ని వ్యతిరేకించే వివాదాలకు మద్దతునిచ్చే యుక్తులలో ఇది ఒకటి.[1] నేరపూరితమైన ప్రవర్తనతో తమ వాదనను నిరూపించుకోవడానికో, ఆర్థిక పరమైన లాభాల కోసమో, లేక ఈ రెండింటి కోసమో గ్లోబల్ వార్మింగు అనే సైన్సును కనిపెట్టారని ఈ కుట్ర సిద్ధాంతకర్తలు ఆరోపిస్తూంటారు.[2]

నేపథ్యం

[మార్చు]

మానవుని కారణంగా భూతాపం పెరుగుతోందనడాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలన్నిటికీ చెందిన శాస్త్ర విజ్ఞాన అకాడమీలు గుర్తించాయి.[3] ఐపీసీసీ వారి నిర్ధారణలను ఏ జాతీయ అంతర్జాతీయ శాస్త్ర విజ్ఞాన సంస్థ కూడా వ్యతిరేకించ లేదు.[4]

శీతోష్ణస్థితి మార్పుపై ఈ రకమైన ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ, గ్లోబల్ వార్మింగుపై పరిశోధనలు చేస్తున్న సంస్థలు, శాస్త్రవేత్తలూ ప్రపంచ వ్యాప్త కుట్రలో భాగంగా పనిచేస్తున్నారనే అభియోగాలు వచ్చాయి.[5] క్లైమాటిక్ రీసెర్చి యూనిట్ ఈమెయిల్ వివాదం (క్లైమేట్ గేట్) వంటి దుశ్చర్య అభియోగాలు తలెత్తాయి. ఈ అభియోగాలను 8 కమిటీలు పరిశీలించి, దర్యాప్తు చేసాయి. ఇవన్నీ కూడా కుట్రలు, దుశ్చర్యలు జరిగాయనేందుకు ఆధారాలేమీ లేవని తేల్చాయి.[6] ముయిర్ రస్సెల్ నివేదికలో, "శాస్త్రవేత్తల నిజాయితీ, ముక్కుసూటితనాలపై ఏ సందేహమూ లేదు.", "ఐపీసీసీ అంచనాలపై సందేహం కలిగే విధంగా వారి ప్రవర్తన లేదు, అందుకు ఆధారాలూ లేవు" అని పేర్కొంది. అయితే, "అవసరమైనంత ఓపెన్‌నెస్‌ను ప్రదర్శించడంలో వారి వైఫల్యం ఎప్పటికప్పుడు కనబడుతూ వచ్చింది" అని అతడి నివేదికలో చెప్పాడు.[7][8] ఈ దర్యాప్తుల తరువాత, మానవుని కారణంగా భూతాపం పెరుగుతోందనే ఏకాభిప్రాయంలో ఏ మార్పూ కలగలేదు.[9]

వాదనలు

[మార్చు]

2003 జూలై 28 న పర్యావరణం, ప్రజాపనులపై అమెరికన్ సెనేట్‌ వేసిన కమిటీలో చేసిన ప్రసంగంలో జేమ్స్ ఇన్‌హోఫ్ అనే సెనేటరు[10] ఒక ప్రశ్న అడిగాడు -"ఈ హిస్టీరియా, ఈ భయం, ఈ అబద్ధపు సైన్సులతో కలగలిపిన మానవకృత గ్లోబల్ వార్మింగు అమెరికన్ ప్రజలపై రుద్దిన అతి పెద్ద అబద్ధపు ప్రచారం గానీ కాదుగదా?" ఇంకా "ఐపీసీసీ పద్ధతుల్లో కొన్ని భాగాలు సోవియట్ల నేరవిచారణ పద్ధతిలో ఉన్నాయి - నిజ నిర్ధారణ ముందే జరిగిపోతుంది, సైద్ధాంతిక నిబద్ధత ముందు సాంకేతిక, శాస్త్రీయ నిబద్ధతలు తలవంచుతాయి." అని కూడా అతడు వ్యాఖ్యానించాడు.[11] క్యోటో ప్రోటోకోల్‌కు మద్దతు తెలిపిన జాక్ షిరాక్ వంటివారు ప్రపంచాధిపత్యానికి గురిపెట్టి అలా చేసారని ఇన్‌హోఫ్ అన్నాడు.[12]

క్లైవ్ హ్యామిల్టన్, లేవోయిజర్ గ్రూపుపై చేసిన విమర్శకు స్పందిస్తూ, కూలర్ హెడ్స్ కోయెలిషన్, "ఐరాస వారి గ్లోబల్ వార్మింగు చర్చలు "వందల మంది శాస్త్రవేత్తలు తమ పరిశోధనలకు అవసరమైన నిధుల కోసం వాస్తవాలను మరుగుపరచి, శీతోష్ణస్థితి మార్పు సిద్ధాంతాన్ని సమర్ధించిన ఒక కుట్ర" గా లెవోయిజర్ గ్రూప్ అభివర్ణిస్తోందని హ్యామిల్టన్ ఆరోపిస్తున్నాడు."  అని అంది.  "మాకది నిజమేనని తోస్తోంది" అని కూడా అంది[13]

ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తరువాత ఇక శత్రువులెవరూ లేని కారణాన, గ్లోబల్ వార్మింగు ఒక రాజకీయ అంశంగా మారిందని 2006 లో విలియం గ్రే అన్నాడు. దాని ఉద్దేశం రాజకీయాలను ప్రభావితం చేసి, ప్రపంచ ప్రభుత్వ భావనను తీసుకువచ్చి, ప్రజలను నియంత్రించడం అని కూడా అతను అన్నాడు.[14] "పారిశ్రామిక వ్యవస్థలకు బద్ధ వ్యతిరేకులైన పర్యావరణవేత్తలు సృష్టించిన వేలకోట్ల డాలర్ల ప్రపంచ వ్యాప్త వ్యాపారమే గ్లోబల్ వార్మింగు" అని మార్టిన్ డర్కిన్ అన్నాడు. అతడు "ది గ్లోబల్ వార్మింగ్ స్విండిల్" అనే టీవీ డాక్యుమెంటరీని నిర్మించాడు. తన సినిమా చరిత్ర గతిని మారుస్తుందని 2007 లో వాషింగ్టన్ టైమ్స్ లో రాస్తూ, అతడు, "ఐదేళ్ళలో, గ్రీన్‌హౌస్ ప్రభావమే గ్లోబల్ వార్మింగుకు ప్రధాన కారణమనే భావన ఒక చెత్తగా తేలుతుంద"ని అన్నాడు."[15]

వెదర్ చానెల్ అనే శీతోష్ణస్థితి సంస్థను స్థాపించిన జాన్ కోల్‌మన్, "చరిత్ర లోనే అతి పెద్ద కుంభకోణం, గ్లోబల్ వార్మింగ్"  అని అన్నాడు..[16] దీనిపై ఐపీసీసీ అతణ్ణి ప్రశ్నించినపుడు, "ధృవాల వద్ద మంచు కరగడం లేదు, పెరుగుతోంది. ధృవ ఎలుగుబంట్ల సంఖ్య పెరుగుతోంది." అని అతడు స్పందించాడు.

2012 లో, "అమెరికను పారిశ్రామిక వ్యవస్థను పోటీలో లేకుండా చేసేందుకు, చైనా సృష్టించిన భావనే గ్లోబల్ వార్మింగు" అని డోనాల్డ్ ట్రంప్ అన్నాడు.[17]

2015 లో "శీతోష్ణస్థితి మార్పు అనే ఎజెండా, బీదలపై చేస్తున్న కుట్ర" అని చెప్పిన వ్యాసాన్ని ది స్పెక్టేటర్ ప్రచురించింది.[18]

విమర్శ

[మార్చు]

"ఐపీసీసీ వారి నివేదిక చిత్తుప్రతి సారాంశాన్ని చూస్తే, అది శాస్త్రవిజ్ఞాన సంస్థలు చేస్తున్న కుట్రపూరిత అబద్ధాల ప్రచారం అని ఎవరూ అనుకోరు." అని స్టీవ్ కానర్ అన్నాడు.[19]

ది గ్రేట్ గ్లోబల్ వార్మింగ్ స్విండిల్ డాక్యుమెంటరీని అనేక మంది నిపుణులు విమర్శించారు. "గత పదేళ్ళుగా నిరాకరణ వాదులు మనకు వినిపిస్తూ ఉన్న కుట్ర సిద్ధాంతమే ఇది" అని జార్జ్ మోనిబియోట్ అన్నాడు.[20] అలాగే,  ది స్పెక్టేటర్‌లో జేమ్స్ డెలింగ్‌పోల్‌ రాసిన వ్యాసపై స్పందిస్తూ   మోనిబియోట్ ఇలా అన్నాడు: "సత్యాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్న కుట్రల్లోని భాగమే ఇది. షెల్ నుండి గ్రీన్‌పీస్ దాకా, ది సన్ నుండి సైన్స్ దాకా సంస్థలన్నీ, మొత్తం శాస్త్ర విజ్ఞాన రంగమంతా ఇందులో భాగమైనట్లుగా తోస్తోంది."[21] ఆస్ట్రేలియా వాతావరణవేత్తలు కొందరు, "ఆ డాక్యుమెంటరీ శీతోష్ణస్థితి మార్పు సిద్ధాంతాన్ని నిర్మాణాత్మకంగా విమర్శింఛే ప్రయత్నమేమీ  చెయ్యలేదు" అని విమర్శించారు. "అలా చెయ్యకపోగా, వాతావరణవేత్తలు అబద్ధాలాడినట్లుగా, దారుణంగా దారి తప్పినట్లుగా నిరూపించే ఇతర ప్రయత్నాలు చేసింది" అని కూడా వారు అన్నారు. "ఈ సినిమాలో శాస్త్రీయత లేదు, సైన్సును తప్పుగా చిత్రించే ప్రయత్నం చేసింది", అని ఆ వాతావరణ వేత్తలు అన్నారు.[22]

ఇంగ్లండు మాజీ పర్యావరణ మంత్రి డేవిడ్ మిలిబాండ్ ఈ సినిమాలోని ముఖ్యాంశాలపై తన విమర్శను తెలియజేసాడు. అతను ఇలా అన్నాడు- "శాస్త్రీయ ఏకాభిప్రాయాన్ని తక్కువ చేసి చూపేందుకు తమ కుట్ర సిద్ధాంతాలతో విమర్శకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటూనే ఉంటారు. శాస్త్రీయ, ప్రజాస్వామిక చర్చలో అది ఒక భాగమే. నాకు మాత్రం శీతోష్ణస్థితి మార్పు సిద్ధాంతం నిజమేనని నాకు అనిపిస్తోంది."

నిరంతరం వార్తల్లో ఉంటూ ఉండే ఒక 6 కుట్ర సిద్ధాంతాల్లోని వాస్తవాలను [23] నేషనల్ జియోగ్రాఫిక్ పరిశీలించింది. "గ్లోబల్ వార్మింగుపై ఉండే నమ్మకాల గురించి వాళ్ళు ఈ విధంగా చెప్పారు. అనేక శాస్త్రీయ పరిశోధనల్లో తేలినట్లుగా భూమి వేడెక్కుతూనే ఉంది. ఈ వేడెక్కే వేగం పెరుగుతూ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతల పెరుగుదల, ఈ పెరుగుదల వేగం, వాతావరణంలో మానవకృత గ్రీన్‌హౌస్ వాయువుల పెరుగుదలకు అనుపాతంలో ఉంది. పైగా, ఈ గ్లోబల్ వార్మింగు ఆర్కిటిక్ సముద్రంలోని మంచు వేగంగా కరిగేందుకు కారణభూతమౌతోంది. చాలా జాతుల మొక్కలు అనుకున్న దాని కంటే ముందే పుష్పిస్తున్నాయి. అనేక వలస పక్షుల, చేపల, క్షీరదాల, కీటకాల ప్రయాణ మార్గాలు మారుతున్నాయి." అని ఆ పత్రిక వ్యాఖ్యానించింది.[24]

నిధులు

[మార్చు]

ఈ కుట్రలు వివాదాలను సృష్టించి, శీతోష్ణస్థితి మార్పుపై శాస్త్రీయ ఏకాభిప్రాయాన్ని, గ్లోబల్ వార్మింగు ప్రభావాలను తక్కువ చేసి చూపించే పయత్నంలో భాగమేనని కొందరు చేసే ఆరోపణలకు ఆధారాలున్నాయి.[25][26] గ్లోబల్ వార్మింగు పట్ల చాలామంది శాస్త్రవేత్తలు ఒక నిష్కర్షకు వచ్చేసాక చాన్నాళ్ళ తర్వాత కూడా కొందరు వక్తులు, కొన్ని సంస్థలూ దానిపై చర్చను కొనసాగించారు. ఈ సందేహాలు, అమెరికా కెనడాల్లో ప్రభుత్వ విధానాలను తయారు చేసేందుకు విధాన నిర్ణేతలను ప్రేరేపించాయి.

వ్యతిరేక వాదులు, స్వేచ్ఛా మార్కెట్ వాదులూ 1980 చివరి నుండి శీతోష్ణస్థితి మార్పుపై సందేహమనే మంచు పొరను సృష్టించారు. వ్యాపార ప్రకటనలు, అభిప్రాయ వ్యాసాలు, లాబీయింగు, మీడియాలో గుర్తింపులు వగైరాల ద్వారా గ్రీన్‌హౌస్ సందేహకులు (నిరాకరణవాదులు అని పిలవడం వీరికి ఇష్టం ఉండదు) ప్రపంచం వేడెక్కడం లేదు, అలా సూచించే డేటా తప్పు అని వాళ్ళు తొలుత వాదించేవారు. ఆ తరువాత, ఆ మార్పు మామూలేనని, మానవ జనితమేమీ కాదనీ అనేవారు. ఇప్పుడు, ఈ మార్పు చాలా స్వల్పమని, హానికరమైనదేమీ కాదనీ వాదిస్తున్నారు. "పొగాకు పరిశ్రమ చేసిన విధంగానే వీళ్ళూ చేస్తూ వచ్చారు. ఇద్దరూ కూడా అనుమాన బీజాలను నాటారు. సైన్సు చెప్పేదాన్ని వివాదంగా మార్చారు. ప్రజల్లోను, కాంగ్రెసులోనూ అది చాల పెద్ద ప్రభావాన్ని చూపాయి." అని మాజీ సెనెటరు టిమ్ వర్త్ అన్నాడు.

— The truth about denial Archived 2012-03-22 at the Wayback Machine, S. Begley, Newsweek[27]

శీతోష్ణస్థితి మార్పు నిరాకరణ కోసం పరిశ్రమ నిధులు అందిస్తోందనడానికి ఆధారాలను గ్రీన్‌పీస్ సంస్థ, ఎక్సాన్ సీక్రెట్స్ అనే తమ ప్రాజెక్టులో చూపించింది.[28][29] శీతోష్ణస్థితి మార్పుపై సందేహాలను రేకిత్తించే రచయితల్లో ప్రతి పదిమందిలో తొమ్మండుగురికి ఎక్సాన్ మోబిల్‌ సంస్థతో సంబంధాలు ఉన్నట్లుగా  2011 లో ది కార్బన్ బ్రీఫ్ అనే సంస్థ చేసిన పరిశోధనలో తేలింది. శీతోష్ణస్థితి మార్పుపై సందేహాలను వ్యాప్తి చేసేందుకు కోచ్ ఇండస్ట్రీస్ అనే సంస్థ గత 50 ఏళ్ళలో 5 కోట్ల డాలర్లను వెచ్చించిందని గ్రీన్‌పీస్ సంస్థ తెలిపింది.[30][31][32] గ్లోబల్ వార్మింగును సందేహించే రెండు డజన్ల పైచిలుకు సంస్థలకు నిధులు ఓవైపున అందిస్తూనే, పరిశుభ్రమైన శక్తి వనరులను కనుగొనే ప్రయత్నాల నుండి దృష్టి మరల్చే సంస్థలకు నిధులు ఆపేస్తామని ఎక్సాన్ మోబిల్ 2008 లో చెప్పింది.[33]  వాస్తవాలను తిరస్కరించి, శీతోష్ణస్థితి శాస్త్రాన్ని తప్పుగా చూపించిన 39 సమూహాలకు ఎక్సాన్ మోబిల్ 29 లక్షల డాలర్ల నిధులను అందించినట్లుగా ఇంగ్లాండు రాయల్ సొసైటీ 2005 లో చేసిన ఒక సర్వేలో తేలింది.

కాల్పనిక జగత్తులో

[మార్చు]

2004 డిసెంబరులో ప్రచురితమైన స్టేట్ ఆఫ్ ఫియర్ నవలలో గ్లోబల్ వార్మింగుపై ప్రజల్లో భయాన్ని రేకెత్తించేందుకు శాస్త్రవేత్తలు, ఇతరులూ చేసిన కుట్రను రచయిత మైకెల్ క్రైటన్ వర్ణించాడు. నవల్లోని కథకు సంబంధంలేనివి, ఇతివృత్తానికి సంబంధం ఉన్న వాస్తవాలను నవల్లోని 20 పేజీల పాదపీఠికలో ఉంచినట్లు రచయిత వివరించాడు.[34] 2005 జనవరి 4 న అమెరికా సెనేట్‌లో చేసిన ప్రసంగంలో ఇన్‌హోఫ్, పొరపాటున క్రైటన్‌ను శాస్త్రవేత్తగా వర్ణించాడు. "తప్పుడు శాస్త్రీయ వాస్తవాలతో ప్రపంచం ప్రమాదం అంచున ఉన్నట్టుగా రాజకీయ నాయకత్వాన్ని భయపెట్టి, నిధులు పొందేందుకు ప్రయత్నం చేసే పర్యావరణ సంస్థల" గురించి ఈ కాల్పనిక పుస్తకంలో వర్ణించాడు. కళ వాస్తవాన్ని అనుకరిస్తుంది అని అనడానికి" ఇదొక ఉదాహరణ. అని అతడు అన్నాడు.[35]

క్రైటన్ కుట్ర సిద్ధాంతం అనే వ్యాసంలో హెరాల్డ్ ఇవాన్స్ ఇలా అన్నాడు: "ఇది, ప్రసిద్ధ చరిత్రకారుడు రిచర్డ్ హాఫ్‌స్టాటర్ శైలిలో చేసిన భయానక రాజకీయ శైలి ప్రయత్నమే". "మీకొక మంచి కుట్ర సిద్ధాంతం కావాలనుకుంటే, గ్రీన్‌పీస్ వాళ్ళు తయారు చేసినది, దీనికంటే మంచిది ఒకటుంది. అది చూడండి" అని కూడా అతడు సూచించాడు. గ్లోబల్ వార్మింగు సిద్ధాంతాన్ని వ్యతిరేకించే సమూహాలకు ఎక్సాన్ మోబిల్ అనే సంస్థ నిధులు అందించిందనే కుట్ర సిద్ధాంతం గురించిన ఉల్లేఖన అది.[36] 

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Pascal Diethelm & Martin McKee (January 2009). "Denialism: what is it and how should scientists respond?" (PDF). European Journal of Public Health. 19 (1): 2–4. doi:10.1093/eurpub/ckn139. PMID 19158101.
  2. Goldenberg, Suzanne (1 March 2010). "US Senate's top climate sceptic accused of waging 'McCarthyite witch-hunt'". The Guardian. Retrieved 7 July 2015.
  3. [Notes-SciAcademy Statement] "Joint Science Academies' Statement" (PDF). 2005. Archived from the original (PDF) on 2013-09-09. Retrieved 2014-04-20. It is likely that most of the warming in recent decades can be attributed to human activities (IPCC 2001). This warming has already led to changes in the Earth's climate.
  4. Julie Brigham-Grette (September 2006). "Petroleum Geologists' Award to Novelist Crichton Is Inappropriate" (PDF). Eos. 87 (36): 364. Bibcode:2006EOSTr..87..364B. doi:10.1029/2006EO360008. Retrieved 2007-01-23. The AAPG stands alone among scientific societies in its denial of human-induced effects on global warming.
  5. Goertzel, Ted (June 2010). "Conspiracy theories in science". EMBO Reports. 11 (7): 493–99. doi:10.1038/embor.2010.84. PMC 2897118. PMID 20539311. Retrieved 30 December 2013.
  6. Six of the major investigations covered by secondary sources include: 1233/uk-climategate-inquiry-largely-clears.html House of Commons Science and Technology Committee (UK); Independent Climate Change Review (UK); International Science Assessment Panel Archived మే 9, 2013 at the Wayback Machine (UK); Pennsylvania State University (US); United States Environmental Protection Agency (US); Department of Commerce (US).
  7. Jonsson, Patrik (7 July 2010). "Climate scientists exonerated in 'climategate' but public trust damaged". Christian Science Monitor. p. 2. Retrieved 17 Aug 2011.
  8. Russell, Sir Muir (July 2010). "The Independent Climate Change E-mails Review" (PDF). p. 11. Archived from the original (PDF) on 6 ఫిబ్రవరి 2020. Retrieved 17 Aug 2011.
  9. Biello, David (Feb., 2010). "Negating 'Climategate'". Scientific American. (302):2. 16. ISSN 0036-8733. "In fact, nothing in the stolen material undermines the scientific consensus that climate change is happening and that humans are to blame"; See also: Lubchenco, Jane (2 December 2009) House Select Committee on Energy Independence and Global Warming (House Select Committee). "The Administration's View on the State of Climate Science". House Hearing, 111 Congress. U.S. Government Printing Office. "...the e-mails really do nothing to undermine the very strong scientific consensus and the independent scientific analyses of thousands of scientists around the world that tell us that the Earth is warming and that the warming is largely a result of human activities." As quoted in the report published by Office of Inspector General.
  10. "James M. Inhofe – U.S. Senator (OK)". Archived from the original on 2007-03-28. Retrieved 2019-01-05.
  11. Senator James Inhofe, Chairman of Committee on Environment and Public Works, U.S. Senate.The Facts and Science of Climate Change
  12. "Senate Environment And Public Works Committee". Archived from the original on 2007-03-28. Retrieved 2019-01-05.
  13. "Antarctic Cooling Down; The Antarctic Ice Sheet is Growing; Hansen Downgrades Warming Threat". Cooler Heads Coalition. Archived from the original on 2007-09-18. Retrieved 2019-01-05.
  14. Achenbach, Joel. "The Tempest". The Washington Post. Retrieved 2010-03-31.
  15. "Global warming labeled a 'scam' - Washington Times". washingtontimes.com. Retrieved 2010-03-15.
  16. Taylor, Jason. "express news". Retrieved 3 January 2015.
  17. Trump, Donald [@realdonaldtrump] (6 Nov 2012). "The concept of global warming was created by and for the Chinese in order to make U.S. manufacturing non-competitive" (Tweet). Archived from the original on 24 January 2017. Retrieved 24 Jan 2017 – via Twitter.
  18. Ridley, Matt. “The Climate Change Agenda Is a Conspiracy against the Poor.” The Spectator, 13 Dec. 2015
  19. "Steve Connor: Global warming is not some conspiratorial hoax - Independent Online Edition > Commentators". The Independent. London. 2007-01-29. Archived from the original on 2007-11-23. Retrieved 2007-11-16.
  20. "Another Species of Denial". Retrieved 2014-01-02.
  21. George Monbiot, Spectator recycles climate rubbish published by sceptic, 2009-07-09
  22. Jones, D; Watkins, A.; Braganza, K.; Coughlan, M (2007). ""The Great Global Warming Swindle": a critique" (PDF). Bulletin of the Australian Meteorological and Oceanographic Society. 20 (3): 63–72. Archived from the original (PDF) on 2 ఫిబ్రవరి 2017. Retrieved 2 January 2014.
  23. "The Great Climate Change Swindle?". Archived from the original on 2007-03-20. Retrieved 2019-01-05.
  24. Than, Ker. "Fact Checking 6 Persistent Science Conspiracy Theories". National Geographic. Retrieved 22 May 2013.
  25. Griffiths, Jenny; Mala Rao; Fiona Adshead (2009). The health practitioner's guide to climate change: diagnosis and cure. Earthscan. p. 228. ISBN 1-84407-729-2.
  26. "The Denial Machine - synopsis". CBC/Radio-Canada. 24 October 2007. Archived from the original on August 14, 2011. Retrieved 3 September 2011.
  27. Begley, Sharon; Eve Conant; Sam Stein; Eleanor Clift; Matthew Philips (13 August 2007). "The Truth About Denial" Archived 2012-03-22 at the Wayback Machine (PDF). Newsweek. p. 20. Retrieved 3 September 2011.
  28. "Exxon Secrets". Retrieved 2008-12-23.
  29. Monbiot, George (2006-09-19). "The denial industry". The Guardian. London. Retrieved 2008-12-23.
  30. "9 out of 10 top climate change deniers linked with Exxon Mobil".
  31. "Analysing the '900 papers supporting climate scepticism': 9 out of top 10 authors linked to ExxonMobil". Archived from the original on 2011-04-16. Retrieved 2019-01-05.
  32. "Exposing the dirty money behind fake climate science".
  33. Adam, David (2008-05-28). "Exxon to cut funding to climate change denial groups". The Guardian. London. Retrieved 2008-12-23.
  34. Mooney, Chris (2005-02-06). "Checking Crichton's Footnotes". Boston Globe.
  35. Inhofe, James M. (4 January 2005), Climate Change Update Senate Floor Statement, U.S. Senator James M. Inhofe, archived from the original on 12 January 2005, retrieved 2011-03-07.
    Mooney, Chris (11 January 2005), Warmed Over, CBS News, archived from the original on 2013-10-20, retrieved 2011-03-07. Reprinted from The American Prospect, 10 January 2005.
  36. Evans, Harold (2005-10-07). "Crichton's conspiracy theory". BBC News. London. Retrieved 2007-11-16.