భూమర దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భూమర ఆలయం
భూమర ఆలయం
భూమర ఆలయం
పేరు
ప్రధాన పేరు :భూమర ఆలయం
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:మధ్య ప్రదేశ్
ప్రదేశం:సత్నా
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:భూమర ఆలయం
నిర్మాణ శైలి, సంస్కృతి
దేవాలయాలు మొత్తం సంఖ్య:ఒకటి

భూమర ఆలయం భారతదేశంలోని మధ్య ప్రదేశ్ లో సత్నా ప్రదేశంలో ఉంది. ఇది 6 వ శతాబ్దపు గుప్త శకం హిందూ రాతి ఆలయం.

చరిత్ర[మార్చు]

పురావస్తు శాస్త్రవేత్త అలెగ్జాండర్ కన్నిగ్హామ్ 1873-1874 మధ్యకాలంలో భూమర ఆలయం సందర్శించాడు. ముఖ్యమైన భూమర శిలాశాసనాన్ని కనుగొన్నాడు.ఉత్తర దిక్కున ఉన్న ఆలయ శిధిలాల గురించి స్థానిక గ్రామస్తుల ఇచ్చిన సమాచారం మేరకు దట్టమైన అటవీ లో భుమారా ఆలయాన్ని కనుగొన్నారు. ఆలయ తలుపు అద్భుతంగా చెక్కబడింది.విగ్రహాలు చాలా మేరకు శిధిలం అయిపోయాయి.భారతదేశం పురావస్తు శాఖ వారు వచ్చి తవ్వకాలు ప్రారంభించి మట్టిదిబ్బను త్రవ్వి అనేక శిల్పాలు కనుగొన్నారు. వాటిలో వృత్తాకార పతకం , వినాయకుడి శిల్పం మండప ,ఆలయ భాగాల అవశేషాలు ఉన్నాయి.క్రీస్తు పూర్వం 484 లో ఒక శాసనం లభ్యమైనది.

భుమరా శిధిలాలు[మార్చు]

భుమరా త్రవ్వకాల్లో అనేక శిల్పాలు, విరిగిన ముక్కలు గోడలు , విగ్రహాలు , మండపం శిధిలమైన భాగాలు లభించాయి. భూమర ఆలయ శిధిలమైన అనేక భాగాలను కోల్కతా మ్యూజియం అలహాబాద్ మ్యూజియం లో పొందుపరిచారు.

మూలాలు[మార్చు]