భౌతిక శాస్త్రంలో నోబుల్ బహుమతులు - 2024
కృత్రిమ మేధ ( ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - ఏఐ ) కు బాటలు పరిచిన దిగజా శాస్త్రవేత్తలు జాన్ జే. హాఫ్ ఫీల్డ్, జెఫ్రీ ఈ. హింటన్ లకు 2024 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది[1]. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 2024 అక్టోబర్ 8వ తేదీన ఈ మేరకు ప్రకటించింది. నోబుల్ పురస్కార విజేతలకు 10 లక్షల డాలర్ల నగదు బహుమతి అందుతుంది. దీన్ని హింటాన్, హాప్ ఫీల్డ్ లకు పంచుతారు. మిషన్ లెర్నింగ్ విత్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ ఆవిష్కరణ కోసం వీరిద్దరూ చేసిన కృషికి ఈ పురస్కారం ప్రకటిస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది. వీరిద్దరూ రూపొందించి అభివృద్ధి చేసిన భౌతిక శాస్త్ర నియమాలు, పనిముట్లు నేటి శక్తివంతమైన మిషన్ లెర్నింగ్క పునాదులన ఎంపిక కమిటీ పేర్కొంది. వీరిద్దరూ స్టాటిస్టికల్ ఫిజిక్స్ కు సంబంధించిన మౌలిక సూత్రాలను ఉపయోగించుకొని కృత్రిమ న్యూరాల్ నెట్వర్క్ ను రూపొందించారు. ఇవి అసోసియేట్ మెమరీగా పనిచేస్తూ భారీ డేటాను విశ్లేషిస్తాయి. వాటిలోని నిర్దిష్ట పోకడలను గుర్తిస్తాయి. తద్వారా సంబంధిత అంశాలపై శిక్షణ పొందుతాయి.
> జెఫ్రీ ఈ. హింటన్ ను ఫాదర్ ఆఫ్ ర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) గా అభివర్ణిస్తారు. కెనడా, బ్రిటన్ పౌరసత్వం ఉన్న ఈయన టొరంటో యూనివర్సిటీలో పనిచేస్తున్నారు.
> హాప్ ఫీల్డ్ అమెరికా జాతీయుడు. ఈయన ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు.
మూలాలు :
- ↑ "The Nobel Prize in Physics 2024". NobelPrize.org (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-12-06.