మంగోల్ సైనిక వ్యూహాలు, నిర్మాణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంగోల్ యోధుడు కదిలే గుర్రంపై నుంచి బాణపు దెబ్బను కొట్టేందుకు తయారవడం.

మంగోల్ సైనిక వ్యూహాలు, సైన్య నిర్మాణం మంగోల్ సామ్రాజ్యం దాదాపు మధ్య, ఉత్తర ఆసియా, మధ్య ప్రాచ్యం, తూర్పు ఐరోపా లోని భాగాలు జయించి, ఆక్రమించేందుకు వీలు కల్పించింది.

ఈ సైనిక విధానానికి అసలైన పునాది మంగోలుల సంచార జీవన శైలిలోనే ఉంది. మిగతా అంశాలను ఛెంఘిజ్ ఖాన్, ఆయన సైన్యాధ్యక్షులు, వారసులు కనుగొన్నారు. కోటలపై దాడిచేసేందుకు పనికివచ్చే సాంకేతిక విజ్ఞానాన్ని ఇతర సంస్కృతుల నుంచి, సైనిక నిర్మాణంలోకి విదేశీ సాంకేతిక నిపుణులను స్వీకరించడం ద్వారా స్వీకరించారు. 13వ శతాబ్దిలోని అత్యధిక భాగం మంగోలులు ఈ పద్ధతిని ఉపయోగించి కేవలం అతికొద్ది యుద్ధాలు మాత్రమే కోల్పోయారు, ప్రతిసారీ ఫలితాన్ని తమకు అనుకూలంగా తిప్పుకోవడానికి తిరిగివచ్చారు. అనేక సందర్భాల్లో చెప్పుకోదగ్గ పెద్ద సంఖ్యలో ఉన్న ఎదిరి సైన్యాలపై గెలుపొందారు. వారి తొలి పరాజయం సమర బెండ్ యుద్ధంలో వోల్గా బుల్జర్ల చేతిలో 1223లో పొందారు, రెండవ ఓటమి 1260లో ఐన్ జలుత్  యుద్ధంలో మంగోల్ వ్యూహాలనే వారికే వ్యతిరేకంగా ఉపయోగించేందుకు  శిక్షణ పొందిన సైన్యం చేతిలో పొందారు.[1][2][3] ఐతే మరో 40 ఏళ్ల తర్వాత 1299లో తిరిగివచ్చి ఈజిప్షియన్ మామ్లూక్‌లను వాడీ అల్-ఖ్వాజందర్ యుద్ధంలో ఓడించి సిరియా, పాలస్తీనా, గాజాలను తమ రాజ్యంలో కలుపుకున్నారు. మంగోలులు వియత్నాం, జపాన్ ల దండయాత్రల్లో పరాజయం చవిచూశారు. సామ్రాజ్యం అదే కాలంలో విభజనకు గురైనా, అన్ని భాగాలను కలిపి దాని విస్తీర్ణం, ఉమ్మడి ప్రభావం మరో వందేళ్ళ వరకూ నిలిచివుంది.

నిర్మాణం[మార్చు]

మంగోల్ పౌర, సాంఘిక నిర్మాణాన్ని అనుసరించి వచ్చిన అసాధారణ విధేయత, బలమైన క్రమశిక్షణ వారి సైన్యానికి వెన్నెముకగా నిలిచింది. ఇటాలియన్ అన్వేషకుడు గియోవాన్ని డ పియాన్ డెల్ కేప్రిన్ ప్రకారం "తార్తార్లనే మంగోలులు ప్రపంచంలోకెల్లా వారి నాయకుల విషయంలో ప్రపంచంలోకెల్లా అత్యంత విధేయులైన ప్రజలు, మన మతాధికారులు వారి ఉన్నతాధికారుల పట్ల చూపే విధేయతను కూడా ఇది మించిపోతుంది. వారి పట్ల చాలా భక్తి కలిగివుంటారు, ఎప్పుడూ  వారికి అబద్ధం చెప్పరు".[4] సైనికాధికారులను ఖాన్ కుటుంబంతో రక్త సంబంధం ఆధారంగా కానీ, సైనిక సంబంధ ప్రతిభా సంపత్తి ఆధారంగా కానీ ఎన్నుకుంటారు. ప్రతి అధికారి బాధ్యతలు, వారి సంబంధిత పదవిని అందుకుంటారు:[4]

సైనిక హోదా
సైనికుల సంఖ్య
అర్బాన్ పదులు
జూన్ వందలు
వేలు
తూమెన్
పదుల వేలు

మిన్ఘాన్ యూనిట్ల మధ్య బదిలీలు నిషేధించారు. ప్రతి స్థాయిలోని నాయకులకు ఆదేశాలను తమకు ఉత్తమం అనిపించిన మార్గంలో అమలుచేయడానికి తగిన అనుమతి ఉండేది. ఈ అధికార నిర్మాణం అత్యంత అనువైనదిగా ఉండి, మంగోల్ సైన్యం మూకుమ్మడిగా కానీ, కొంతవరకూ చిన్న గుంపులుగా విడిపోయి శత్రువులను చుట్టుముట్టి మెరుపుదాడి చేసేందుకు కానీ, 10మంది సైనికులున్న చిన్న చిన్న గుంపులుగా విడిపోయి అప్పటికే ముక్కచెక్కలైపోయి పారిపోతున్న శత్రవులను వెంటాడి శత్రుశేషం లేకుండా తుదముట్టించేందుకు కానీ ఉపయోగకరంగా ఉంటుంది. ఒక్కో సైనికుడు తన పరికరాలు, ఆయుధాలు, ఐదు వరకూ ఎక్కేందుకు వాడే నిచ్చెనలకు బృందంగా పోరాడుతున్నా వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తారు. వారి కుటుంబాలు, పశువుల గుంపులు విదేశీ దండయాత్రల్లో  తోడువస్తారు.

అన్ని దళాలను మించి ఖేషిగ్ అనే ఉన్నత స్థాయి దళాలు ఉండేవి. మంగోల్ సామ్రాజ్యానికి అత్యున్నతాధికారం కలిగిన రక్షణ దళాలుగానూ, సామర్థ్యం కలిగిన యువ అధికారులకు శిక్షణ కోసమూ ఉపయోగపడేవి. అతిగొప్ప నాయకుడు సుబుటాయ్ ఇక్కడే తన కెరీర్ ప్రారంభించారు

చలనం[మార్చు]

డీల్ అనే వస్త్రాన్ని ధరించి, బాణాలు, విల్లుతో ఉన్న మంగోల్ సైనికుని చిత్రం. కుడి చేయి దాదాపు నగ్నంగా ఉండడానికి వేడి వాతావరణం కారణం.

ఒక్కో మంగోల్ సైనికుడు సాధారణంగా 3 నుంచి 4 గుర్రాలను కలిగివుండి, యుద్ధరంగానికి తీసుకుపోయేవారు.[5] ఆ మూడు నాలుగు గుర్రాలను మార్చి మార్చి స్వారీ చేయడం వల్ల అవి అట్టే అలసిపోయి, దెబ్బతినకుండా అత్యంత వేగంగా రోజుల తరబడి ఆగకుండా ప్రయాణించగలిగే వీలు చిక్కేది. తమ ప్రాంతానికి ఆవల జీవించగలిగే సామర్థ్యం, తమ ఆడగుర్రపు పాలు తాగుతూ అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో జీవించగలిగే శక్తి వారి సైన్యాలకు వ్యావసాయిక సంస్కృతి వారి సైన్యాలతో పోలిస్తే సంప్రదాయిక రవాణా ఉపకరణాల అవసరం తక్కువ పడేలా చేశాయి. 1241 ప్రారంభంలో హంగేరీపై చేసిన దండయాత్రలా కొన్నిసార్లు వాళ్ళు రోజుకు 160 కిలోమీటర్ల దాటారు, ఇది ఆనాటికి మిగతా సైన్యాలు కనీవినీ ఉండని వేగం.

విజయవంతమైన అన్వేషణ లక్ష్యాలపైనా, దారుల గురించి నిఘా సమాచారం సేకరించడం, తమ యుద్ధ వ్యూహాలకు తగిన ప్రాంతం గురించి వెతుకులాడడంలోనూ విడి సైనికుల వేగవంతమైన చలనం ఉపయోగపడింది. అలానే దండయాత్రలో సైన్య చలనానికి ఈ అన్వేషణలు ఉపకరించాయి.

కేవన్ రూస్ (ప్రస్తుత రష్యాలోని భాగం) పై దండయాత్ర సమయంలో మంగోలులు గడ్డకట్టిన నదులను రహదారులుగా ఉపయోగించుకోగా ఆ చలినేలల్లో చలికాలం ఏ ప్రధాన కార్యకలాపం చేపట్టడానికి చొరవ చూపనిది కాగా అది మంగోలులకు దాడి చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపే సమయం.

భయంకరమైన బాణాల, మిస్సైళ్ళ వర్షాన్ని తప్పించుకునేందుకు శత్రువులు తరచుగా పలచగా విస్తారంగా విడిపోవడమో, దాగివుండడమో, తమ నిర్మాణాన్ని విడదీయడమో చేయగా ఈటెలు ధరించిన ఆశ్వికుల దాడులకు మరింత అవకాశం ఇచ్చినవారయ్యేవారు. అలానే ఒకేచోట గుముగూడి దట్టంగా ఉండేలాంటి వ్యూహంలో ఉంటే బాణాల దాడులకు అనువుగా ఉండేవారు.

ఒకసారి శత్రువు తగినంత బలహీనపడగానే నోయాన్లు ఆదేశాలు ఇచ్చేవారు. ఢంకాలు మోగేవి, సంకేత ధ్వజాలు రెపరెపలాడేవి. ఈటెలు ధరించిన ఆశ్విక దళం బయలుదేరి శత్రువును తుదముట్టించేది. చాలా సందర్భాల్లో శత్రువులను తీవ్రంగా దెబ్బతీసి, దళాన్ని చాలా పల్చబడేలా చేసేందుకు బాణాల వర్షం సరిపోయేది, ఇక ఈటెలు ధరించిన ఆశ్వికులకు మిగిలిన వారిని పట్టుకుని, శత్రు శేషం లేకుండా అంతం చేసే పనే మిగిలేది.

పెద్ద సంఖ్యలో ఆశ్వికులను నిర్మాణంలో ఏర్పరచడంపై ఎక్కువ దృష్టి కలిగిన యూరోపియన్ సైన్యాలను ఎదుర్కొనేప్పుడు మంగోలులు వారిని ముఖాముఖీ పోరులో ఎదుర్కోవడాన్ని పరిహరించి, దూరంగా ఉంటూ బాణాలతో నాశనం చేయడానికి ప్రాధాన్యతి ఇచ్చేవారు. ఒకవేళ ఆయా దళాల సైనికులకు భారీ కవచాలు ఉండి బాణాలు చొచ్చుకుపోతూన్నట్టైతే, ఆశ్విక యోధుల గుర్రాలను చంపేసి భారీ కవచాల బరువు మోస్తున్న మనిషిని వట్టి కాళ్ళమీద, పెద్దగా కదిలే వీలు లేకుండా చేసి ఆశ్వికుల బలంపై దెబ్బకొట్టేవారు.

మోచి యుద్ధంలో మంగోలులు తమ దళాల మధ్య ఖాళీని కావాలనే పెట్టి, హంగేరియన్లకు అందులోంచి వెళ్ళాలనిపించేలా చేశారు. దీనివల్ల హంగేరియన్లు దాంట్లో ఇరుక్కోవడం, ఆశ్వికులైన విలుకాళ్ళు అటు దౌడెత్తించి, శత్రువులను బాణాల దెబ్బలతో చంపడం  వంటివి సాధ్యపడ్డాయి. వారు పారిపోబోగా ఈటెల దళం నాశనం చేసింది. లెగ్నికాలో కొందరు ట్యూటోనిక్, టెంప్లర్, హాస్పిటలర్ వీరులు గుర్రాలను కోల్పోవడంతో దెబ్బతిన్నారు. గుర్రాలు లేక చలన శక్తి దెబ్బతినడంతో, మంగోల్ విలుకాళ్ళు వారి పూర్తి పరాజయానికి బాటలు పడ్డాయి.

శిక్షణ, క్రమశిక్షణ[మార్చు]

మంగోల్ సైన్యాలు గుర్రపు స్వారీ, విలువిద్య, వ్యూహాలు, స్థాన చలనం, తిరిగిపోవడం వంటివి అభ్యసించారు. ఈ శిక్షణ గట్టిదే అయినా అతి కఠోరమో, అన్యాయమో, దారుణమో కాని చక్కని క్రమశిక్షణతో నిర్వహించేవారు.

అధికారులు, దళ సభ్యులకు తమ ఆదేశాలు నిర్వర్తించేందుకు ఉన్నతాధికారుల నుంచి తగినంత విస్తారమైన స్వేచ్ఛ లభిస్తుంది, ప్రణాళికలోని విస్తృతమైన లక్ష్యాల సాధన జరుగుతూ, ఆదేశాలను పాటిస్తున్నంతవరకూ ఈ స్వేచ్ఛ లభిస్తుంది. అతి కాఠిన్యం, అవసరం లేనంత తీవ్ర క్రమశిక్షణ, అతికింది స్థాయి నిర్వహణలో చేయిపెట్టాల్సిరావడం వంటి సమస్యలను అలా మంగోలులు తప్పించారు, ఈ సమస్యలు మొత్తం సైనిక చరిత్రలోకెల్లా అత్యంత ప్రమాదకరమైనవిగా పేరుపడ్డాయి. మొత్తానికి అందరు సభ్యులు ఒకరికొకరు పూర్తి నమ్మకస్తులుగానూ, ఉన్నతాధికారులకు మరీ ముఖ్యంగా ఖాన్ కు విధేయంగానూ ఉండేవారు. ఒక సైనికుడు యుద్ధంలోంచి పారిపోతే, అతనూ అతని అర్బాన్ కు చెందిన మిగతా తొమ్మిది మంది సైనికులు కూడా కలిసే మరణ శిక్షను అనుభవించాల్సివుండేది.

ఆశ్విక దళం[మార్చు]

మంగోల్ విల్లు వాడుతున్న మంగోలియన్ ఆశ్విక విలుకాళ్ళ దళం, రషీద్-అల్-దిన్ హమాదనీ యొక్క యూనివర్సల్ హిస్టరీ నుంచి.

మంగోల్ దళంలో ప్రతి పదిమందిలో ఆరుగురు సాధారణ దుస్తులు ధరించిన ఆశ్విక విలుకాళ్ళు, మిగిలిన నలుగురు భారీ కవచధారులైన ఈటెలతో సాయుధులైన సైనికులు. మంగోల్ ఆశ్వికులు మిగిలిన సమకాలీన సైన్యాలతో పోలిస్తే అత్యంత తక్కువ బరువు మోస్తూ అతివేగంగా సాగగలిగిన దళం. దాని కారణంగా వీరి వ్యూహాలు, అవలంబించే విధానాలు భారీ శత్రువుకు (ఉదాహరణకు యూరోపియన్ నైట్స్ కి) అసాధ్యం. దాదాపు మిగిలిన దళాలన్నీ బరువైన ఈటెల్లాంటి ఆయుధాలు ధరించిన భారీ ఆశ్విక దళాలతో కూడివున్నవి, ఇవి విలుకాళ్ళు శత్రువును ముఖాముఖీ యుద్ధానికి తీసుకువచ్చేలా చేశాకా దాడిచేసేందుకు పనికివస్తాయి. సైనికులు చురకత్తులు లేదా గండ్రగొడ్డళ్ళు కూడా తీసుకువచ్చేవారు.

మంగోలులు వారి గుర్రాలను తమను తాము కాపాడుకున్నట్టుగానే రక్షించుకునేవారు, వాటి శరీరాలకు కవచాలు తొడిగేవారు. గుర్రపు కవచం ఐదు భాగాల కింద విభజితమై గుర్రం శరీరంలోని ప్రతి భాగాన్ని రక్షించేందుకు ఉపయోగపడేది. దాని నుదురు కాపాడేందుకు ఉపయోగించే కవచాన్ని గొంతుకు ఇరువైపులా కట్టేలా విడిపోయే ప్లేట్ తో తయారుచేసేవారు.[6]

మంగోలియన్ గుర్రాలు మిగిలినవాటితో పోలిస్తే చిన్నవే అయినా అత్యంత గడ్డు స్థితిగతులు తట్టుకోగలిగేవి, స్వయం సమృద్ధితో ఉండేవి, దూరాభారాలు పరుగెత్తగలిగే సామర్థ్యం కలిగినవి. ఇతర జాతుల గుర్రాలు చలికి చనిపోయే వాతావరణ పరిస్థితులను కూడా ఈ గుర్రాలు తట్టుకుని నిలవగలిగేవి, దాంతో మంగోలులు రష్యా మీద ప్రమాదకరమైన చలికాలపు వాతావరణంలో విజయవంతమైన దాడులు చేయగలిగారు. మంగోల్ గుర్రాలు సాధారణంగా నిత్యం ఆహార సరఫరా ఆశించవు. తమకు తామే మేతకు అవసరమైన గడ్డిని, చిరుకొమ్మల్ని దొరకబుచ్చుకుని మేసి, ఆ గ్రాసం ఆధారంగా జీవించగల సామర్థ్యం ఛెంఘిజ్ ఖాన్ సైన్యానికి సరఫరా మార్గాల అవసరం నుంచి స్వేచ్ఛను ఇచ్చింది. మంగోల్ గుర్రానికి అద్భుతమైన సామర్థ్యం ఉంది. 30 కిలోమీటర్ల సంప్రదాయ గుర్రపు పందాల్లో మంగోల్ గుర్రాల కన్నా అరేబియన్ వంటి ఇతర జాతుల గుర్రాలే వేగవంతమైనదని తేలింది, కానీ ఏకబిగిన సుదూర ప్రాంతాలకు పరుగు పెట్టడంలో మంగోలియన్ గుర్రాలే మెరుగైనవి. అలుపు లేని మంగోల్ గుర్రం స్వభావం వల్ల యుద్ధంలో ఎక్కువ కాలం తాజాగా ఉండి, మంగోల్ సైన్యాలకు ఓపికపట్టగలగడంలో ఆనుకూల్యతను లభించింది.

ఒక్కో యోధుడు తన గుర్రపు మందను పాలు, మాంసం వంటి ఆహారం కోసం, వింటినారి, చడావులు (చెప్పుల్లాంటివి), కవచం దాచుకునేందుకు, ఎండబెట్టిన దాని పేడను నిప్పు కోసం ఇంధనంగానూ, దాని వెంట్రుకలు తాళ్ళు అల్లుకుందుకు, సంగీత పరికరాల్లో తీగలుగా వాడేందుకు, హెల్మెట్ అలంకరించుకునేందుకు ఉపయోగించుకునేవారు; గుర్రపు పాలు తప్పనిసరిగా విజయం లభించాలని చేసే మంత్రయుతమైన మత కార్యకలాపాలు, వేడుకలకు కూడా ఉపయోగపడేది; వేటల్లోనూ, వినోదాల్లోనూ కూడా గుర్రాలు ఉపయోగపడేవి, ఈ వినోదాలే సైనిక శిక్షణగా కూడా ఉపకరించేది. ఒకవేళ యోధుడు యుద్ధంలో మరణిస్తే, ఒక గుర్రాన్ని అతని తర్వాతి జన్మలో మరింత ఘనత పొందేందుకని బలి ఇచ్చేవారు.

వేగం లోపించడమే మంగోల్ జాతి గుర్రాల ప్రధానమైన లోటు. ఇతర ప్రాంతాలకు చెందిన పెద్ద గుర్రాలతో తక్కువ దూరాలకు పోటీ పెడితే ఓడిపోతాయి. కానీ మిగతా సైన్యాలు చాలా బరువైన పెద్ద కవచాలు మోస్తూండడం వల్ల మంగోల్ దళాలు యుద్ధంలో వారిని, వారి గుర్రాల వేగం ఎలావున్నా దాటిపోగలవు. దానికి తోడు మంగోలియన్ గుర్రాలు అత్యంత దూరాలను వేగంగా దాటేలా అలుపుకు తట్టుకుని సాగుతూంటాయి, చాలాసార్లు వారాలు, రోజుల తర్వాత వచ్చిపడతాయని భావిస్తూండగానే వచ్చి శత్రువులను ఆశ్చర్యపరిచారు.

అన్ని గుర్రాలకు పాదాలు పెట్టుకునే స్టిర్రప్ లు జోడించారు. ఈ సాంకేతిక సౌలభ్యం మంగోల్ విలుకాళ్ళకు తన శరీర పైభాగాన్ని తిప్పుతూ వెనకవైపున్న శత్రువు సహా ఏ దిశగానైనా బాణ ప్రయోగం చేసి కొట్టగల అవకాశం ఇచ్చింది. మంగోల్ యోధులు ఎగిరే గుర్రం నాలుగు కాళ్ళూ గాల్లోకి ఎత్తే లోపే బాణాన్ని కొట్టేవారు, తద్వారా స్థిరమైన, గురి కలిగిన బాణం వేసే వీలు ఉండేది.

ప్రతి సైనికుడూ యుద్ధానికి నాలుగు గుర్రాలతో వెళ్ళేవాడు, దాంతో ఒక గుర్రం అలసిపోతే మరొకటి వాడేవారు. దీనివల్ల మంగోల్ సైన్యం ప్రపంచంలోకెల్లా అత్యంత వేగవంతమైన సైన్యంగా నిలిచింది. అదలా ఉంచితే ఇలా ఎక్కువ గుర్రాలతో రావడం వారికి కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టింది. మంగోల్ సైన్యం పశుగ్రాసం లోటు అనుభవించారు. గడ్డి తక్కువగా ఉండే మధ్య ఆసియా భూముల్లోనూ, అటవీ ప్రాంతాలైన దక్షిణ చైనా ప్రాంతాల్లోనూ దండయాత్ర చేయడం కష్టంగా ఉండేది వారికి. స్టెప్పీలు అనబడే గడ్డి మైదానాల దారిలో దండయాత్రకు వెళ్ళినా భారీ సంఖ్యలో గుర్రాలకు తగ్గ దాణా దారిలో లభిస్తూందో లేదో చూసుకుంటూ సాగాల్సి వచ్చేది.

ఆహారం, అనుసంధానం[మార్చు]

చిరుతతో మంగోలు సైనికుడు

సరఫరాలు[మార్చు]

మంగోల్ సైన్యాలు చాలా తక్కువ బరువులు మోస్తూ, విదేశీ భూముల్లో జీవించగలిగేలా ఉండేవి. వారు తీసుకువెళ్ళే ఉపకరణాలు ప్రధానంగా నిర్ణీతమైన సరఫరా మార్గాల అవసరం లేకుండా, ప్రతీ సైనికుడు అలాంటి అవసరాల నుంచి స్వతంత్రంగా ఉండగలిగేలా ఉండేవి.  ప్రయాణిస్తున్నప్పుడు వారు సాధారణంగా తినే ఆహారం బోర్టులనే ఎండబెట్టిన మాంసం, ఇది ఈనాటికీ మంగోలియన్ ఆహారంలో సాధారణంగా కనిపిస్తుంది. బోర్ట్ లు బరువు లేనివి, తేలికగా తీసుకుని వెళ్ళదగ్గవి, నీటితో ఉడకబెట్టి వండుకోవచ్చు, ఇది ఆధునిక కాలంలోని ఇన్స్టెంట్ సూప్ లాంటి పదార్థం.

గుర్రం తాజాగా, వేగంగా ఉండేలా చూసుకునేందుకు దళసభ్యులందరి వద్ద చెరొక 4, 5 గుర్రాలు ఉండేవి.[5] మిగిలిన ప్రాంతాల్లో ఆవు, గేదె ఎలా సామాన్య పెంపుడు జంతువో మంగోలియాలో గుర్రం అలా సాధారణంగా పెంచే జంతువు. వీరు గుర్రాన్ని పాల కోసం వాడుతారు, అలాగే చంపి మాంసం కూడా తింటారు. చాలావరకూ మంగోల్ గుర్రాలు ఆడ గుర్రాలు కావడంతో వారు శత్రువుల భూభాగాల్లో ప్రయాణిస్తున్నప్పుడు వారి గుర్రాల పాలు, పాల ఉత్పత్తులపై ఆధారపడి జీవించగలిగేవారు. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మంగోల్ యోధులు వారి గుర్రాల శరీరంపైన రక్తనాళాల్లోంచి జాగ్రత్తగా రక్తాన్ని కూడా తాగేవారు. గుర్రపు రక్తంతో కలిసిన గుర్రపు పాలు మాత్రమే తాగుతూ నెల పాటు బతకగలిగేవారు.

భారీ పరికరాలను చక్కగా నిర్వహించే సరఫరా బళ్ళలో తీసుకుని వచ్చేవారు. వీటిలో పెద్ద సంఖ్యలో బాణాలు కూడా ఉండేవి. మంగోలలు ముందుకు సాగడంలో పరిమితిగా నిలిచిన కారణాల్లో సరఫరాల పరంగా వారి గుర్రాలకు ఆహారం, నీటి లభ్యత ప్రధానమైంది. సిరియా, లెవెంట్ వంటి ఎడారి సదృశ ప్రాంతాల్లో మామ్లూక్ లతో వారి ఘర్షణల్లో ఇది ప్రధానమైన సమస్యగా నిలిచింది. మరీ ముఖ్యంగా మామ్లూక్ లు నేలను ఎండగొట్టే విధానం పెట్టుకుని ఈ ప్రాంతమంతటి మేత భూములు ఒక యుద్ధ తంత్రంగా తగులబెట్టేయడంతో ఇది చాలా ఇబ్బంది అయిపోయింది. అలాగే మరోవంక మోహి యుద్ధంలో వారు సాధించిన విజయాన్ని కూడా పూర్తిగా వినియోగించుకోకుండా ఈ పరిమితి అడ్డుపడింది, సుబుటాయ్ సైన్యం వెంట వచ్చిన గుర్రాల మందను గ్రేట్ హంగేరియన్ పీఠభూమి కూడా సరిపడేంతది కాకపోవడంతో ఆ విజయాన్ని వినియోగించుకోలేకపోయారు.

సమాచార ప్రసరణ[మార్చు]

మంగోలులు రిలే టపా గుర్రాల కేంద్రాల వ్యవస్థ నిర్వహించారు, ఇది ప్రాచీన పర్షియాలో వినియోగించిన ఉత్తరాల వ్యవస్థను పోలి ఉండేది. తద్వారా వ్రాసిన సందేశాలు అత్యంత వేగంగా ప్రసారమయ్యేవి. రోమన్ సామ్రాజ్యం తర్వాత సామ్రాజ్య వ్యాప్తంగా ఇలాంటి ఉత్తరాల వ్యవస్థ కలిగివున్న మొదటి వారు మంగోలులే. దీనికి తోడు మంగోల్ యుద్ధ సమాచార వ్యవస్థలో సంకేతం ఇచ్చే జెండాలు, కొమ్ము బూరాలు, కొంతమేరకు సంకేతాలుగా వివిధ రకాల బాణాలు వాడేవారు. వీటి ద్వారా యుద్ధంలో ఆదేశాలు పంపించుకునేవారు.

నిర్మాణం[మార్చు]

మంగోల్ పౌర, సాంఘిక నిర్మాణాన్ని అనుసరించి వచ్చిన అసాధారణ విధేయత, బలమైన క్రమశిక్షణ వారి సైన్యానికి వెన్నెముకగా నిలిచింది. ఇటాలియన్ అన్వేషకుడు గియోవాన్ని డ పియాన్ డెల్ కేప్రిన్ ప్రకారం "తార్తార్లనే మంగోలులు ప్రపంచంలోకెల్లా వారి నాయకుల విషయంలో ప్రపంచంలోకెల్లా అత్యంత విధేయులైన ప్రజలు, మన మతాధికారులు వారి ఉన్నతాధికారుల పట్ల చూపే విధేయతను కూడా ఇది మించిపోతుంది. వారి పట్ల చాలా భక్తి కలిగివుంటారు, ఎప్పుడూ  వారికి అబద్ధం చెప్పరు".[4] సైనికాధికారులను ఖాన్ కుటుంబంతో రక్త సంబంధం ఆధారంగా కానీ, సైనిక సంబంధ ప్రతిభా సంపత్తి ఆధారంగా కానీ ఎన్నుకుంటారు. ప్రతి అధికారి బాధ్యతలు, వారి సంబంధిత పదవిని అందుకుంటారు:[4]

చలనం[మార్చు]

ఒకసారి శత్రువు తగినంత బలహీనపడగానే నోయాన్లు ఆదేశాలు ఇచ్చేవారు. ఢంకాలు మోగేవి, సంకేత ధ్వజాలు రెపరెపలాడేవి. ఈటెలు ధరించిన ఆశ్విక దళం బయలుదేరి శత్రువును తుదముట్టించేది. చాలా సందర్భాల్లో శత్రువులను తీవ్రంగా దెబ్బతీసి, దళాన్ని చాలా పల్చబడేలా చేసేందుకు బాణాల వర్షం సరిపోయేది, ఇక ఈటెలు ధరించిన ఆశ్వికులకు మిగిలిన వారిని పట్టుకుని, శత్రు శేషం లేకుండా అంతం చేసే పనే మిగిలేది.

శిక్షణ, క్రమశిక్షణ[మార్చు]

మంగోల్ సైన్యాలు గుర్రపు స్వారీ, విలువిద్య, వ్యూహాలు, స్థాన చలనం, తిరిగిపోవడం వంటివి అభ్యసించారు. ఈ శిక్షణ గట్టిదే అయినా అతి కఠోరమో, అన్యాయమో, దారుణమో కాని చక్కని క్రమశిక్షణతో నిర్వహించేవారు.

ఆశ్విక దళం[మార్చు]

ఒక్కో యోధుడు తన గుర్రపు మందను పాలు, మాంసం వంటి ఆహారం కోసం, వింటినారి, చడావులు (చెప్పుల్లాంటివి), కవచం దాచుకునేందుకు, ఎండబెట్టిన దాని పేడను నిప్పు కోసం ఇంధనంగానూ, దాని వెంట్రుకలు తాళ్ళు అల్లుకుందుకు, సంగీత పరికరాల్లో తీగలుగా వాడేందుకు, హెల్మెట్ అలంకరించుకునేందుకు ఉపయోగించుకునేవారు; గుర్రపు పాలు తప్పనిసరిగా విజయం లభించాలని చేసే మంత్రయుతమైన మత కార్యకలాపాలు, వేడుకలకు కూడా ఉపయోగపడేది; వేటల్లోనూ, వినోదాల్లోనూ కూడా గుర్రాలు ఉపయోగపడేవి, ఈ వినోదాలే సైనిక శిక్షణగా కూడా ఉపకరించేది. ఒకవేళ యోధుడు యుద్ధంలో మరణిస్తే, ఒక గుర్రాన్ని అతని తర్వాతి జన్మలో మరింత ఘనత పొందేందుకని బలి ఇచ్చేవారు.

వేగం లోపించడమే మంగోల్ జాతి గుర్రాల ప్రధానమైన లోటు. ఇతర ప్రాంతాలకు చెందిన పెద్ద గుర్రాలతో తక్కువ దూరాలకు పోటీ పెడితే ఓడిపోతాయి. కానీ మిగతా సైన్యాలు చాలా బరువైన పెద్ద కవచాలు మోస్తూండడం వల్ల మంగోల్ దళాలు యుద్ధంలో వారిని, వారి గుర్రాల వేగం ఎలావున్నా దాటిపోగలవు. దానికి తోడు మంగోలియన్ గుర్రాలు అత్యంత దూరాలను వేగంగా దాటేలా అలుపుకు తట్టుకుని సాగుతూంటాయి, చాలాసార్లు వారాలు, రోజుల తర్వాత వచ్చిపడతాయని భావిస్తూండగానే వచ్చి శత్రువులను ఆశ్చర్యపరిచారు.

References[మార్చు]

  1. Oliver,Roland Anthony/Atmore, Anthony.
  2. Amitai-Preiss, Reuven.
  3. Amitai-Preiss, Reuven.
  4. 4.0 4.1 4.2 4.3 Turnbull, Stephen R. Essential Histories: Genghis Khan & the Mongol Conquests 1190–1400[permanent dead link] Hardback ed New York: Routledge, 2004 p.17 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "0-lib.myilibrary.com.mercury.concordia.ca" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  5. 5.0 5.1 Morris, Rossabi (October 1994).
  6. George Lane.