మంజీర వన్యప్రాణుల అభయారణ్యం
మంజీర వన్యప్రాణుల అభయారణ్యం | |
---|---|
IUCN category IV (habitat/species management area) | |
Location | తెలంగాణ, భారత దేశము |
Area | 20 కి.మీ2 (4,900 ఎకరం) |
Established | June,1978 |
మంజీర వన్యప్రాణుల అభయారణ్యం తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా యందలి వన్యప్రాణుల అభయారణ్యం.[2] వాస్తవంగా మొదట ఇది మొసళ్ళ సాంచురీ. ప్రస్తుతం సుమారు 70 కంటే ఎక్కువ జాతుల పక్షులు ఇచట సంరక్షింపబడుతున్నాయి. ఇది అంతరించిపోతున్న జాతులు అయిన "మగ్గర్ మొసళ్ళు"కు సంరక్షణా కేంద్రంగా ఉంది. ఈ అభయారణ్యమ్లో రిజర్వాయర్ హైదరాబాదు, సికింద్రాబాదు జంటనగరాలకు త్రాగునీటిని అందుస్తున్నది.[1][2]
భౌగోళిక స్థితి
[మార్చు]మంజీరా వన్యప్రాణుల అభయారణ్యం తెలంగాణ రాష్ట్రం లోని మెదక్ జిల్లాలో ఉంది. ఇది హైదరాబాదు నగరానికి వాయువ్య దిశలో 50 కి.మీ దూరమ్లో ఉంది. ఈ అభయరణ్యంలో మంజీర నది 36 కి.మీ ఆవరించి ఉంటుంది.[2] ఇచ్చట గల కృత్రిమ రిజర్వాయరు హైదరాబాదు, సికింద్రాబాదు నగరాలకు త్రాగు నీటి వసతిని కల్పిస్తున్నది. ఈ రిజర్వాయర్ తొమ్మిది ద్వీపాలను కలిగి ఉంటుంది. వాటిలో కొన్ని పుట్టిగడ్డ, బాపనగడ్డ, సంగమడ్డ, కర్ణంగడ్డ. ఈ ద్వీపములు చిత్తడి నేల సరిహద్దులతో నీటి పక్షులకు గూళ్ళు కట్టుకొనే విధంగా ఉపయోగపడుతాయి. అదనంగా పక్షులకు గూళ్ళు కట్టుకొనుటకు దట్టంగా వ్యాపించిన చెట్లు కూద ఉంటాయి.[1] సవన్నా రకకు శాకాహారం ఈ అభయారణ్యంలో ఉంటుంది. ఈ రిజర్వాయరు మునిగి ఉన్న మొక్కలు, ఆవశ్యక మొక్కలకు తోడ్పడుతుంది. "టైఫా", "ఇపోమియా", "అకాసియా" రకాలైన కొన్ని మొక్కలు నీటిమట్టానికి అంచున మూసివేయబడినట్లు ఉంటాయి. రిజర్వాయరు, నదికి చుట్టూ వ్యవసాయ భూములుంటాయి.[1]
ఈ ప్రాంత సరాసరి ఉష్ణోగ్రతా అవధి 15 °C నుండి 42 °C.[1] వరకు ఉంటుంది.
ఈ ప్రాంత సరాసరి వర్షపాతం సుమారు 915 mm.[1] ఉంటుంది.
మొసళ్ళు
[మార్చు]1974 లో అంతరించిపోతున్న మొసళ్ల జాతి అయిన "మగ్గర్ మొసలి" తెలంగాణ లోని ప్రవేశించింది. మంజీరా నదిలో నాలుగు జతల మగ్గర్ మొసళ్ళను విడిచిపెట్టారు. ఈ మొసళ్ళను పరిరక్షించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము మొసళ్ళ సంరక్షణా కేంద్రాన్ని ఇచట ప్రారంభింఛింది. 1980ల మధ్యలో మంజీరా ప్రఖ్యాతమైన పక్షి సంరక్షణా కేంద్రంగా నిలిచింది. ఈ కేంద్రం పక్షుల సందర్శకులను ఆకర్షించింది. ప్రస్తుతం సుమారు 300 మొసళ్ళు ఇచట ఉన్నాయి. మొసళ్ళను పునరుత్పత్తి చేయు కార్యక్రమం కూడా జరిగుతుంది.[1]
పార్కు విశిష్ట సమాచారం
[మార్చు]ఈ అభయారణ్యం పర్యావరణ విద్యా కేంద్రం కలిగి యున్నది. ఇంకులో ఒక మ్యూజియం, గ్రంథాలయం, ఆడిటోరియం ఉన్నాయి. పక్షుల, జంతువుల చలన చిత్రాలను ప్రతిరోజూ చూపిస్తారు. ఈ అభయారణ్యంలో పక్షులను సందర్శకులు చూచుటకు బోట్లు సమకూర్చబడతాయి. సందర్శకులకు దూరదర్శినులు (బైనాక్యులర్స్), పక్షులను గుర్తించేందుకు పుస్తకాలు అందుబాటులో ఉంటాయి.[3][4]
ఈ అభయారణ్యాన్ని సందర్శించుటకు అనువైన కాలం నవంబరు నుండి మార్చి. ఈ కాలంలో వలస పక్షులు వాటి గూళ్ళను కట్టి గుడ్లను పొదుగుతాయి. సందర్శకులకు వసతి సౌకర్యం కూడా ఉంది. సంగారెడ్డి వద్ద ఇనస్పెక్షన్ బంగ్లా, సింగూర్, సదాశివపేటలలో వసతి కల్పించబడుతుంది.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Important Bird Areas in India - A.P." (PDF). Indian Bird Conservation Network. Archived from the original (PDF) on 11 ఏప్రిల్ 2013. Retrieved 30 July 2012.
- ↑ 2.0 2.1 2.2 2.3 "Manjira Wildlife Sanctuary". Andhra Pradesh Forest Department. Archived from the original on 21 మే 2012. Retrieved 30 July 2012.
- ↑ 3.0 3.1 "Sanctuary Spotlight". The Hindu. Archived from the original on 25 జనవరి 2013. Retrieved 30 July 2012.
- ↑ "About Manjira Wildlife Sanctuary". wildlifeinindia.in/. Archived from the original on 23 జూలై 2012. Retrieved 30 July 2012.