మండేలా (తమిళ చిత్రం 2021)
మండేలా | |
---|---|
దర్శకత్వం | మడోన్నే అశ్విన్ |
రచన | మడోన్నే అశ్విన్ |
నిర్మాత | శశికాంత్ చక్రవర్తి రామచంద్ర బాలాజీ మోహన్ |
తారాగణం | యోగిబాబు షీలా రాజ్ కుమార్ |
ఛాయాగ్రహణం | విధు అయ్యన్న |
సంగీతం | భరత్ శంకర్ |
నిర్మాణ సంస్థలు | వై నాట్ స్టూడియోస్ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ఓపెన్ విండో ప్రొడక్షన్స్ విష్ బెర్రీ ఫిలిమ్స్ |
పంపిణీదార్లు | నెట్ ఫ్లిక్ |
విడుదల తేదీ | 4 ఏప్రిల్ 2021 |
దేశం | భారతదేశం |
భాష | తమిళ్ |
మండేలా 2021లో పొలిటికల్ సెటైరికల్ నేపథ్యంలో నాయీబ్రాహ్మణులకు సంబంధించిన కథాంశంతో విడుదలైన తమిళ చిత్రం. వై నాట్ స్టూడియోస్ బ్యానర్ లో శశికాంత్, రామచంద్ర నిర్మించిన ఈ చిత్రంతో మడోన్నే అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తమిళ హాస్యనటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో నటించాడు. మండేలా సినిమా స్టార్ విజయ్ & నెట్ ఫ్లిక్స్ లో 2021, ఏప్రిల్ 4న విడుదలైంది.[1][2]
కథ
[మార్చు]పెరియార్ ఆశయాలే ప్రాణంగా భావించిన ఓ గ్రామ పెద్ద, పంచాయితీ ప్రెసిడెంట్ అనారోగ్యంతో ఆ పదవి నుండి తప్పుకుంటాడు. ఆయనకు ఇద్దరు భార్యలు. ఇద్దరి కులాలు వేరు. వాళ్ళకు ఇద్దరు కొడుకులు. తన వారసుల్ని రాజకీయాల్లోకి తీసుకు రాకూడదని పెద్దాయన భావించినా, ఈ అన్నదమ్ములు ససేమిరా అంటారు. తండ్రి పదవికి ఇద్దరూ పోటీ పడతారు. చిత్రం ఏమంటే... ఆ ఇద్దరి కులాలకు ఈ గ్రామంలో సమానమైన ఓట్లు ఉంటాయి. దాంతో గెలుపును నిర్ణయించే వ్యక్తిగా ఒకే ఒక్కడు నిలుస్తాడు. ఊరిలో ఎవరికీ పట్టని, ఏ పేరూ లేని క్షురకుడు అతను. ఆ ఊరిలోనే ఉండే ఓ యువతి అతనికి ఓ పేరు పెట్టుకోమని సలహా ఇవ్వడంతో 'మండేలా' అనే పేరు పెట్టుకుంటాడు. ఓటరు ఐడీ కార్డూనూ పొందుతాడు. సో... మండేలా వేసే ఓటే ఆ వూరి పంచాయితీ ప్రెసిడెంట్ ఎవరు అనేది నిర్ణయిస్తుంది! అక్కడ నుండి రాజకీయ నేతల వికృత క్రీడా విన్యాసాలు మొదలవుతాయి. ఆ బార్బర్ ను తమ వైపు తిప్పుకోవడానికి ఈ అన్నదమ్ములు ఇద్దరూ ఎలా ఎత్తుగడలు వేశారు? అతనికి ఎలాంటి ఆశలు చూపించారు? ఒకానొక సమయంలో ఆ మాయాజాలంలో చిక్కుకున్న మండేలా తిరిగి తన అస్తిత్వాన్ని ఎలా కాపడుకున్నాడు? ఆ వూరికి ఎలాంటి మేలు చేశాడు? అనేది సినిమా కథ. [3]
నటీనటులు
[మార్చు]- యోగిబాబు - నెల్సన్ మండేలా
- షీలా రాజ్‍కుమార్ - తెన్మోజ్హి
- సంగిలి మురుగన్ - పెరియ అయ్యా
- జి.ఎం. సుందర్ - రత్నం
- కన్న రవి - మది
- సేంతి కుమారి - వల్లి
- జార్జ్ మర్యన్- బిఎల్ఓ అధికారి
- దీపా శంకర్ - రత్నం భార్య
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం : మడోన్ అశ్విన్
- రచన : మడోన్ అశ్విన్, సుమన్ కుమార్ (కంటెంట్ హెడ్)
- సంగీతం : భరత్ శంకర్
- ఛాయాగ్రహణం : విధు అయ్యన్న
- బ్యానర్స్ : వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్, ఓపెన్ విండో ప్రొడక్షన్స్, విష్ బెర్రీ
- నిర్మాతలు : బాలాజీ మోహన్, చక్రవర్తి రామచంద్ర, శశికాంత్
- విడుదల : స్టార్ విజయ్ & నెట్ ఫ్లిక్స్, ఏప్రెల్ 5, 2021
మూలాలు
[మార్చు]- ↑ Film Companion (5 April 2021). "Mandela, On Netflix, Is A Chuckle-A-Minute Guide To Your Right To Vote". Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.
- ↑ NTV Telugu. "మండేలా (తమిళం) : రివ్యూ". Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.
- ↑ Eenadu. "ఓటు విలువ చాటిచెప్పే 'మండేలా' - mandela movie review". www.eenadu.net. Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.