మందార్ మధుకర్ దేశ్‌ముఖ్
Jump to navigation
Jump to search
మందార్ మధుకర్ దేశ్‌ముఖ్ (జననం 20 అక్టోబరు 1974) భారతీయ భౌతిక శాస్త్రవేత్త. ఆయన ముఖ్యంగా ముంబై లోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో నానోస్కేల్స్ అరియు మీసోస్కోపిక్ ఫిజిక్స్ లో కృషి చేస్తున్నారు. ఆయనకు 2015 లో శాంతిస్వరూప్ భట్నాగర్ శాస్త్ర, సాంకేతిక పురస్కారం లభించింది. ఇది భారతదేశంలో శాస్త్రవిజ్ఞానంలో కృషిచేసేవారికి దక్కే అతి గౌరవనీయమైన పురస్కారం. ఆయనకు భౌతిక రసాయన శాస్త్రాల విభాగంలో ఈ పురస్కారం లభించింది.[1] ఆయన 1996లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బాంబే లో బి.టెక్ పూర్తిచేసారు. 2002లో డి. సి. రల్ఫా పర్యవేక్షణలో కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి ని పొందారు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆయన భార్య ప్రీతా పంత్ కూడా కార్నెల్ల్ విశ్వవిద్యాలయంలో పి. హెచ్. డి చేసింది. ఆమె ఐ.ఐ.టి బొంబాయిలో అసిస్టెంట్ ప్రొఫెసరుగా ఉన్నారు.
మూలాలు
[మార్చు]- ↑ "Brief Profile of the Awardee". Shanti Swarup Bhatnagar Prize. CSIR Human Resource Development Group, New Delhi. Retrieved 5 November 2015.