మట్ట
Jump to navigation
Jump to search
పామే కుటుంబం ఏకదళబీజాలకు చెందినది. వర్గీకరణ శాస్త్రవేత్త లిన్నేయస్ వీనిని "వృక్షసామ్రాజ్యపు రాకుమారులు" (Princes of Plant Kingdom) అని వర్ణించారు. ఈ చెట్లు దృఢంగా ఎత్తుగా కొమ్మలు లేకుండా పెరుగుతాయి. వీటి ఆకులు రెమ్మల వలె ఉన్నప్పటికి వీటి ప్రధాన్యతను బట్టి, ఆకారాన్ని బట్టి, పరిమాణాన్ని బట్టి ఈ ఆకులను మట్టలు అంటారు. ఈ చెట్ల మట్టలు చెట్టు పెరుగుతూ ఉన్నంతకాలం కొత్త మట్టలు పుడుతూ ఉంటే పాత మట్టలు రాలి పోతుంటాయి. రెమ్మలతో పోలిస్తే మట్టలు రెమ్మల కంటే అనేక రెట్లు బరువుగాను, పెద్దవిగాను ఉంటాయి. చెట్టు నుంచి రెమ్మలు రాలిపోవు. కాని చెట్టు నుంచి మట్టలు రాలి పోతాయి. ఉదాహరణకు తాటి చెట్టు ఆకులను తాటిమట్ట అంటారు. అలాగే కొబ్బరి చెట్టుకు కాసే మట్టలను కొబ్బరి మట్ట అంటారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]సామెతలు
[మార్చు]వాడిది నోరా తాటి మట్టా