మట్టంరాళ్ల తండా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మట్టంరాళ్ల తండాఎల్లంపేట్ పంచాయితీ పరిధిలో ఉంది.అడవి తల్లి ఒడిలో చెట్టుకోటి పుట్టుకోటి ఏరేసినట్లు ఇండ్లతో చూడముచ్చెటగా ఉంటుంది.

ప్రత్యేకత[మార్చు]

కామారెడ్డి జిల్లాలో ఇపుడిపుడే మట్టంరాళ్ల తండా పేరు విన్పిస్తుంది. అందుకు కారణం ఆదిమానవుల ఆనవాళ్లు వెలుగులోకి రావడం.రాతి గుహలో రాతియుగం,పెదరాతి యుగం, కాంస్య యుగం నాటి రాతి చిత్రాలు వందకు పైగా ఇక్కడ ఉన్నాయి.మనుషులు,జంతువులు,త్రికోణాలతో కూడిన చిత్రాలు ఉన్నాయి.

చిత్రాల కాలం[మార్చు]

30 అడుగుల ఎత్తు,15 అడుగుల వెడల్పు ఉన్న ఈ గుహలో వందల సంఖ్యలో చిత్రాలు ఉన్నాయి.అక్కడున్న ఆనవాళ్ల ఆధారంగా ఆ గుహను పాత రాతి యుగం నాటి నుంచే ఆవాసంగా చేసుకున్నారు.

రూట్ మ్యాప్[మార్చు]

కామారెడ్డి నుంచి వెళ్తే, ఇసాయిపేట్ మీదుగా ఎల్లంపేట్ నుంచి బంజెపల్లి తండా రోడ్డు వెంబడి వెళ్లాలి. 2కిలో మీటర్లు వెళ్లాక మరో తండా వస్తుంది. అలానే ముందుకెళ్తే రోడ్డు పక్కన చిన్న గుడి. ఆ గుడి ఎదురుగా చిన్న సర్వీస్ రోడ్డు వస్తుంది.కిలోమీటర్ తర్వాత కుడి వైపు వెల్లాలి. అలానే కుడివైపు చివరి వరకు వెళ్తే.. మూడు గుడిసెలు వస్తాయి. అక్కడి నుంచి కుడి వైపు చూస్తే చెట్ల మధ్యలో పెద్దరాయి. అదే ఆ గుహ.