మడమ నొప్పి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాత్రంతా విశ్రాంతిగా పడుకున్న తర్వాత ఉదయం మంచం దిగుతూనే కాలు నేల మీద పెట్టాలంటే చాలామందికి నరకం కనిపిస్తుంటుంది. రోజులో ఎక్కువ సేపు నిలబడే ఉండటం, లేదా సాధారణంగా గట్టి నేల మీద నడక, పరుగు, జాగింగ్‌ వంటివి దీనికి ముఖ్య కారణం.

మూలం[మార్చు]

మన పాదం అడుగున- మడమ నుంచి వేళ్ల వరకూ ఒక బలిష్టమైన కండరం ఉంటుంది. దీన్నే 'ప్లాంటార్‌ ఫేషియా' అంటారు. పాదం అడుగు వైపున.. ఒక పక్క గొయ్యిలా ఉండే భాగానికి (ఆర్చ్‌) కూడా ఈ దృఢమైన కండరమే ఆధారం. గట్టి నేల మీద బలంగా పరుగెత్తటం, ఎక్కువసేపు నిలబడే ఉండటం.. ఇలా ఏదైనా కారణాన ఈ కండరం మీద తీవ్రమైన ఒత్తిడి పడితే ఇది కొద్దిగా చిరగొచ్చు. లేదా బాగా నలిగినట్టుగా అవ్వచ్చు. ఫలితమే- నడిచేటప్పుడు మడమ నొప్పి. చెప్పుల్లేకుండా నడుస్తున్నా, మెట్లు ఎక్కుతున్నా ఈ నొప్పి ఇంకా పెరుగుతుంటుంది. సాధారణంగా ఈ నొప్పి పూర్తిగా తగ్గటానికి ఎంతలేదన్నా 8, 9 నెలలు పడుతుంది. కొంతమందికి ఇంకా ఎక్కువ సమయమే పట్టొచ్చు కూడా.

నివారణ[మార్చు]

ఇటువంటి నొప్పులకు వ్యాయామం బాగా పని చేస్తుంది. పాదానికి సాధ్యమైనంత విశ్రాంతి ఇవ్వటం, నొప్పి బాధ తగ్గేందుకు మందులేసుకోవటం వంటివన్నీ కాక కొన్ని ప్రత్యేక వ్యాయామాలతో మంచి ప్రయోజనం ఉంటుంది. పాదం అడుగున ఉండే ఈ ప్లాంటార్‌ ఫేషియా కండరాన్ని నిదానంగా సాగదీసి వదులుతుండటం (స్ట్రెచ్‌) దీనిలోని వ్యాయామం.

వ్యాయామాలు[మార్చు]

  1. మడమ నొప్పి ఉన్న కాలు పైకి వచ్చేలా.. కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చోవాలి. చేత్తో పాదాన్ని వేళ్ల దగ్గర పట్టుకుని... సాధ్యమైనంత వెనక్కి వంచాలి. ఇలా వెనక్కి సాగదీసి 10 సెకన్లు పట్టుకుని తర్వాత మామూలు స్థితికి తేవాలి. రోజూ రెండుపూట్లా.. ఇలా కనీసం 10 సార్లు చెయ్యాలి.
  2. నేల మీద ఓ శౌకం (టవల్) పడెయ్యండి. దాన్ని కాలి వేళ్లతో పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ.. కొద్దికొద్దిగా మీ వైపు లాక్కుంటూ ఉండండి. రోజూ ఇలా 10 సార్లు చెయ్యండి.