Jump to content

మదన్ థియేటర్స్

వికీపీడియా నుండి

మదన్ థియేటర్ కంపెనీని మదన్ థియేటర్స్ లిమిటెడ్ అని కూడా పిలుస్తారు. దీనిని సంక్షిప్తంగా, మదన్ థియేటర్స్ అని పిలుస్తారు. ఇది భారతీయ సినిమా మార్గదర్శకులలో ఒకరైన జంషెడ్జీ ఫ్రాంజీ మదన్ చేత స్థాపించబడిన చలన చిత్ర నిర్మాణ సంస్థ.

చరిత్ర

[మార్చు]

చిన్న వయస్సు నుండే నాటక రంగంలో అనుభవం ఉన్న మదన్ అనే యువ పార్సీ వ్యాపారవేత్త 1902 లో కలకత్తాలోని మైదాన్‌ ప్రాంతంలో ప్రారంభించిన సినిమాల ప్రదర్శనకు సంబంధించిన బయోస్కోప్ ప్రదర్శనలను ప్రారంభించడం ద్వారా వినోద వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత, మదన్ థియేటర్ వ్యాపారం వేగంగా వృద్ధి చెందడం ప్రారంభించింది. 1919 లో, అతని వ్యాపారం మదన్ థియేటర్స్ లిమిటెడ్ పేరుతో ఉమ్మడి స్టాక్ కంపెనీగా మారింది. మదన్ థియేటర్స్, దాని సహచరులు ఆ రోజుల్లో భారతదేశంలోని థియేటర్ హౌస్‌లపై గొప్ప నియంత్రణను కలిగి ఉండేవారు.

జంషెడ్జీ ఫ్రాంజీ మదన్ మూడవ కుమారుడు జె. జె. మదన్ 1923 లో తన తండ్రి మరణం తరువాత మదన్ థియేటర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అయ్యాడు. 1920 ల చివరలో మదన్ థియేటర్స్ గరిష్ట స్థాయికి చేరుకుంది. అపుడు ఇది 127 థియేటర్లను కలిగి ఉంది. దేశంలోని సగం బాక్సాఫీసుల్ని నియంత్రించింది. [1] మదన్ థియేటర్స్ 1937 వరకు అనేక పేరొందిన, మైలురాయిగా నిలిచిన చిత్రాలను నిర్మించింది.

1929లో రవీంద్రనాథ్ ఠాగూర్ రచన ఆధారంగా 'గిరిబాల' చిత్రీకరణ

చిత్రాల జాబితా

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. p 520, The SAGE Handbook of Media Studies, John H Downing et al., SAGE, 2004, ISBN 0-7619-2169-9
  2. IMDB page on Jamai Sasthi

బాహ్య లంకెలు

[మార్చు]