మద్దూరి బలదుర్గా శ్యామల
స్వరూపం
మద్దూరి బలదుర్గా శ్యామల తొలి గజల్ కవయిత్రి.[1][2]
జననం
[మార్చు]శ్యామల 1966, ఆగస్టు 10న ఎం.ఎస్.ఎన్. మూర్తి, లక్ష్మీసీతమ్మ దంపతులకు గుంటూరు జిల్లా, వెల్లటూరు గ్రామంలో జన్మించింది.[2]
విద్యాభ్యాసం - ఉద్యోగం
[మార్చు]జిల్లెళ్ళమూడి ప్రాచ్య కళాశాల విద్యాభ్యాసం చేసింది. అభిజ్ఞాన శాకుంతలం ఆంధ్రీకరణ అనుశీలకు డాక్టరేట్ పొందింది. బాపట్ల సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తుంది.
రచనాప్రస్థానం
[మార్చు]- కోయిలమ్మ పదాలు, సుహృల్లేఖ, షిర్డి గజల్స్, ఆలాపన (గజల్స్ సంకలనాలు)
- నా గుండే గుమ్మానికి పచ్చనాకునై, సజీవ క్షణాల కోసం వంటి (వచన కవితా సంకలనాలు)
పురస్కారాలు
[మార్చు]- ఉత్తమ ఉపాధ్యాయుని సత్కారం (సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల శాఖ)
- కవి బ్రహ్మ తిక్కనామాత్య పురస్కారం
- కలహంస గజల్ పురస్కారం
- ఎక్స్ లెన్సీ అవార్డు (హైదరాబాద్ కళావేదిక)
- మహిళా రత్న పురస్కారం (వివేకానంద సామాజిక సేవా సంస్థ)
- హెల్త్ ఇంటర్నేషనల్ అండ్ గ్లోబల్ పీస్ ఫౌండేషన్ పురస్కారం[2]
మూలాలు
[మార్చు]- ↑ ప్రతిలిపి శ్యామల మద్దూరి. "ప్రతిలిపి". Archived from the original on 25 సెప్టెంబరు 2020. Retrieved 21 April 2017.
- ↑ 2.0 2.1 2.2 "తొలి గజల్ కవయిత్రి శ్యామల". ఆంధ్రజ్యోతి. 10 April 2017.