Jump to content

మధునాపంతుల వేంకట పరమయ్య

వికీపీడియా నుండి

బ్రహ్మర్షి మధునాపంతుల వేంకట పరమయ్య ప్రముఖ కవి, ఆధ్యాత్మికవేత్త.

జీవిత విశేషాలు

[మార్చు]

మధునాపంతుల వెంకట పరమయ్య తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన పల్లెపాలెం గ్రామంలో గౌరీ మాణిక్యాంబ, వేంకట సుబ్బారావు దంపతులకు డిసెంబర్ 8, 1931 న జన్మించారు. ఆయన తాతగారు మధునాపంతుల సూరయ్య శాస్త్రి ప్రముఖ పండితుడు, చేళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారి గురువు.

ఆయన పెద్దాపురం లోనే విద్యాభ్యాసం చేసి 1959 నుండి 1989 వరకూ పెద్దాపురం లూథరన్ ఉన్నత పాఠశాల లోనే ఉద్యోగం చేశారు. 1950లో సూర్యకాంతం గారిని వివాహం చేసుకున్నారు.

తండ్రి మధునాపంతుల సుబ్బారావు గారి ప్రోత్సాహం,  తాత సూరయ్యశాస్త్రి గారి ఆశీస్సులు అందుకుని మామగారు ద్విబాష్యము వేంకటరావు గారి యొక్క ప్రేరణతో కవితారచనకు శ్రీకారం చుట్టారు. భమిడి సూర్యభగవత్ శాస్త్రి గారివద్ద 1948లో బాషాప్రవీణుడై, సంస్కృత భాషను సంపూర్ణంగా అధ్యయనం చేసి వేద విద్యను నేర్చుకున్నారు. అతడు వ్యాకరణశాస్త్ర అవలోకనం చేసి సంస్కృతాంద్ర గ్రంథరచనా సామర్థ్యాన్ని ద్విభాషి సోమనాధ శాస్త్రిగారి ద్వారా సముపార్జించాడు. గాంధేయవాది శ్రీ యక్కల వీర్రాజుగారి అపూర్వ సాన్నిహిత్యంలో ఆధ్యాత్మిక జీవనాన్ని అలవరచుకొన్నారు. వేదుల సత్యనారాయణ శాస్త్రి సాహిత్య ప్రభావాన్ని కవితా ధోరణిని ఆకళించుకొన్నారు. అతడు నేర్చుకున్న ప్రతీ మంచి విషయాన్ని నిజజీవితంలో పాటించి గొప్ప విద్యార్థిగా, గొప్ప శిష్యునిగా ఎదిగారు. విలువలతో కూడిన వ్యక్తిగా జీవించి తను నేర్చుకున్న విద్యను అందరికీ పంచిన గురువుగా ఎందరికో మార్గదర్శకమైనారు. ఒక సద్గురువుగా ఆద్యాత్మిక ఆనందానికి మార్గాన్ని ప్రబోధించే పరమ పూజ్యులైన గురుదేవులుగా జీవించారు. ఆయన సెప్టెంబర్ 7, 2017 న స్వర్గస్థులైనారు.[1]

పరమయ్య గారి రచనలు

[మార్చు]

ముద్రితములు

[మార్చు]
  • చారుచర్య
  • నివేదన
  • కుసుమగుచ్ఛము
  • ఆంజనేయోదాహరణము
  • రచనా విషేషము
  • పరమహంసోదాహరణము
  • బాలచరితము
  • తిరువల్లువరు
  • గురుగీతము
  • లక్ష్మీ హృదయము
  • ఆత్మభోదము
  • ముకుందమాల
  • విచిత్ర భారతము
  • చంద్రోదయము
  • పార్వతీ కళ్యాణము
  • మల్లికామాలిక

అముద్రితాలు

[మార్చు]
  • కబీరు ఉపదేశములు
  • నామసుద
  • వినాయక చరిత్ర
  • దేవీస్తోత్రము
  • ప్రేమ ప్రచారకుడ

మూలాలు

[మార్చు]
  1. "Brahmarsi Madunapanthula Venkata Paramayya – Mana Peddapuram". www.manapeddapuram.info. Retrieved 2018-04-12.[permanent dead link]