మధురై నగర పాలక సంస్థ
మధురై నగర పాలక సంస్థ | |
---|---|
రకం | |
రకం | మధురై మున్సిపల్ కార్పొరేషన్ |
నాయకత్వం | |
కమీషనర్ | కేపీ కార్తికేయన్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
మధురై నగర పాలక సంస్థ, తమిళనాడు రాష్ట్రానికి చెందినది. ఇది భారతదేశములోని మూడవ పెద్ద మహానగరం.
చరిత్ర
[మార్చు]మధురై కార్పొరేషన్ 1866లో 41,601 జనాభాతో ఏర్పాటు చేశారు. నగరం యొక్క వైశాల్యం 2.60 చదరపు కిలోమీటర్లు.1892 నాటికి నగర కౌన్సిల్ సభ్యుల సంఖ్య 24 కి పెరిగింది.వారిలో 6 మందిని ప్రభుత్వం నియమిస్తుంది.1921నాటికి నగర కౌన్సిల్ సభ్యుల సంఖ్య 36 కి పెరిగింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికైన మున్సిపల్ కౌన్సిల్లు 1969 వరకు పనిచేశారు. 1974 లో మధురై కార్పొరేషన్‌లో మరో 13 పంచాయితీలు విలీనమయ్యాయి. నగరంలోని వార్డులను 65 కి పెరిగాయి.1978లో కార్పొరేషన్‌కు మొదటిసారి ఎన్నికలు జరిగాయి. 65 నగర కౌన్సిల్ సభ్యులు ఎన్నికయ్యారు. వీరిలో 5 మంది మహిళలు 4 మంది దిగువ తరగతికి చెందిన వారు ఉన్నారు.[1][2] [3] [4] [3]
భౌగోళికం
[మార్చు]మదురై తమిళనాడు రాజధాని చెన్నై నగరానికి నైరుతీ దిశలో 498 కిలోమీటర్ల (309 మైళ్ళ ) దూరంలో ఉంది. తిరుచినాపల్లికి 161 కిలోమీటర్ల (100 మైళ్ళ ) దూరంలో ఉంది. కోయంబత్తూకు 367 కిలోమీటర్ల (228 మైళ్ళ ) దూరంలో ఉంది. కన్యాకుమారీకి ఉత్తరంగా 241 కిలోమీటర్ల ( 150 మైళ్ళ ) దూరంలో ఉంది. సముద్రమట్టానికి 101 అడుగుల ఎత్తులో ఉంది. చదరమైన భూభాగం కలిగి వైగైనదీ తీరంలో ఉపస్థితమై ఉంది. వైగైనది నగరం మధ్యగా ప్రవహిస్తూ నగరాన్ని రెండు సమాన భాగాలుగా విభజించినట్లు ఉంటుందీ సుందర పవిత్ర చారిత్రాత్మక నగరం. నగరానికి వాయవ్యంలో సిరుమలై, నాగమలై కొండలు ఉన్నాయి. మదురై నగరంలోపలి, వెలుపలి భూములు పెరియార్ ఆనకట్ట నుండి లభిస్తున్న నీటి సాయంతో పుష్కలమైన పంటలను అందిస్తున్నాయి. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ మదురై నగర వైశాల్యం 147.99 కిలోమీటర్లు.
జనాభా గుణంకాలు
[మార్చు]ఈ నగర పాలక సంస్థలో 2011 జనాభా లెక్కలు ప్రకారం జనాభా 1,017,865 ఇందులో 509,302 పురుషులు కాగా 508,563 మహిళలు ఉన్నారు. పురుషుల అక్షరాస్యత 82.2%, ఉండగా స్త్రీల అక్షరాస్యత 72.6% అక్షరాస్యులు ఉన్నారు. జనాభాలో 6 సంవత్సరాలకంటే తక్కువ వయసుకలిగిన వారి శాతం 10.7% ఉన్నారు.[5]
పరిపాలన
[మార్చు]మధురై కార్పొరేషన్ పరిపాలనా సౌలభ్యం కోసం నాలుగు జోన్లుగా విభజించారు.కార్పొరేషన్‌లోని మొత్తం 100 వార్డులు ఉన్నాయి. ఈ 100 మందికికి మేయర్ నేతృత్వం వహిస్తారు.కౌన్సిల్ నెలలో ఒకసారి సమావేశమవుతారు
మూలాలు
[మార్చు]- ↑ Lal, Shiv (1972). Indian elections since independence. Vol. 1. Election Archives. p. 151.
- ↑ "Picketing of Liquor shops in Madurai". Historia. Vol. 1. Madurai Tamilology Publishers. 1981. p. 55.
- ↑ 3.0 3.1 Civic affairs. Vol. 18. Citizen Press. 1970. p. 54.
- ↑ Palanithurai, Ganapathy (2007). A handbook for panchayati raj administration (Tamil Nadu). Concept Publishing Company. p. 80. ISBN 978-81-8069-340-3.
- ↑ "Madurai City Population Census 2011-2021 | Tamil Nadu". www.census2011.co.in. Retrieved 2021-10-18.