మధుసూధన్ దాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మధుసూధన్ దాస్
ఉత్కళ గౌరభ మధుసూధన్ దాస్
పుట్టిన తేదీ, స్థలం(1848-04-28)1848 ఏప్రిల్ 28
సత్యభామాపూర్ , కటక్ జిల్లా, బెంగాల్ ప్రెసిడెన్సీ
మరణం1934 ఫిబ్రవరి 4(1934-02-04) (వయసు 85)
వృత్తిన్యాయవాది, సంఘసంస్కర్త, స్వాతంత్ర్య సమర యోధుడు, మంత్రి, పారిశ్రామికవేత్త
విద్యఏం.ఏ
పూర్వవిద్యార్థికలకత్తా విశ్వవిద్యాలయం
కాలం1848–1934
జీవిత భాగస్వామిసౌదామిని దేవి

మధుసూధన్ దాస్ (1948 ఏప్రిల్ 28- 1934 ఫిబ్రవరి 4) భారతదేశానికి చెందిన న్యాయవాది, సంఘ సంస్కర్త 1903 ఒడిషా రాష్ట్ర ఏకత్వానికై ఉత్కల్ సమ్మిలని స్థాపించాడు. ఒడిషా ప్రావిన్స్ స్థాపించడంలో ఇతను ఒక ముఖ్య పాత్ర పోషించాడు. అది 1936 ఏప్రిల్ 1 న స్థాపించబడింది. ఇతను ఒడిషా రాష్ట్రంలో మొట్టమొదటి న్యాయ శాస్త్ర పట్టభద్రుడు. ఒడిషా రాష్ట్రంలో ఇతని పుట్టినరోజుని రాష్ట్ర న్యాయవాదుల దినోత్సవంగా జరుపుకుంటారు.[1]

జీవితం[మార్చు]

మధుసూదన్ దాస్ 1948 ఏప్రిల్ 28 న కటక్ ప్రాంతానికి 20 కి.మీ. దూరంలో ఉన్న సత్యభామ పూర్లో ఒక జమీందారీ కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు చౌదరి రఘునాథ్ దాస్ తల్లి పార్వతి దేవి. మధుసూదన్ దాస్ కు అతని తల్లిదండ్రులు పుట్టుకతో గోవింద వల్లభ్ అనే పేరు పెట్టారు. దాస్ కి ఇద్దరు అక్కలు ఒక తమ్ముడు. ఇతని తమ్ముడు గోపాల వల్లభ్ బీహార్ ప్రావిన్స్లో న్యాయవాదిగా ఉండేవాడు. రమాదేవి చౌదరి, స్వాతంత్ర్య సమరయోధురాలు, సంఘ సంస్కర్త ఇతనికి మేనకోడలు.[2] ఈమె 15 సంవత్సరాల వయస్సులో గోపబంధు చౌదరిని వివాహమాడింది.

మధుసూదన్ దాస్ క్రిస్ఠియన్ మతం స్వీకరించడం వల్ల ఊర్లో వాళ్లు అతన్ని బహిష్కరించారు. దాంతో అతను ఊరి చివర్లో ఉన్న ఒక ప్రదేశంలో ఒంటరిగా ఉండేవాడు. కాలక్రమేణా అతని ఇల్లు కస్తూర్బా జాతీయ మెమోరియల్ ట్రస్ట్ బాలబడి కార్యక్రమాలకి ఉపయోగించుకుంది. ఆ ఇంటిని అందరూ మధుకోటి అని పిలుచేవారు.ఇతను శైలబాల, సుధాంశు బాల అనే ఇద్దరు బెంగాలీ ఆడ పిల్లలను దత్తత తీసుకున్నాడు.

మూలలు[మార్చు]

  1. "Utkal Gourav Madhusudan Das". Odisha Files. 2012. Archived from the original on 3 మార్చి 2014. Retrieved 4 February 2013. born on 28th April of 1848 to father Choudhuri Raghunath Das and mother Parvati Devi at Satyabhamapur of Cuttack district
  2. "Ramadevi Women's University". www.rdwuniversity.nic.in. Retrieved 2021-09-10.