Jump to content

మధు క్షీరాలు

వికీపీడియా నుండి

మధు క్షీరాలు పుస్తకం హీబ్రూ భాష నుంచి తెలుగులోకి అనువాదం చేసిన కథల సంపుటి.[1]

రచన నేపథ్యం

[మార్చు]

హాయ్ హాఫ్ మన్ సంపాదకత్వం వహించిన ఈ పుస్తకాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా విశ్వసాహిత్యం శీర్షికన అనువదింపజేసి ప్రచురించింది. ఈ సంపుటి తెలుగుతోపాటు ఇతర భారతీయ భాషలు, ఆంగ్లంలో ప్రచురితమయ్యాయి. 258 పుటల్లో, రూ.65కు అందిస్తున్న ఈ పుస్తకం ISBN సంఖ్య 81-237-387-xతో ప్రచురితమవుతోంది.[2][3]

ఇతివృత్తాలు

[మార్చు]

విషాదభరితం, అవమానకరం, పీడన, సర్వనాశనం, యుద్ధం, రాజకీయ మార్పులు వంటి అంశాలను సవివరంగా ఈ కథల్లో కనిపిస్తాయి. ఇతర సంస్కృతుల్లో పరిఢవిల్లి వేళ్లూనుకుని పరదేశీ భాషగా రెండు వేలయేళ్ళు కొనసాగిన హిబ్రూ సంస్కృతి ఇందులో ప్రతిబింబిస్తుంది.

మూలాలు

[మార్చు]
  1. "పుస్తకం » Blog Archive » ప్రపంచ పుస్తక మేళాలో..!!" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-06.
  2. "Welcome to National Book Trust India". www.nbtindia.gov.in. Retrieved 2021-06-06.
  3. "Welcome to National Book Trust India". www.nbtindia.gov.in. Retrieved 2021-06-06.