మనమూ-మన దేహస్థితి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వైద్యశాస్త్రంలో అత్యంత ముఖ్యమైన అంశం మన శరీరాన్ని అవగాహన చేసుకోవడం. దాన్ని అవగాహన చేసుకున్న కొద్దీ ఎన్నో వ్యాధులకు మూలం, ఎన్నెన్నో వైద్యసమస్యలకు పరిష్కారం దొరుకుతాయి. ఈ అవగాహన కేవలం వైద్యులకే కాక సామాన్యులకు కూడా అవసరం. దానివల్ల వారు ఎన్నో సమస్యలు తప్పించుకునే వీలు దక్కుతుంది. పాఠకులకు శరీరాన్ని అవగాహన కల్పించేందుకు వైద్య వృత్తిలో అనుభవం ఉన్న రచయిత ఈ గ్రంథమాల రచించారు. ఆంధ్రపత్రిక అధిపతులైన శివలెంక శంభుప్రసాద్ ప్రేరణతో ఈ గ్రంథమాలను తాను ప్రణాళిక చేసి రచించినట్టు రచయిత డాక్టర్ గాలి బాలసుందరరావు చెప్పారు.

మనమూ-మన దేహస్థితి.jpg

ఈ గ్రంథమాలను మధురా పబ్లికేషన్స్, మద్రాసులో 1964-66 మధ్యకాలంలో ముద్రించబడ్డాయి.

మొదటి భాగము : శరీర ధర్మకాండ[మార్చు]

మనమూ-మన దేహస్థితి గ్రంథమాలలోని మొదటి భాగము శరీర ధర్మకాండ మొదటి ముద్రణ మే, 1964 లో జరిగింది.

విషయసూచిక[మార్చు]

 1. సజీవములు-నిర్జీవములు
 2. జీవకణము-దాని నిర్మాణము
 3. జీవకణ కార్యక్రమము
 4. జీవకణముల వృద్ధి-పునరుత్పత్తి
 5. మానవ శరీర విజ్ఞానము
 6. శరీరము-కోశ విభాగము
 7. అస్థి కోశము
 8. సంధి విజ్ఞానము
 9. నరకోశము
 10. శిరోనరములు-ఇంద్రియములు
 11. రక్త సంచార కోశము
 12. శ్వాసకోశము
 13. జీర్ణకోశము
 14. లివరు : పేంక్రియస్
 15. అనాళికా గ్రంథులు
 16. మెటబాలిజం : ఉష్ణశక్తి
 17. చర్మము
 18. మూత్రకోశము
 19. సంతానకోశము
 20. ప్రసవము

రెండవ భాగము : రోగకాండ[మార్చు]

మనమూ-మన దేహస్థితి గ్రంథమాలలోని రెండవ భాగము రోగకాండ మొదటి ముద్రణ 1965 లో జరిగింది. దీనిని మాతృసమానులైన తెన్నేటి శేషమ్మ గారికి అంకితమిచ్చారు.

విషయసూచిక[మార్చు]

 1. రోగకారక శక్తులు
 2. ఇన్‌ఫిల్ట్రేషన్-డీజెనరేషన్
 3. మెటబాలిజము: దాని వ్యవస్థా భంగములు
 4. పోర్ ఫైరిన్లు
 5. నెక్రోసిస్
 6. గేంగ్రీన్
 7. విటమినులు
 8. ఇన్‌ఫ్లమేషను
 9. రక్తప్లావన వ్యవస్థా భంగము
 10. శరీరద్రవ దుర్ వ్యవస్థ
 11. షాక్
 12. త్రాంబోసిస్
 13. ఎంబోలిజము
 14. అపాయములు
 15. శక్తిజనిత వ్యాధులు
 16. రసాయనిక వస్తువులు : ప్రమాదములు
 17. నియోప్లాజము

మూడవ భాగము : ఔషధకాండ[మార్చు]

మనమూ-మన దేహస్థితి గ్రంథమాలలోని మూడవ భాగము ఔషధకాండ మొదటి ముద్రణ జనవరి 1966 లో జరిగింది. దీనిని మహానటుడైన తన మిత్రుడు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి అంకితమిచ్చారు.

విషయసూచిక[మార్చు]

 1. ఔషధకాండ - వివిధ శాఖలు
 2. ఔషధములు - పనిచేసే విధానములు
 3. శరీరములో ప్రవేశించిన ఔషధములు ఏమౌతవి ?
 4. ఔషధములు - ప్రభేదములు
 5. ఔషధ ప్రదానము
 6. ప్రిస్క్రిప్షన్ వ్యాసే విధము
 7. నరకోశము - ఔషధములు
 8. కేంద్రనరాశయము - మందీకరౌషధములు
 9. బాధా నివారకములు
 10. ప్రకంపనా నిరోధకములు
 11. ఉత్తేజకములు
 12. అభ్యాసకారకౌషధములు
 13. స్వచ్ఛంద నరాశయము - ఔషధ విజ్ఞానము
 14. పేరా-సింపతెటిక్ సిస్టం ఉత్తేజకములు
 15. గేంగ్లియాన్ నిరోధకౌషధములు
 16. మానసికౌషధములు

మూలాలు[మార్చు]