మనశ్శరీరములపై పరిసరముల ప్రభావము
మనశ్శరీరములపై పరిసరముల ప్రభావము అనే తెలుగు పుస్తకాన్ని పారనంది జగన్నాధ స్వామి రచించారు.
చార్లెస్ రాబర్ట్ డార్విన్ భూమిపై జీవజాలము ఏ విధంగా పరిణామక్రం చెందాయి అనే విషయంపై పరిశోధనలు చేశాడు తత్ఫలితంగా పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ప్రకృతి లో జీవజాతులు వేటికవే ఏక కాలంలో రూపొందినట్లు ఎంతో కాలం నుండి నమ్ముతూ వస్తున్న ప్రజానీకానిని - అదంతా వాస్తవం కాదని ఒక మాతృక నుంచి సకల జీవరాశులు క్రమానుగతంగా పరిణామం చెందుతూ ఏర్పడతాయని, ఈ చర్య అనంతంగా కొనసాగుతూ ఉంటుందని వివరించినవాడు చార్లెస్ డార్విన్. వానరుని నుంచి నరవానరుడు, నరవానరుని నుంచి నరుడు పరిణామ పరంగా ఉద్భవించాడని తెలిపి సంచలనం రేపిన ప్రకృతి శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్. ఆయన సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని ప్రకృతి/పరిసరాలు మనస్సుపైనా, శరీరంపైనా చూపే ప్రభావాన్ని ఈ పుస్తకంలో రచయిత వివరించారు. ఆయన డార్విన్‌తో పాటు ఇతరులు ఏమన్నారో, ప్రాచీన భారతీయ సిద్ధాంతాలు ఏం చెప్తున్నాయో కూడా ఈ గ్రంథంలో రాశారు.
విషయసూచిక
[మార్చు]- ఉపోద్ఘాతము
- పరిసరములు; డార్విన్ యొక్క విచారణ
- పరిసరములు; వాటి విభజన
- పరిసరములు; ప్రాణుల సంభవము
- పరిసరములు; ప్రాణుల సృష్టి
- పరిసరములు; ప్రాణుల లయము
- ప్రాణులు సరిపెట్టుకొనుట
- ఆహారము
- శీతోష్ణస్థితి; వేడిమి; చవి
- వెలుతురు; సూర్యరశ్మి
- నివాస స్థలము
- ఉపయోగానుపయోగములు
- మిగిలిన పరిసరములు
- పరిసరముల సామాన్య ప్రభావము
- పరిసర ప్రభావ సిద్ధాంతము
- సిద్ధాంతానుబంధ ప్రశ్నలు
- సంఘము
- వరణ సిద్ధాంత నిరూపణ
- పరిసరములు; మనోవృత్తులు