Jump to content

మనసానమః (లఘు చిత్రం)

వికీపీడియా నుండి
మనసానమః
దర్శకత్వందీపక్ రెడ్డి
రచనదీపక్ రెడ్డి
నిర్మాతగజ్జల శిల్ప
తారాగణంవిరాజ్ అశ్విన్
దృషిక చందర్
వల్లీ రాఘవేందర్
పృథ్వి శర్మ
బన్నీ అభిరన్
ఛాయాగ్రహణంఎదురురోలు రాజు
సంగీతంసయ్యద్ కమ్రాన్
విడుదల తేదీ
28 మార్చి 2020 (2020-03-28)
సినిమా నిడివి
16 నిమిషాల 24 సెకన్లు
దేశంఇండియా
భాషతెలుగు
బడ్జెట్US$5,000

మనసానమః (ఆంగ్లం: Manasanamaha) 2020 భారతీయ తెలుగు-భాషలో నాన్-లీనియర్ రొమాంటిక్ డ్రామా లఘు చిత్రం. ఇది ప్రపంచంలోనే అత్యధిక అవార్డులు పొందిన షార్ట్ ఫిలింగానే కాకుండా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది.[1] దీనికి దీపక్ రెడ్డి వ్రాసి దర్శకత్వం వహించారు. విరాజ్ అశ్విన్, దృషిక చందర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని గజ్జల శిల్ప నిర్మించారు. ఈ చిత్రం వివిధ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడింది. ఈ చిత్రం అనేక విమర్శకుల ప్రశంసలు అందుకోవడమేకాక ఆస్కార్ (అకాడెమీ) అర్హత, BAFTA అర్హత పొందింది.[2][3] ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రాన్ని తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లోకి డబ్ చేశారు.

కథన క్రమం

[మార్చు]

సూర్య (విరాజ్ అశ్విన్) గతంలోని తన మూడు ప్రేమ కథలను వివరించే యువకుడు. ప్రతి కథలో ప్రేమ మూడు వేర్వేరు సీజన్లను సూచిస్తుంది, అవి చైత్ర (వేసవి), వర్ష (వర్షం), సీత (శీతాకాలం). మూడు పేర్లు అతని ముగ్గురు గత భాగస్వాములను సూచిస్తాయి. సినిమా రివర్స్ పద్ధతిలో నేరేట్ చేయబడింది. ప్రతి సన్నివేశం ముగింపు నుండి ప్రారంభ స్థానం వరకు వెనుకకు వెళుతుంది.

తారాగణం

[మార్చు]
  • సూర్య పాత్రలో విరాజ్ అశ్విన్
  • చైత్ర పాత్రలో దృషికా చందర్
  • వర్ష పాత్రలో వల్లి రాఘవేందర్
  • సీతగా పృథ్వీ శర్మ
  • సూర్య స్నేహితుడిగా బన్నీ అభిరన్
  • బేబీ సహస్ర
  • సత్య వర్మ
  • దీపక్ వర్మ
  • మహేష్

ప్రొడక్షన్

[మార్చు]

ఎక్స్‌క్యూజ్‌మీ, హైడ్‌ అండ్‌ సీక్‌ వంటి షార్ట్‌ఫిల్మ్స్‌ చేసిన యువ దర్శకుడు దీపక్ రెడ్డి తెరకెక్కించిన మూడవ లఘు చిత్రం మనసానమః. కథా, భావోద్వేగాలు దెబ్బ తినకుండా రివర్స్ స్క్రీన్‌ప్లే లవ్ స్టోరీగా తెరకెక్కించాలని ఆయన భావించాడు. అలా 2019లో షూటింగ్‌ పూర్తి చేసి, 2020 జనవరిలో యూట్యూబ్‌లో విడుదల చేశారు. చిత్రీకరణకు పట్టిన సమయం కేవలం ఐదు రోజులు మాత్రమే. అయితే ప్రీప్రొడక్షన్స్‌, పోస్ట్ ప్రొడక్షన్‌ కోసం ఏడాది పాటు శ్రమించాడు. ఇది US$5000 ఉత్పత్తి బడ్జెట్‌తో రూపొందించబడింది.[4] ఇప్పటివరకూ ఏ లఘు చిత్రం సాధించని విధంగా ఏకంగా 513 అవార్డులను సొంతం చేసుకుంది. దీన్ని ధ్రువీకరిస్తూ మనసానమః చిత్రానికి ఏకంగా గిన్నిస్‌ బుక్ ఆఫ్ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రశంసాపత్రం అందుకోవడం విశేషం.

మూలాలు

[మార్చు]
  1. "Manasanamaha: గిన్నిస్‌ వరల్డ్‌రికార్డు సాధించిన 'మనసానమః'". web.archive.org. 2022-06-27. Archived from the original on 2022-06-27. Retrieved 2022-06-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Manasanamaha | Film Threat" (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-10-09. Retrieved 2020-12-16.
  3. "Deepak Reddy's 'Manasanamaha' Makes History at the International Film Festivals - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-12-01.
  4. Dundoo, Sangeetha Devi (2020-03-31). "The Telugu short film 'Manasanamaha', unveiled during lockdown, wins appreciation". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-04-02.