Jump to content

మనసు కాస్తా కలతపడితే (పాట)

వికీపీడియా నుండి
(మనసు కాస్తా కలతపడితే నుండి దారిమార్పు చెందింది)
"మనసు కాస్తా కలతపడితే"
రచయితసిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతంఇళయరాజా
సాహిత్యంసిరివెన్నెల సీతారామశాస్త్రి
ప్రచురణశ్రీకారం (1995)
రచింపబడిన ప్రాంతంఆంధ్రప్రదేశ్
భాషతెలుగు
గాయకుడు/గాయనిజేసుదాసు

మనసు కాస్తా కలతపడితే పాట 1995లో విడుదలైన శ్రీకారం చిత్రంలోని పాట. ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి కి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. ఇళయరాజా సంగీతం అందించిన ఈ పాటను జేసుదాసు పాడాడు.

పాట నేపథ్యం

[మార్చు]

అత్యాచారానికి గురై, మానసిక వేదనకు లోనై ఆత్మహత్య చేసుకోబోతున్న కథానాయకకు, కథానాయకుడు ధైర్యం చెప్పి ఆమెను ఓదార్చే సందర్భంలో వచ్చే పాట ఇది.[1]

పాటలోని సాహిత్యం

[మార్చు]

పల్లవి:
మనసు కాస్త కలతపడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు
కనుల నీరు తుడుచువారు ఎవరూ లేరని చితి ఒడికి చేరాకు
ప్రాణమన్నది బంగారు పెన్నిధి నూరేళ్లు నిండుగా జీవించమన్నది
వేటాడువేళలో పోరాడమన్నది ||మనసు కాస్త||
చరణం 1:
కలసి రాని కాలమెంత కాటేస్తున్న – చలి చిదిమేస్తున్న
కూలిపోదు వేరు ఉన్న తరువేధైనా – తనువే మోడైనా
మాను జన్మకన్న – మనిషి ఎంత మిన్న
ఊపిరిని పోసే ఆడదానివమ్మ
బేలవై నువ్వు కూలితే – నేలపై ప్రాణముండదమ్మ ||మనసు కాస్త ||

పురస్కారాలు

[మార్చు]
  1. సిరివెన్నెల సీతారామశాస్త్రి- ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారం -1994

మూలాలు

[మార్చు]
  1. సాక్షి, ఫ్యామిలీ (11 January 2014). "మనసు కాస్త కలతపడితే... మందు ఇమ్మని మరణాన్ని అడగకు!". Archived from the original on 22 December 2020. Retrieved 22 December 2020.