మనోహర్ ఐచ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మనోహర్ ఐచ్
মনোহর আইচ
వ్యక్తిగత సమాచారం
ముద్దుపేరు(ర్లు)Pocket Hercules[1]
జాతీయతభారతీయుడు
జాతిబెంగాలీ హిందూ
జననం(1912-03-17)1912 మార్చి 17
టిప్పెరా, బెంగాల్, బ్రిటిష్ ఇండియా
మరణం2016 జూన్ 5(2016-06-05) (వయసు 104)
కోల్‌కటా, పశ్చిమబెంగాల్, భారతదేశం [2]
వృత్తిబాడీబిల్డర్
ఎత్తు1.51 m (4 ft 11 in)[1]
భార్య(లు)హ్యూతిక ఐచ్ (1924–2002)

మనోహర్ ఐచ్ (మార్చి 17, 1912 – జూన్ 5, 2016) [2] భారతదేశానికి చెందిన బాడీబిల్డర్. ఆయన బ్రిటిష్ ఇండియాలోని టిప్పెరా జిల్లాలో (ప్రస్తుతం బంగ్లాదేశ్ లోని కోమిల్లాజిల్లా) లో డమిటి గ్రామంలో జన్మించారు. ఆయన మిస్టర్ యూనివర్స్ పోటీలో గెలుపొందిన రెండవవాడు. భారత స్వాతంత్ర్యానంతరము మిస్టర్ యూనివర్స్ లో గెలుపొందిన మొదటి భారతీయుడు.[3] ఆయన 1952 లో "నాబా" యూనివర్స్ ఛాంపియన్ షిప్ చేసారు. ఆయన 4 అడుగుల 11 అంగుళాల ఎత్తు ఉన్నప్పటికీ "పాకెట్ హెర్క్యులస్"గా పేరు పొందారు.[4] ఆయన ఛాతీ కొలత 54 అంగుళాలు, నడుము కొలత 23 అంగుళాలుగా ఉండేది. ఆయన "బాహుబలి" అనే మారుపేరు కలిగి యుండేవాడు.

ప్రారంభ జీవితం[మార్చు]

ఆయన బాల్యం నుండి బలానికి సంబంధించిన ఆటలైన రెస్ట్లింగ్, వెయిట్ లిఫ్టింగ్ వంటి ఆటల పట్ల ఆసక్తి కనబరిచేవారు. తన 12 వ యేట బ్లాక్ ఫీవర్ రావదంతో ఆరోగ్యం చెడిపోయింది.[5] ఆయన ఫిజికల్ ఫిట్‌నెస్ ఎక్సర్ సైజులు చేసూ తిరిగి బలాన్ని పొందారు.

మిస్టర్ యూనివర్స్ గా[మార్చు]

1950లో 36 ఏళ్ల వయసులో మనోహర్ తొలిసారి ‘మిస్టర్ హెర్క్యులస్’ పోటీల్లో విజేతగా నిలిచారు. 1951లో ఏకంగా ‘మిస్టర్ యూనివర్స్’ పోటీల్లో పాల్గొన్నా... రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. కానీ లండన్‌లోనే మకాంపెట్టి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రాక్టీస్ చేసి ప్రో షాట్ డివిజన్ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సమయంలో ఆర్థిక సమస్యలు తలెత్తడంతో కొన్ని రోజులు బస్ కండక్టర్‌గా మారారు. సర్కస్‌ల్లో కూడా పనిచేశారు. చివరకు 1952లో ‘జాతీయ అమెచ్యూర్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ యూనివర్స్ చాంపియన్‌షిప్ టైటిల్’ను సాధించి భారత్ తరఫున రెండో ‘మిస్టర్ యూనివర్స్’గా రికార్డులకెక్కారు. దీంతో అతని సైజ్‌ను బట్టి ‘పాకెట్ హెర్క్యులస్’గా నామకరణం చేశారు. తొలిసారి 1951లో మాంటోష్ రాయ్ (భారత్) మిస్టర్ యూనివర్స్ టైటిల్‌ను గెలిచారు. కొమిల్లా (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది) జిల్లాలో జన్మించిన మనోహర్... 1942లో రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో చేరారు. ఆ తర్వాత బ్రిటిష్ అధికారి రెబూ మార్టిన్ ప్రోత్సాహం మేరకు బాడీ బిల్డింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుని అంచలంచెలుగా ఎదిగారు. చనిపోవడానికి కొన్ని రోజుల ముందు వరకు మనోహర్ క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజ్ చేశారు. 1991లో డమ్ డమ్ నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ తరఫున లోక్‌సభకు పోటీ చేసిన ఆయన లక్షా 63 వేల ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.[6]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.[1] ఆయన కుమారులు జిం, ఫిట్‌నెస్ సెంటరును నడుపుతున్నారు.[7]

మరణం[మార్చు]

భారత తొలితరం బాడీబిల్డర్‌గా ఖ్యాతిగాంచిన మనోహర్ ఐచ్ మే 5 2016 కన్నుమూశాడు. 104ఏండ్ల వయసున్న మనోహర్ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మరణించాడు.[8]

ఇతర పఠనాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 Indian bodybuilding legend Manohar Aich passes away. SportsKeeda
  2. 2.0 2.1 Manohar Aich aka Pocket Hercules dies at 104: ‘Was inspiration for all’, from The Indian Express
  3. Manohar Aich, independent India's first Mr Universe, dies at 104
  4. Clarke, Suzan (19 March 2012). "Mr. Universe 1952 Turns 100, Credits Healthy Lifestyle, Happiness". ABC News Blogs. Retrieved 19 March 2012.
  5. "কলকাতার কড়চা". Anandabazar Patrika. Kolkata. March 19, 2012. p. 4.
  6. మిస్టర్ యూనివర్స్’ మనోహర్ కన్నుమూత
  7. "Manohar Aich, former Mr. Universe turns 100". The Hindu. 18 March 2012. Retrieved 6 June 2016.
  8. "తొలితరం బాడీబిల్డర్ కన్నుమూత". Archived from the original on 2016-06-08. Retrieved 2016-06-06.

ఇతర లింకులు[మార్చు]