మనోహర్ హార్దికర్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మనోహర్ శంకర్ హార్దికర్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | బరోడా, గుజరాత్ | 1936 ఫిబ్రవరి 8|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 1995 ఫిబ్రవరి 4 ముంబై | (వయసు 58)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు |
| |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 85) | 1958 నవంబరు 28 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1958 డిసెంబరు 12 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2022 సెప్టెంబరు 3 |
మనోహర్ శంకర్ హార్దికర్ (1936 ఫిబ్రవరి 8 - 1995 ఫిబ్రవరి 4) భారతీయ టెస్ట్ క్రికెట్ ఆటగాడు.
హార్దికర్ 1958/9లో వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టు క్రికెట్‌లో అతను ఎదుర్కొన్న తొలి బంతికే రాయ్ గిల్‌క్రిస్ట్ అతడిని అవుట్ చేశాడు. ఆ తర్వాత అతను రోహన్ కన్హాయిని అవుట్ చేయడం ద్వారా టెస్ట్ క్రికెట్‌లో తన మూడో బంతికి వికెట్ తీసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో, అతను 32* పరుగులు చేశాడు. GS రాంచంద్‌తో కలిసి 85* పరుగులు జోడించాడు, ఇది ఓటమి నుండి భారతదేశాన్ని కాపాడింది. తర్వాతి టెస్టులో బీమరు బంతి హార్దికర్ తలకు తగిలి ఫోర్‌కి వెళ్లింది.[1] ఆ తరువాత అతను అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేదు గానీ అసంకల్పితంగా వివాదంలో చిక్కుకున్నాడు. అది ఆ సీరీస్‌లో పాలీ ఉమ్రిగర్ రాజీనామా చేయడానికి దారితీసింది.
అతను 1955/56 నుండి 1967/68 వరకు బొంబాయి తరపున ఆడాడు. తన మొదటి సంవత్సరంలో రంజీ ఫైనల్‌లో, అతను బెంగాల్‌పై 39 పరుగులకు 8 వికెట్లు తీసి కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు సాధించాడు. పన్నెండు మ్యాచ్‌లలో బాంబేకు కెప్టెన్‌గా చేసి, ఐదింటిని గెలిచి, మిగిలిన మ్యాచ్‌లను డ్రా చేశాడు. అతని కెప్టెన్సీలో బాంబే 1965/66, 1967/68లో టైటిల్ గెలిచింది.
హార్దికర్ 1995లో క్యాన్సర్‌తో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ Makarand Waingankar (10 May 2012). "Mumbai cricket's all-time khadoos". The Times of India. Retrieved 4 December 2014.