మన్ కీ బాత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని 2014 అక్టోబర్ 3వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అప్పటినుండి ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమవుతుంది[1]. ఆ నెలలో జరిగిన అంశాలు, వివిధ రంగాల్లో భారతీయులు సాధించిన విజయాలను ప్రధాని మోడీ ప్రజలతో పంచుకుంటారు[2]. ఈ కార్యక్రమాన్ని ప్రతినెల 23 జాతీయ భాషలు, 31 మండలి కాళ్లు అన్ని కేంద్రాల ద్వారా ఆకాశవాణి ప్రసారం చేస్తుంది. అలాగే ఇంగ్లీష్ సహా 11 అంతర్జాతీయ భాషల్లోనూ ఇది ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమం మొదలుపెట్టిన నాటినుంచి 2022 అక్టోబర్ వరకు మన్ కీ బాత్ ద్వారా ప్రసార భారతికి 33.16 కోట్ల ఆదాయం వచ్చింది. 2023 ఏప్రిల్ 30వ తేదీతో మన్ కీ బాత్ 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది[3]. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. సామాన్యులతో అనుసంధానానికి, ప్రజల్లోని భావ తీగలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు[4]. ఈ కార్యక్రమం తనను ప్రజలకు మరింత చేరువ చేస్తుందని చెప్పారు.

మూలాలు :

  1. "Mann Ki Baat", Wikipedia (in ఇంగ్లీష్), 2023-05-30, retrieved 2023-06-28
  2. "Mann Ki Baat | Prime Minister of India". www.pmindia.gov.in. Retrieved 2023-06-28.
  3. "PM Modi's Mann Ki Baat to go global with 100th episode today". The Hindu (in Indian English). 2023-04-30. ISSN 0971-751X. Retrieved 2023-06-28.
  4. "PM Narendra Modi's 'Mann ki Baat' 100th episode: Key points". The Times of India. 2023-04-30. ISSN 0971-8257. Retrieved 2023-06-28.