మరులమాతంగి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Xanthium
Xanthium strumarium L..jpg
Xanthium strumarium
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
ఉప రాజ్యం: Tracheobionta
విభాగం: మాగ్నోలియోఫైటా
తరగతి: మాగ్నోలియోప్సిడా
ఉప తరగతి: Asteridae
క్రమం: Asterales
కుటుంబం: Asteraceae
ఉప కుటుంబం: Asteroideae
జాతి: Heliantheae
జాతి: Xanthium
ప్రజాతి: Xanthium strumarium
ద్వినామీకరణం
Xanthium strumarium
L., 1753
Subspecies
పర్యాయపదాలు

Xanthium orientale

మరుల మాతంగి అనేది అస్టరెసీ (Asteraceae) కుటుంబానికి చెందిన చిన్న చెట్టు. దీని శాస్త్రీయ నామం క్సాంధియం స్ట్రుమేరియమ్ (Xanthium strumarium). ఆంగ్లంలో దీన్ని రఫ్ కాకిల్బర్, క్లాట్బర్, కామన్ కాకిల్బర్, లార్జ్ కాకిల్బర్, వూల్గారీ బర్ అని అంటారు. అద్భుత ఔషధ గుణాలున్న ఈ మొక్కను దక్షిణ ఆసియా మరియు చైనా దేశాల్లో సంప్రదాయ వైద్యంలో వాడుదురు [1]. మరుల మాతంగి పెంపుడు జంతువులకు మరియు పశువులకు హాని చేసే మొక్క. తమిళనాడు కొయంబత్తూరు మండలం ఉన్న సిరువాణి అడవుల్లో నివసించే మదుగ్గులు, పొంతాటులు, యాత్రియులు వంటి గిరిజన తెగలు మరులమాతంగి వేరు కషాయాన్ని నిద్రలేమికి వాడుదురు [2]. వీటి గింజల నుండి తీసిన నూనెను నొప్పులకు వాడుదురు [3]. అదిలాబాద్ జిల్లా నిర్మల్ డివిజన్ లో ఉండే గిరిజనులు వీటి వేరు నుండి తీసిన రసాన్ని ధరాయడ్ గ్రంథి వాపుపై పూస్తారు [4]. కేన్సర్, క్షయ, దెబ్బలు, తలనొప్పి, మలేరియా, మరియు కీళ్ళనొప్పులు వంటి వ్యాధులను నయం చేసే గుణాలు మరులమాతంగికి ఉన్నాయి [5].

మూలాలు[మార్చు]

లంకెలు[మార్చు]

Gallery[మార్చు]