మరో ఆలాపన
Appearance
మరో ఆలాపన | |
మరో అలాపన ముఖచిత్రం | |
కృతికర్త: | వి.ఏ.కే.రంగరావు |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | వ్యాస సంకలనం |
ప్రచురణ: | ప్రగతి ఆప్‌సెట్ ప్రింటర్స్, ఎర్రమంజిల్ హైదరాబాద్ |
విడుదల: | సెప్టెంబర్ 2012 |
పేజీలు: | 496 |
మరో ఆలాపన వి.ఏ.కే.రంగారావు వ్రాసిన వ్యాస సంకలనం. ఇది తెలుగు సినిమాలో ఉన్న అనేక కోణాలను వ్యాసరూపంలో అందించిన పుస్తకం. వార్త దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చిన ఈ వ్యాసాలను ప్రగతి ద్వారా పుస్తకరూపంలో తీసుకువచ్చారు.[1][2]
ఉపోద్ఘాతము
[మార్చు]దీనికి డా.శసికళ, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గార్లు ఉపోధ్ఘాతము వ్రాసారు. దాంతో పాటుగా రచయిత తన జీవిత ప్రస్థానంలో ఎక్కువకాలం సినిమా ప్రపంచంలో ఎందరో వ్యక్తులతో కలసి తిరగటం వలన, రామినీడు ద్వారా సినీరంగానికి పరిచయమైన రచయిత తరువాత సినీ సంగీత దర్శకులను, దర్శకులను, గేయరచయితల పరిచయం ద్వారా వాటిపై వ్రాసిన విశ్లేషణల పుస్తకంగా రాసుకొన్నారు.
వ్యాస పరిచయం
[మార్చు]- 125 వ్యాసాలు కలిగిన పుస్తకం. వీటిలో కొన్ని వ్యాసాలు పుస్తకాల గురించి, కొన్ని సంగీతం గురించి, కొన్ని సినిమాల గురించి మరికొన్ని వ్యక్తుల గురించి
- 2002 నుండి 2005 వరకూ వార్త ఆదివారం పుస్తకంలో వ్యాసాలుగా వచ్చాయి.
- ఒక్క తెలుగు మాత్రమే కాక హిందీ, మలయాళం, తమిళ, కన్నడ చిత్ర సీమలలో అనేక వ్యక్తుల గురించి వివరాలు ఉన్నాయి
- సంగీతంలో అనేకరాగాల గురించి ఎవరెవరు ఏ సినిమాలో ఏ సందర్భంలో వాడారో ఉదాహరణలతో కనిపిస్తాయి
ఇతర విశేషాలు
[మార్చు]- రచయిత బొబ్బిలివంశానికి చెందినవారు. పూర్తిపేరు వెంకట ఆనంద కుమార కృష్ణ రంగారావు.
- ఈ వ్యాసాలు రాయడానికి ప్రోత్సహించిన వారు బాపు రమణలు